BigTV English

Pakistan : పాక్ సైన్యం ప్రార్థనలు చేసే లోపే.. భారత్ ఎలా అటాక్ చేసిందో చెప్పిన పాక్ ప్రధాని..

Pakistan : పాక్ సైన్యం ప్రార్థనలు చేసే లోపే.. భారత్ ఎలా అటాక్ చేసిందో చెప్పిన పాక్ ప్రధాని..

Pakistan : పాకిస్తాన్‌పై భారత్ విరుచుకుపడింది. 25 నిమిషాల్లో 9 ప్రాంతాల్లో అటాక్ చేసింది. దాయాది దేశంలోని ఉగ్రవాద క్యాంపులను ధ్వంసం చేసింది. తీవ్రంగా దెబ్బతిన్న పాక్.. భారత్‌పై రివేంజ్ దాడులకు సిద్ధమైంది. ఆర్మీ అధికారులంతా బాగా చర్చించి, రకరకాల వ్యూహాలు సిద్దం చేసి.. దాడుల ప్రణాళికలను పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌కు వివరించారు. ఆయన సైతం అటాక్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దాడులకు మంచి ముహూర్తం కూడా పెట్టుకున్నారు. మే 10, ఉదయం 4.30 గంటలకు. తెల్లవారుజాము ప్రార్థనల తర్వాత.. ఆ అల్లా ఆశీస్సులతో భారత్‌పై అటాక్ చేయాలని పాక్ డిసైడ్ అయింది. కానీ.. పాక్ ఒకటి ప్లాన్ చేస్తే.. ఇండియా మరోలా షాక్ ఇచ్చింది. ఒకసారి యుద్ధమంటూ మొదలైతే.. ప్రతీ క్షణం కీలకమైనదే అనే లాజిక్‌ను పాకిస్తాన్ మరిచింది. భారత్ బాగా గుర్తించింది. అందుకే, పాకిస్తాన్ ఎర్లీ మార్నింగ్ కోసం వెయిట్ చేస్తుంటే.. ఇండియా అర్థరాత్రే మిస్సైళ్లతో అటాక్ చేసి మైండ్ బ్లాక్ చేసేసింది. బ్రహ్మోస్ క్షిపణులతో పాక్ ఎయిర్‌బేస్‌లను ధ్వంసం చేసి పడేసింది. ఊహించని ఆ ఎదురు దాడితో.. దాయాదికి దిమ్మ తిరిగి పోయింది. ఈ విషయం స్వయంగా ఆ దేశ ప్రధానే బయటపెట్టడం ఆసక్తికరం.


వామ్మో బ్రహ్మోస్..

ఉదయాన్నే ప్రార్థనలు చేసుకుని దాడి చేద్దామనుకునేలోపే.. బ్రహ్మోస్‌తో భారత్ ఊహించని షాక్‌ ఇచ్చిందంటూ గగ్గోలు పెట్టారు పాక్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్. మే 9, 10 తేదీల మధ్య రాత్రి రావల్పిండి విమానాశ్రయం సహా.. కీలకమైన సైనిక స్థావరాలపై దాడి చేసిందన్నారు. భారతదేశం బ్రహ్మోస్ క్షిపణులను ప్రయోగించినప్పుడు తమ సైన్యం అప్రమత్తంగా లేదంటూ అంగీకరించారు.


ఉదయం ముహూర్తం.. అర్థరాత్రే అటాక్

అజర్‌బైజాన్‌లో పాక్‌ మిత్ర దేశాలతో జరిగిన కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారాయన. అసిమ్ మునీర్ నేతృత్వంలోని పాక్ సైన్యం మే 10న ఉదయం ప్రార్థనల తర్వాత.. 4 గంటల 30 నిమిషాలకు ఇండియాపై అటాక్ చేయాలని ప్లాన్ చేసిందని షరీఫ్ అన్నారు. అయితే, తెల్లవారక ముందే, పాకిస్తాన్‌లోని వివిధ ప్రావిన్సులపై భారత్ తన లాంగ్ రేంజ్ సూపర్‌సోనిక్ బ్రహ్మోస్ క్రూయిజ్ క్షిపణులతో భీకర దాడి చేసిందని ప్రధాన మంత్రి అన్నారు.

ఆర్మీ చీఫ్ బెదిరిపోయాడు..

ఇండియా అటాక్ చేసినప్పుడు దేశాన్ని రక్షించుకోవడం మినహా తమకు మరో దారి లేకుండా పోయిందన్నారు. అంటే, ప్రతిదాడి చేసే ఛాన్స్ కూడా భారత్ ఇవ్వలేదని పరోక్షంగా అంగీకరించారు. ఇండియాతో కాల్పుల విరమణ చేసుకోవాలంటూ తమ ఆర్మీ చీఫ్ మునీర్ సలహా ఇచ్చాడని.. తాను సైతం అందుకు ఓకే అన్నానని చెప్పుకొచ్చారు పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్. ఆ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.

Related News

Raksha Bandhan 2025: రక్షా బంధన్ స్పెషల్.. మహిళలకు బంపరాఫర్, ఉచిత బస్సు ప్రయాణం

Rahul Gandhi: ఒక సింగిల్ బెడ్ రూం ఇంట్లో 80 మంది ఓటర్లు ఉన్నారట…

Jammu Kashmir: లోయలో పడిన ఆర్మీ వాహనం.. ఇద్దరు జవాన్లు మృతి, 12 మందికి గాయాలు..

Cloudburst: ఉత్తరాఖండ్‌లో ప్రళయం.. పదే పదే ఎందుకీ దుస్థితి.. కారణం ఇదేనా!

Sunil Ahuja: ఐటీ రైడ్స్ భయం.. దేశం వదిలిన సునీల్ ఆహుజా? ఏం జరిగింది?

Breaking: కుప్పకూలిన హెలికాప్టర్.. మంత్రులు మృతి

Big Stories

×