BigTV English

PM Modi: ఇది ట్రైలర్ మాత్రమే.. ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు నాయుడు భేటీ

PM Modi: ఇది ట్రైలర్ మాత్రమే.. ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు నాయుడు భేటీ

PM Modi: ఆర్థిక వ్యవస్థల్లో భారత్‌ను మూడో స్థానంలో నిలబెట్టడమే తమ ధ్యేయమన్నారు ప్రధాని నరేంద్రమోదీ. దీనికి అనుగుణంగా కోట్లాది మంది భారతీయులు పని చేస్తున్నారని చెప్పుకొచ్చారు. 2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా చేయాలనేది మా కార్యచరణగా చెప్పుకొచ్చారు.


కేంద్రంలో మూడోసారి మా ప్రభుత్వం ఏర్పడిన 100 రోజుల్లో తీసుకున్న ప్రణాళికకు సంబంధించి ట్రైలర్ కనిపిస్తుందన్నారు. సోమవారం గుజరాత్‌లో జరుగుతున్న కేంద్ర ఇంధన మంత్రిత్వ శాఖ ఆధర్యంలో జరుగుతున్న నాలుగో గ్లోబర్ రెన్యువబుల్ ఎనర్జీ ఇన్వెస్టర్ల సదస్సు హాజరయ్యారు. మూడురోజులపాటు జరుగుతున్న ఈ సదస్సును ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించారు.

ఈ సందర్భంగా మాట్లాడిన ప్రధాని.. 21వ శాతాబ్దానికి భారత్ అత్యుత్తమ దేశంగా ఉంటుందని భారతీయులేకాదు, ప్రపంచం మొత్తం భావిస్తోందన్నారు. డైవర్సిటీ, స్థాయి, సామర్థ్యం, పనితీరు ప్రత్యేకమైనవి గా చెప్పుకొచ్చారు. రాబోయే వెయ్యేళ్లకు పునాది వేస్తోందన్నారు. ఉన్నత స్థాయికి చేరడం కాదని, అగ్రస్థానంలో నిలపడమే ధ్యేయమన్నారు.


అభివృద్ధి చెందిన దేశంగా ఎదిగేందుకు తన శక్తి సామర్థ్యాలు భారత్‌కు తెలుసన్నారు. సదస్సు ప్రారంభానికి ముందు వివిధ స్టాల్స్‌ను పరిశీలించారు ప్రధాని నరేంద్రమోదీ. వాటి గురించి అడిగి తెలుసుకున్నారు. ఏపీ, తెలంగాణ, గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, కర్ణాటక, యూపీ రాష్ట్రాలు ఈ సదస్సు భాగస్వామిగా వ్యవహరిస్తున్నాయి.

ALSO READ: వాజ్ పేయి సిద్ధాంతాలతో.. పార్టీ పేరు ప్రకటించిన యశ్వంత్ సిన్హా

ఏపీ సీఎం చంద్రబాబు మాట్లాడుతూ ఇంధన రంగంలో అవకాశాలను అందిపుచ్చుకునేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. సదస్సు ప్రారంభోత్సవానికి ముందు ప్రధాని మోదీతో కలిసి మాట్లాడారాయన. ఏపీలో పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి అవకాశాలపై చర్చించేందుకు సిద్ధమన్నారు. ఈ రంగంలో పెట్టుబడులకు సానుకూల వాతావారణ ఉండాలన్నారు. ఇలాంటి సదస్సు ఎంతగానో ఉపయోగపడ తాయన్నారు సీఎం చంద్రబాబు.

 

Related News

Income Tax Bill: వెనక్కి తగ్గిన మోదీ సర్కార్.. ఆ బిల్ విత్ డ్రా

Gold mining news: ఆ జిల్లాలో అంతా బంగారమే.. తవ్వితే చాలు వచ్చేస్తోంది.. ఎంత అదృష్టమో!

Raksha Bandhan 2025: రక్షా బంధన్ స్పెషల్.. మహిళలకు బంపరాఫర్, ఉచిత బస్సు ప్రయాణం

Rahul Gandhi: ఒక సింగిల్ బెడ్ రూం ఇంట్లో 80 మంది ఓటర్లు ఉన్నారట…

Jammu Kashmir: లోయలో పడిన ఆర్మీ వాహనం.. ఇద్దరు జవాన్లు మృతి, 12 మందికి గాయాలు..

Cloudburst: ఉత్తరాఖండ్‌లో ప్రళయం.. పదే పదే ఎందుకీ దుస్థితి.. కారణం ఇదేనా!

Big Stories

×