EPAPER

PM Modi In Singapore: సింగపూర్‌కు మోడీ.. పెద్ద స్కెచ్చే

PM Modi In Singapore: సింగపూర్‌కు మోడీ.. పెద్ద స్కెచ్చే

సింగపూర్‌ ఇండియా మధ్య కీలక ఒప్పందాలు కుదరనున్నాయి. ఇందులో బిజినెస్‌తో పాటు డిఫెన్స్‌తో పాటు స్ట్రాటజిక్ కోఆపరేషన్‌కు సంబంధించిన ఒప్పందాలు ఉన్నాయి. ఇప్పటికే దీనికి సంబంధించి ఇరు దేశాల ఉన్నతాధికారుల మధ్య చర్చలు కూడా జరిగాయి. కేంద్రమంత్రులు జై శంకర్, పియూష్‌ గోయల్, అశ్విని వైష్ణవ్‌ సింగపూర్‌లో నిర్వహించిన రౌండ్ టేబుల్ మీటింగ్‌లో పాల్గొన్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే.. ఏమేం ఒప్పందాలు చేసుకోవాలి.. ఏయే అంశాలపై చర్చలు జరగాలి. అనేది ఇప్పటికే అయిపోయింది. ఇప్పుడు జస్ట్‌ అఫిషియల్‌గా సైన్ చేస్తారంతే.. ఇండియా గ్రోత్‌లో సింగపూర్‌ భాగం కానుంది. ముఖ్యంగా కొత్త నగరాల నిర్మాణంలో సింగపూర్ ఇన్‌వాల్వ్‌ అయ్యే అవకాశం కనిపిస్తోంది. వీటన్నికంటే ముఖ్యమైనది సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్‌కు సంబంధించి కీలక ఒప్పందం చేసుకోనుంది. ప్రస్తుతం ఇది మనకు చాలా అవసరం.. ఎందుకంటే ఇప్పుడు దీనిపై అమెరికా గుత్తాధిపత్యం నడుస్తోంది. మిగిలింది చైనా కంట్రోల్‌లో ఉంది. దీంతో మనకు డిపెండెన్సీ పెరిగిపోయింది. దీని నుంచి తప్పించుకోవాలంటే మనకు సొంతంగా మ్యానుఫ్యాక్చరింగ్ అవసరం.

మనం సింగపూర్‌కు ఇంత ఇంపార్టెంట్స్‌ ఇవ్వడానికి మరో కారణం కూడా ఉంది. అసలు సింగపూర్ దేశం అనేదే చాలా వ్యూహాత్మక ప్రాంతంలో ఉంది. ఏసియా, యూరప్‌కు సంబంధించిన మేజర్ ట్రేడ్‌ రూట్‌లో ఈ దేశం ఉంటుంది. కేవలం 50 లక్షల మంది జనాభా మాత్రమే ఉన్నా.. వ్యూహాత్మక ప్రాంతంలో ఉండటంతో అన్ని దేశాలు సింగపూర్‌తో సత్సంబంధాలు  చేస్తున్నాయి. సింగపూర్‌ ఫైనాన్షియల్ హబ్‌ మాత్రమే కాకుండా.. ట్రెడ్ అండ్ లాజిస్టిక్‌ హబ్‌ కూడా.. అందుకే విస్తిర్ణం పరంగా చాలా చిన్నదేశమైనా.. ఇన్‌ఫ్లూయెన్స్‌ విషయంలో చాలా ముందు ఉంది.


Also Read: హర్యాణా ఎన్నికల బరిలో వినేశ్ ఫోగట్, బజరంగ్ పునియా.. రాహుల్ గాంధీతో మీటింగ్!

సింగపూర్‌ను మనం అక్కున చేర్చుకోవడానికి వీటితో మరో కారణం కూడా ఉంది.. అదే చైనా.. సౌత్ చైనా సీ, ఇండియన్‌ ఓషియన్, పసిఫిక్‌ ఓషియన్‌ను కనెక్ట్ చేస్తుంది సింగపూర్.. ఇప్పటికే సౌత్ చైనా సీను చైనా తన గుప్పిట్లో పెట్టుకుంది. ఇప్పుడు సింగపూర్‌ను కూడా తన కంట్రోల్‌లోకి తీసుకోకముందే ఇండియా అలెర్ట్ అవ్వాల్సిన పరిస్థితి ఉంది. ఇండియా, సింగపూర్‌ మధ్య కల్చరల్‌ కనెక్షన్ ఉంది. దీంతో పాటు ఇరు దేశాల మధ్య డిఫెన్స్‌ విషయంలో కూడా చాలా ఏళ్లుగా బంధం ఉంది. లాస్ట్ టెన్ ఇయర్స్‌లో ఈ బంధం మరింత బలపడింది. అంతేకాదు ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌ ఫైటర్‌ జెట్స్‌ సింగపూర్‌ బేస్‌లను ట్రైనింగ్ మిషన్స్‌ కోసం వాడుకుంటున్నాయి. అంతేకాదు ఇండియన్ నేవీకి చెందిన షిప్స్‌కు చాంఘై నావల్ బేస్‌లోకి ఎంట్రీ ఉంటుంది. రిఫ్యూయల్, రీస్టాక్‌, రీఆర్మ్‌కు సంబంధించి ఇండియా సింగపూర్‌తో ఒప్పందం చేసుకుంది.

ఇక ట్రేడింగ్ విషయానికి వస్తే.. ఏసియన్ దేశాల్లో భారత్ ట్రేడ్ చేసే దేశాల్లో సింగపూర్ సెకండ్ ప్లేస్‌లో ఉంది. ఇరు దేశాల మధ్య 30 బిలియన్ డాలర్ల వర్తకం జరుగుతోంది. సింగపూర్ ఇన్వెస్టర్లు కూడా ఇండియాలో భారీగానే పెట్టుబడులు పెట్టారు. సింగపూర్‌ మనకు ఇంత అనుకూలంగా ఉండటానికి కూడా కారణాలు ఉన్నాయి. 1965లో సింగపూర్‌కు స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత చైనా, ఇండోనేషియా, మలేసియా పెత్తనం నుంచి కాపాడుకోవడానికి ఇండియా సహకరించింది. అందుకే సింగపూర్‌ కూడా భారత్ విషయంలో ఎప్పుడూ సానుకూలంగానే ఉంటూ వస్తోంది. ఓ రకంగా చైనా ఇన్‌డైరెక్ట్ బెదిరింపులు కూడా ఈ దేశాలను మనకు దగ్గర చేస్తున్నాయి. ఈసారి మోడీ పర్యటనలో కూడా ఈ రెండు దేశాలతో చాలా కీలక ఒప్పందాలు జరగననున్నాయి.

Related News

Rahul Gandhi: ఖర్గే, నడ్డాల లేఖల యుద్ధం

Toxic Workplace: వర్క్ ప్రెజర్‌ తట్టుకోలేక ప్రైవేట్ ఉద్యోగిని మృతి.. రంగంలోకి దిగిన సర్కారు

Delhi CM: ఢిల్లీ సీఎంగా అతిశీ ప్రమాణానికి డేట్ ఫిక్స్

Rahul Gandhi Vs Ravneet Bittu: జాతీయ పార్టీల అధినేతల మధ్య లేఖల యుద్ధం..

Monkeypox Case in India: భారత్‌ను వణికిస్తున్న మంకీపాక్స్.. రెండో కేసు నమోదు.

Train accident in Uttar Pradesh: పట్టాలు తప్పిన మరో రైలు.. రైళ్ల రాకపోకలకు అంతరాయం

Bank Holidays: ఖాతాదారులకు బిగ్ అలర్ట్.. అక్టోబర్‌లో భారీగా సెలవులు..ఎన్ని రోజులంటే?

Big Stories

×