September Holidays: ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా.. అసౌకర్యం కలగకుండా ఉండేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ప్రతి నెల ప్రారంభానికి రెండు, మూడు రోజుల ముందే సెలవుల జాబితాను విడుదల చేస్తుంది. తాజా సెప్టెంబర్ నెలకు సంబంధించిన సెలవుల జాబితాను ఆర్బీఐ రిలీజ్ చేసింది. ఈ నెలలో పండుగలు, వారాంతాలతో కలుపుకుని దాదాపు నెలలో సగం రోజుల పాటు బ్యాంకులకు సెలవులు వచ్చాయి. అయితే, ఆర్బీఐ విడుదల చేసిన బ్యాంక్ సెలవులు అన్ని రాష్ట్రాలకు వర్తించదు. ఆ రాష్ట్రాలకు సంబంధించిన ప్రాంతీయ వేడుకలు, పండుగల ప్రకారం సెలవులు ఉంటాయి. అయితే దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని బ్యాంకులకు పబ్లిక్ హాలీడేస్ మాత్రం కామన్‌గా ఉంటాయి.
⦿ వారాంతపు సెలవులు..
➼సెప్టెంబర్ 7: ఆదివారం
➼సెప్టెంబర్ 14: ఆదివారం
➼సెప్టెంబర్ 21: ఆదివారం
➼సెప్టెంబర్ 27: నాలుగో శనివారం
➼సెప్టెంబర్ 28: ఆదివారం
⦿ పండుగ సెలవులు చూసినట్లయితే..
➼సెప్టెంబర్ 3 (బుధవారం) : కర్మ పూజ (జార్ఖండ్, ఒడిశా, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాల్లో సెలవు ఉంటుంది)
➼సెప్టెంబర్ 4 (గురువారం) : ఓనం పండుగ (కేరళ రాష్ట్రంలో..)
➼సెప్టెంబర్ 5 (శుక్రవారం) : మిలాద్ ఉన్ నబీ (కొన్ని నగరాల్లో సెలవు ఉంటుంది. అహ్మదాబాద్, ఐజ్వాల్, బేలాపూర్, ➼చెన్నై, బెంగళూరు, రాంచీ, న్యూఢిల్లీ, శ్రీనగర్, సిక్కిం, జమ్ము నగరాల్లో బ్యాంకులకు సెలవు ఉంటుంది)
➼సెప్టెంబర్ 6 (శనివారం) : ఇంద్రజాత్ర పండుగ (సిక్కిం, జమ్ము, శ్రీనగర్ లో బ్యాంకులకు సెలవు ఉంటుంది)
➼సెప్టెంబర్ 22: మహారాజ్ హరిసింగ్ జన్మదినం సందర్బంగా జమ్ముకశ్మీర్ లో బ్యాంకులకు సెలవు ఉంటుంది.
➼సెప్టెంబర్ 29,30: మహాసప్తమి, అష్టమి సందర్భంగా వెస్ట్ బెంగాల్, అస్సాం, ఒడిశా, త్రిపుర రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవు ఉంటుంది.
⦿ బ్యాంకులు మూసివేతకు గురైనప్పటికీ…
పండుగల సందర్భంగా బ్యాంకులు మూసివేతకు గురైనప్పటికీ.. డిజిటల్ బ్యాంకింగ్ సేవలు అందుబాటులో ఉంటాయి. యూపీఐ, ఆన్‌లైన్ బ్యాంకింగ్, మొబైల్ యాప్‌లు, ఏటీఎంలు ఈ సెలవు దినాల్లో కూడా పని చేస్తాయి. కాబట్టి ఆర్థిక లావాదేవీలు చేయాలనుకునే వారు ఈ సేవలను వినియోగించుకోవచ్చు. సెప్టెంబర్ నెలలో బ్యాంకు సెలవులు రాష్ట్రాలను బట్టి మారుతాయి. మొత్తంగా సెప్టెంబర్ లో తొమ్మిది పండుగ సెలవులు, ఐదు వారాంత సెలవులు ఉంటాయి. ఈ సమాచారం ఆధారంగా.. బ్యాంకు సంబంధిత పనులను ముందుగానే ప్లాన్ చేసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. డిజిటల్ సేవలు అందుబాటులో ఉన్నందున, అత్యవసర ఆర్థిక అవసరాలకు పెద్దగా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉండదు.
ALSO READ: Railway Jobs: ఇండియన్ రైల్వేలో భారీగా ఉద్యోగాలు.. అప్లికేషన్ ఫీజు జస్ట్ రూ.40.. ఇదే మంచి అవకాశం
ALSO READ: Jobs: టెన్త్, ఇంటర్ అర్హతలతో సీసీఆర్ఏఎస్‌లో ఉద్యోగాలు.. మంచి వేతనం.. రేపే లాస్ట్ డేట్ మిత్రమా