Coriander Water: ధనియాలను మనం సాధారణంగా వంటకాల్లో వివిధ రకాలుగా వాడుతూనే ఉంటాం. ధనియాలలో శరీరానికి అవసరం అయిన అనేక పోషకాలు ఉంటాయి. అందుకే వీటిని తినడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది. వీటి గింజలను రాత్రిపూట నీటిలో నానబెట్టి, మరుసటి రోజు ఉదయం ఆ నీటిని తాగడం వల్ల అనేక రకాల ఆరోగ్య సమస్యలు కూడా తగ్గుతాయి. ఈ పద్ధతి మన పెద్దల కాలం నుంచి వస్తున్న ఒక సంప్రదాయ చిట్కా. దాని వల్ల కలిగే కొన్ని ముఖ్యమైన ఆరోగ్య ప్రయోజనాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ధనియాల నీరు తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు:
జీర్ణక్రియకు సహాయం:
ధనియాల నీరు జీర్ణక్రియను మెరుగుపరచడంలో చాలా ఉపయోగపడతాయి. ఈ నీరు గ్యాస్, ఉబ్బరం, అజీర్ణం వంటి సమస్యలను తగ్గిస్తుంది. ధనియాలలో ఉండే సమ్మేళనాలు జీర్ణ ఎంజైమ్‌లను ఉత్తేజితం చేసి.. ఆహారం త్వరగా జీర్ణం అయ్యేలా చేస్తాయి. ఈ కారణంగా ఉదయం ఖాళీ కడుపుతో ఈ నీటిని తాగడం చాలా మంచిది.
మధుమేహ నియంత్రణ:
ధనియాల గింజలు రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి. అవి శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తిని మెరుగు పరుస్తాయి. తద్వారా రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. మధుమేహంతో బాధపడేవారు రోజూ ధనియాల నీరు తాగడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
బరువు తగ్గడం:
బరువు తగ్గాలనుకునే వారికి ధనియాల నీరు అద్భుతమైన ఆప్షన్. ఇది జీవక్రియను వేగవంతం చేస్తుంది. అలాగే.. ఇది శరీరంలోని విషపదార్థాలను బయటకు పంపిస్తుంది. శరీరం శుభ్రపడటం వల్ల బరువు తగ్గడం సులభం అవుతుంది. బరువు తగ్గాలని అనుకునే వారు తరచుగా ధనియాల నీరు తాగితే అద్భుతమైన ఫలితాలు ఉంటాయి.
Also Read: తరచుగా తుమ్ముతున్నారా ? కారణాలివేనట !
చర్మం, జుట్టు ఆరోగ్యం:
ధనియాలలో విటమిన్ సి, విటమిన్ కె, ఫోలిక్ యాసిడ్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఈ పోషకాలు చర్మం, జుట్టు ఆరోగ్యానికి చాలా మంచివి. ఈ నీటిని క్రమం తప్పకుండా తాగడం వల్ల చర్మం తాజాగా, కాంతివంతంగా ఉంటుంది. అలాగే.. జుట్టు రాలడం కూడా తగ్గుతుంది.
శరీర వేడిని తగ్గించడం:
వేసవి కాలంలో శరీరంలో వేడి ఎక్కువగా ఉంటే, ధనియాల నీరు తాగడం వల్ల మంచి ఉపశమనం లభిస్తుంది. ఇది శరీరంలో వేడిని తగ్గించి, శరీరాన్ని చల్లగా ఉంచుతుంది. ఇది సహజమైన శీతలీకరణ ఏజెంట్‌గా పనిచేస్తుంది.
తయారీ పద్ధతి:
ఒక టీస్పూన్ ధనియాల గింజలను ఒక గ్లాసు నీటిలో వేసి రాత్రి మొత్తం నానబెట్టాలి. మరుసటి రోజు ఉదయం, ఆ నీటిని వడగట్టి తాగాలి. కావాలంటే, నానిన గింజలను కూడా తినవచ్చు.