BigTV English

IRCTC Tour Package: IRCTC టూర్ ప్యాకేజీ.. 6 రోజుల్లో ఈ అద్భుతమైన ప్రదేశాలను చుట్టేయండి.. ధర వివరాలిలా..

IRCTC Tour Package: IRCTC టూర్ ప్యాకేజీ.. 6 రోజుల్లో ఈ అద్భుతమైన ప్రదేశాలను చుట్టేయండి.. ధర వివరాలిలా..
IRCTC Tour Package
IRCTC Tour Package

IRCTC Kashmir Tour Package(Telugu news updates): సీజన్స్ బట్టి చాలామంది టూర్‌లు ప్లాన్ చేసుకుంటారు. సమ్మర్‌లో అయితే చల్ల చల్లని ప్రదేశాలకు, వింటర్‌లో అయితే వెచ్చ వెచ్చని ప్రాంతాలకు వేకేషన్‌ టూర్‌కు వెళ్తుంటారు. అంతేకాదు మరికొందరైతే వింటర్‌లోనే చల్ల చల్లని ప్రాంతాలను చుట్టిముట్టి వస్తుంటారు. అక్కడి అందాలను చూసి పరవసించిపోతారు. రకరకాల ఆచారాలు, సంప్రదాయాలను చూస్తుంటారు.


అందువల్ల మీరు కూడా ఎప్పట్నుంచో మంచి వెకేషన్ టూర్ ప్లాన్ చేస్తున్నట్లయితే మీకో గుడ్ న్యూస్. ప్రముఖ రైల్వే సంస్థ ఐఆర్‌సీటీసీ(IRCTC) అద్భుతమైన టూర్ ప్యాకేజీని తీసుకొచ్చింది. ఎప్పటికప్పుడు టూరిస్టులను దృష్టిలో పెట్టుకొని కొత్త కొత్త ప్యాకేజీలను అందుబాటులో ఉంచుతుంది. అయితే ఈ సారి కూడా అందుబాటు ధరలో, కొత్త కొత్త ప్రదేశాలను చూపించేందుకు రెడీ అయింది.

అయితే మరి ఆ టూర్ ప్యాకేజీ ద్వారా ఏ ఏ ప్రదేశాలు వీక్షించవచ్చు, అది ఎన్ని రోజుల టూర్ ప్యాకేజీ, వాటి ధర ఎంత అనే విషయాలు ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం.


Also Read : పీరియడ్స్ టైంలో నొప్పితో బాధపడుతున్నారా? ఇవి ట్రై చేయండి

IRCTC తాజాగా కాశ్మీర్ టూర్ ప్యాకేజీని ప్రకటించింది. దేశంలో, విదేశాలలో ఉన్న టూరిస్టుల కోసం వివిధ టూర్ ప్యాకేజీలను అందుబాటులో ఉంచింది. ఈ టూర్ ప్యాకేజీలలో పర్యాటకులు రైలు లేదా విమానంలో ప్రయాణిస్తారు. ఈ టూర్ ప్యాకేజీని ‘దేఖో అప్నా దేశ్’ కింద ప్రవేశపెట్టారు. అంటే మీ దేశం వైపు చూడండి అని అర్థం.

ఈ టూర్ ప్యాకేజీ కోల్‌కతా నుంచి స్టార్ట్ అవుతుంది. మొత్తం 6 రోజుల టూర్ ప్యాకేజీ ఇది. దీని ద్వారా పర్యాటకులు మొత్తం 5 రాత్రులు గడిన తర్వాత 6వ రోజు తిరిగి ఇంటికి పయణమవుతారు. ఈ ఐదు రాత్రులు శ్రీనగర్, సోన్‌మార్గ్, గుల్‌మార్గ్, పహల్గామ్‌ల వంటి ప్రదేశాలను చూడవచ్చు. అయితే ఈ టూర్‌ ప్యాకేజీలో పర్యాటకులు విమానంలో ప్రయాణిస్తారు.

ఇది వచ్చే నెల అంటే ఏప్రిల్ 26, మే 17, మే 24 వంటి తేదీల్లో ప్రారంభమవుతుంది. ఈ ప్యాకేజీ ద్వారా పర్యాటకులు డీలక్స్ హూటల్‌లో బస చేస్తారు. అయితే దీని ధర విషయానికొస్తే.. ఈ టూర్ ప్యాకేజీలో సింగిల్‌గా ప్రయాణిస్తే.. ఒక్కొక్కరికి రూ.57,800 చెల్లించారు. అయితే ఇద్దరు వ్యక్తులతో ప్రయాణిస్తే.. ఒక్కొక్కరికి రూ.52,300 చెల్లించాల్సి ఉంటుంది.

Also Read : డైటింగ్ పేరుతో అన్నం తినడం మానేస్తున్నారా? ఏమవుతుందో తెలుసా?

అదే సమయంలో ముగ్గురు వ్యక్తులతో ప్రయాణిస్తే.. ఒక్కొక్కరికి రూ.50,700 చెల్లించారు. అలాగే 5 నుండి 11 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న పిల్లలకు, బెడ్‌తో కూడిన టూర్ ప్యాకేజీ కోసం రూ.40,930 చెల్లించాలి. అయితే ఈ టూర్ ప్యాకేజీ ఏప్రిల్‌లో తక్కువగా ఉంటుంది. అదే మేలో అయితే మరింత ఎక్కువ మొత్తంలో ఉంటుంది.

Related News

Supreme Court: లక్షల వీధి కుక్కలను షెల్టర్లకు తరలించండి.. సుప్రీం సంచలన ఆదేశాలు

Delhi Politics: ఢిల్లీలో రాహుల్, ప్రియాంక అరెస్ట్, భగ్గుమన్న విపక్షాలు, ప్రజాస్వామ్యం కోసమే పోరాటం-సీఎం రేవంత్

Air India: మరో ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. ఫ్లైట్‌లో కాంగ్రెస్ పార్టీ ఎంపీలు

Army rescue: మంచు పర్వతాల మధ్య.. పురిటి నొప్పులతో మహిళ! రంగంలోకి 56 మంది జవాన్స్.. ఆ తర్వాత?

FASTag Annual Pass: వాహనదారులకు శుభవార్త.. ఫాస్టాగ్ వార్షిక పాస్ కావాలా..? సింపుల్ ప్రాసెస్

Bengaluru: బెంగుళూరులో ప్రధాని.. వందే భారత్ రైళ్లు ప్రారంభం, ఆ తర్వాత రైలులో ముచ్చట్లు

Big Stories

×