OTT Movie : హారర్ థ్రిల్లర్ అభిమానులకు, సీట్ ఎడ్జ్ థ్రిల్ ఇచ్చే ఒక హాలీవుడ్ సినిమా ఓటీటీలో అందుబాటులో ఉంది. ఊహించని ట్విస్ట్‌లతో ఈ సినిమా వణుకు పుట్టిస్తుంది. ఇది ఒక గుడ్డి వ్యక్తి ఇంట్లో దొంగతనం చేయడానికి ప్రయత్నించే ముగ్గురు యువకుల కథ. ఇది సాటర్న్ అవార్డ్స్ 2017లో బెస్ట్ హారర్ ఫిల్మ్‌కు నామినేట్ అయింది, కానీ గెలవలేదు. ఈ సినిమా పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళ్తే …
ఎందులో ఉందంటే
‘డోంట్ బ్రీత్’ (Don’t breathe) 2016లో విడుదలైన అమెరికన్ హారర్ థ్రిల్లర్ చిత్రం. ఇది ఫెడే ఆల్వారెజ్ దర్శకత్వంలో రూపొందింది. ఇందులో జేన్ లెవీ (రాకీ), డైలాన్ మిన్నెట్ (అలెక్స్), డేనియల్ జోవాట్టో (మనీ), స్టీఫెన్ లాంగ్ (నార్మన్ ) ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా 2016 ఆగస్టు 26న థియేటర్లలో విడుదలై, $10 మిలియన్ బడ్జెట్‌తో $157.8 మిలియన్ వసూలు చేసింది. IMDbలో 7.1/10 రేటింగ్ నిపొందింది. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, ఆపిల్ టీవీ, ఫండాంగో ఎట్ హోమ్‌లో ఈ సినిమా అందుబాటులో ఉంది.
కథలోకి వెళ్తే
రాకీ, ఆమె బాయ్‌ఫ్రెండ్ మనీ, స్నేహితుడు అలెక్స్ ఇళ్లలో దొంగతనం చేస్తూ జీవనం సాగిస్తుంటారు. వీళ్ళు ఒక పెద్ద దొంగతనం చేయాలనుకుంటారు. ఒంటరిగా ఉండే నార్మన్ అనే ఒక గుడ్డి వృద్ధుడి ఇంట్లో $300,000 నగదు ఉందని తెలుస్తుంది. వాళ్ళు ఇది సులభమైన దొంగతనంగా భావించి రాత్రి ఇంట్లోకి చొరబడతారు. కానీ నార్మన్ ఒక మాజీ ఆర్మీ వెటరన్. అత్యంత ప్రమాదకరమైనవాడని తెలుస్తుంది. అతని గుడ్డితనం ఉన్నప్పటికీ, అతను అద్భుతమైన వినికిడి, శారీరక శక్తితో వారిని వేటాడటం ప్రారంభిస్తాడు. ముందుగా మనీని తుపాకీతో కాల్చి చంపుతాడు. రాకీ, అలెక్స్ ఆ ఇంట్లో చిక్కుకుంటారు.
నార్మన్ తన రోట్‌వీలర్ కుక్కను వారిపై వదులుతాడు. రాకీ, అలెక్స్ బయటపడేందుకు ప్రయత్నిస్తున్నప్పుడు, ఇంటి బేస్‌మెంట్‌లో ఒక సీక్రెట్ బయటపడుతుంది. నార్మన్ ఒక మహిళను బేస్‌మెంట్‌లో బంధించి ఉంచాడు. ఆమె అతని కుమార్తె మరణానికి కారణమై ఉంటుంది. ఇదంతా ఒక కారు ప్రమాదంలో జరిగి ఉంటుంది. ఆ తరువాత నార్మన్ ఆమెను గర్భవతిని చేసి, తన కుమార్తె స్థానంలో ఒక బిడ్డను పొందాలని ప్లాన్ చేస్తాడు. రాకీ, అలెక్స్ ఆమెను విడిపించడానికి ప్రయత్నిస్తారు. ఈ సమయంలో స్టోరీ ఊహించని మలుపు తీసుకుంటుంది. వీళ్లంతా అక్కడి నుంచి బయటపడతారా ? నార్మన్ చేతిలో బలవుతారా ? అనే విషయాలను ఈ సినిమాను చూసి తెలుసుకోవాల్సిందే.
Read Also : ప్రియుడు లేడని అంకుల్ తో … ఇద్దరు బాయ్ ఫ్రెండ్స్ తో అన్నీ అలాంటి సీన్లే … ఇలాంటి సినిమాలు చుస్తే