BigTV English

PM Modi Gujarat Tour Highlights: దేశంలో పొడవైన కేబుల్ బ్రిడ్జ్.. సుదర్శన్ సేతును ప్రారంభించిన మోదీ..

PM Modi Gujarat Tour Highlights: దేశంలో పొడవైన కేబుల్ బ్రిడ్జ్.. సుదర్శన్ సేతును ప్రారంభించిన మోదీ..

PM Modi inaugurates India's longest cable-stayed Sudarshan Setu bridge in Dwarka


PM Modi Gujarat Tour Highlights : ప్రధాని నరేంద్ర మోదీ దేశంలోనే అతి పొడవైన కేబుల్ బ్రిడ్జ్ ను ప్రారంభించారు. గుజరాత్ రాష్ట్రంలోని ద్వారకలో ఈ తీగల వంతెనను నిర్మించారు. ఈ బ్రిడ్జి పొడవు 2.3 కిలోమీటర్లు. ఈ వంతెన నిర్మాణానికి 979 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు.

Read More: రైతులకు కేంద్రం శుభవార్త.. అకౌంట్‌లో డబ్బులు పడేది ఆ రోజే..


దేశంలోనే అతిపొడవైన ఈ కేబుల్ బ్రిడ్జ్ కు సుదర్శన్ సేతు అని నామకరణం చేశారు. ఈ వంతెన నిర్మాణంతో ఓఖా ప్రాంతం.. బెట్ ద్వారకా తో అనుసంధానమైంది. 2017 అక్టోబర్ లో ప్రధాని మోదీ సుదర్శన్ సేతు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.

4 వరుసలతో ఈ వంతెనను నిర్మించారు. బ్రిడ్జ్ వెడల్పు 27.20 మీటర్లు. ఇందులోనే ఫుట్‌పాత్‌ ను ఏర్పాటు చేశారు. పుట్ పాత్ వెడల్పు 2.5 మీటర్లు. వంతెనకు ఇరువైపులా భగవద్గీత శ్లోకాలు, శ్రీకృష్ణుడి చిత్రాలు పొందుపర్చారు. బ్రిడ్జిపై సోలార్‌ ప్యానళ్లు అమర్చారు. దీని ద్వారా మెగావాట్‌ విద్యుత్తు ఉత్పత్తి చేస్తారు.

ప్రధాని గుజరాత్ పర్యటనలో ద్వారక ఆలయాన్ని సందర్శించారు. ఈ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.

ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్‌గా 5 ఎయిమ్స్ హాస్పిటళ్లను ప్రారంభించారు. అందులో ఆంధ్రప్రదేశ్‌లోని మంగళగిరి ఎయిమ్స్ కూడా ఉంది.

Tags

Related News

Ladakh: లద్దాఖ్‌లోని లేహ్‌లో టెన్షన్ టెన్షన్..!

Missile from Rail: దేశంలో తొలిసారి రైలు మొబైల్ లాంచర్.. అగ్ని-ప్రైమ్ క్షిపణి ప్రయోగం సక్సెస్

CBSE 10th And 12th Exams: సీబీఎస్ఈ 10, 12వ తరగతుల బోర్డ్ ఎగ్జామ్స్ షెడ్యూల్ వచ్చేసింది

Medical Seats Hike: దేశ వ్యాప్తంగా 10 వేల మెడికల్ సీట్ల పెంపు.. కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్

Railway Employees Bonus: రైల్వే ఉద్యోగులకు గుడ్ న్యూస్.. 78 రోజుల పండుగ బోనస్ ప్రకటించిన కేంద్రం

Encounter: ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ.. ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మావోయిస్టులు మృతి

JammuKashmir News: లడక్‌కు రాష్ట్ర హోదా కోసం ఆందోళనలు.. బీజేపీ ఆఫీసుకు నిప్పు

UP News: విద్యా అధికారిని కొట్టిన హెచ్ఎం.. 5 సెకన్లలో 4 సార్లు బెల్టుతో ఎడాపెడా, ఆపై సస్పెండ్

Big Stories

×