BigTV English
Advertisement

Houthi missile attack on US: అమెరికా చమురు నౌకపై హౌతీల క్షిపణి దాడి

Houthi missile attack on US: అమెరికా చమురు నౌకపై హౌతీల క్షిపణి దాడి

houthis claim direct missile attack on us warship in red sea


గాజాలో పాలస్తీనియన్లకు సంఘీభావంగా ఎర్ర సముద్రంలో హౌతీల దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా గల్ప్ ఆఫ్ ఏడెన్‌లో అమెరికాకు చెందిన చమురు నౌకపై క్షిపణి దాడికి పాల్పడ్డారు. అయితే దానిని మధ్యలోనే కూల్చివేసినట్టు యూఎస్ సెంట్రల్ కమాండ్(సెంట్ కామ్) తెలిపింది.


హౌతీల నియంత్రణలో ఉన్న యెమెన్ నుంచి ఆ మిస్సైల్ దూసుకువచ్చిందని పేర్కొంది. గాజాపై ఇజ్రాయెల్ దాడులు ఆరంభించిన నవంబర్ 19 నాటి నుంచి హౌతీలు డ్రోన్లు, మిస్సైళ్లతో వాణిజ్యనౌకలపై విరుచుకుపడుతూనే ఉన్నారు.

Read more: న్యూయార్క్ లో అగ్నిప్రమాదం.. భారత జర్నలిస్టు మృతి

మరోవైపు యెమెన్‌లోని హౌతీలపై అమెరికా, బ్రిటన్ తాజాగా దాడులు చేశాయి.8 ప్రాంతాల్లో మొత్తం 18 లక్ష్యాలను నేలమట్టం చేశాయి. వీటిలో ఆయుధాగారం కూడా ఉంది. అటాక్ డ్రోన్లు, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్, రాడార్లు, ఓ హెలికాప్టర్ ఆ ఆయుధాగారంలో ఉన్నట్టు తెలుస్తోంది.

హౌతీ రెబెల్స్ దాడులు ఆరంభమైన తర్వాత అమెరికా, బ్రిటన్ ప్రతి దాడులకు దిగడం ఇది నాలుగోసారి. ఈ నెలలో రెండో దాడి. ఇప్పటివరకు హౌతీలు వాణిజ్యనౌకలను లక్ష్యంగా చేసుకుని 45 సార్లు దాడులకు దిగారు.

 

Tags

Related News

Elon Musk: ఎలాన్ మస్క్‌కు లక్ష కోట్ల డాలర్ల ప్యాకేజీ.. ఇంత డబ్బుతో ఏం చేస్తున్నాడు?

Helicopter Crash: కళ్ల ముందే కుప్పకూలిన ఆర్మీ హెలికాప్టర్.. స్పాట్‌లో 7 మంది!

United States: డయాబెటిస్‌, ఒబెసిటీ ఉంటే.. అమెరికా వీసా కష్టమే!

Crime News: 10 మంది రోగులను చంపేసిన నర్స్.. కావాలనే అలా చేశాడట, ఎందుకంటే?

Nvidia: ఎన్విడియా పై చైనా నిషేధం.. భారత్ స్టార్టప్ లకు ఇలా కలిసొస్తోంది..

New York First Lady: న్యూయార్క్ ఫస్ట్ లేడీ రామా దువ్వాజి ఎంత ఫేమస్సో తెలుసా?

America News: అమెరికాలో ఎన్నికలు.. అధికార పార్టీకి ఝలక్, వర్జీనియా లెఫ్టినెంట్‌ గవర్నర్‌‌గా హైదరాబాద్ మహిళ

NYC Mayor Election-2025: న్యూయార్క్‌ మేయర్ ఎన్నికలు..ట్రంప్‌కు ఝలక్, భారతీయడికే పీఠం

Big Stories

×