BigTV English
Advertisement

OTT Movie : ఉన్నట్టుండి గాల్లోకి ఎగిరే అమ్మాయి… కనీవినీ ఎరుగని రోగం సామీ ఇది

OTT Movie : ఉన్నట్టుండి గాల్లోకి ఎగిరే అమ్మాయి… కనీవినీ ఎరుగని రోగం సామీ ఇది

OTT Movie : సామాన్యుడు కూడా తమ టాలెంట్ ను షార్ట్ ఫిల్మ్ ద్వారా నిరూపించుకుంటున్నాడు. ఒక సెల్ ఫోన్ తో వీటిని తీస్తూ, సోషల్ మీడియాలో తమ ప్రతిభను చాటుకుంటున్నారు. మంచి కంటెంట్ ఉన్న వాటికి అవార్డులు కూడా వస్తున్నాయి. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే షార్ట్ ఫిల్మ్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఇందులో ఒక మహిళకు వింత వ్యాధి వస్తుంది. ఆతరువాత స్టోరీ కొంచెం కామెడీ, మరి కొంచెం ట్రాజిడీతో నడుస్తుంది. ఈ షార్ట్ ఫిల్మ్ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే ..


స్టోరీలోకి వెళితే

సారా తన భర్త డేవ్, టీనేజ్ కూతురు కార్లీతో కలిసి సాధారణ జీవితం గడుపుతూ ఉంటుంది. ఒక రోజు సారాకు ఒక అరుదైన, వింతైన అనారోగ్యం బారిన పడుతుంది. దీని వల్ల ఆమె శరీరం నెమ్మదిగా భూమి నుండి పైకి లేచి గాలిలో తేలడం ప్రారంభిస్తుంది. ఈ అనారోగ్యం కారణంగా ఆమె నీటిలో కూడా తేలుతూ ఉంటుంది. సారా గదిలో తేలుతూ ఉంటే, ఆమె కుటుంబం ఆమెకు టీ కప్పు అందించడానికి కూడా చాలా కష్టపడాల్సి వస్తుంది. ఆమె జుట్టును కత్తిరించడానికి నిచ్చెనలు ఉపయోగించాల్సి వస్తుంది. మొదట్లో ఈ పరిస్థితి కొంత వింతగా, కామిడీ గా అనిపిస్తుంది. ఆ తరువాత ఈమె క్రమంగా ఎత్తుకు ఎదుగుతూ ఉంటుంది.


చివరికి ఆమె కార్మన్ లైన్ (భూమి వాతావరణం, అంతరిక్షం మధ్య సరిహద్దుకు) వెళ్ళిపోతుంది. అయితే సారా ఎక్కువ ఎత్తుకు ఎగురుతూ వెళ్ళడంతో, ఈ పరిస్థితి హాస్యం నుండి విషాదంగా మారుతుంది. ఆమెను భూమిపై ఉంచడానికి డేవ్ క్రేన్‌లు, తాడులు వంటి సాధనాలను ఉపయోగిస్తాడు. కానీ ఆమెను అవేమీ ఆపలేకపోతాయి. చివరికి సారా ఏమౌతుంది ? ఆమె మళ్ళీ భూమి వైపు తిరిగి వస్తుందా ? తన కుటుంబం దీని వల్ల ఎలాంటి సమస్యలను ఎదుర్కుంటుంది ? అనే విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే, ఈ బ్రిటిష్ షార్ట్ ఫిల్మ్ ను మిస్ కాకుండా చూడండి.

Read Also : కూతురి కళ్ల ముందే తండ్రి దారుణం… ప్రేమించిన అమ్మాయి కోసం ఊహించని పని చేసే హీరో

 

యూట్యూబ్ (Youtube) లో

ఈ బ్రిటిష్ షార్ట్ ఫిల్మ్ పేరు ‘ది కర్మన్ లైన్’ (The Kármán Line). 2014 లో వచ్చిన ఈ షార్ట్ ఫిల్మ్ కి ఆస్కార్ షార్ప్ డైరెక్ట్ చేశారు.ఇందులో ఒలివియా కోల్మన్, షాన్ డూలీ, చెల్సియా కోర్ఫీల్డ్ ప్రధాన పాత్రల్లో నటించారు. దాదాపు 24 నిమిషాల పాటు ఉన్న ఈ షార్ట్ ఫిల్మ్ ఆలోచనలో పడేస్తుంది.ఒక తల్లికి వచ్చిన వింత వ్యాధి చుట్టూ ఈ షార్ట్ ఫిల్మ్ స్టోరీ తిరుగుతుంది. యూట్యూబ్ (Youtube) లో ఈ షార్ట్ ఫిల్మ్ అందుబాటులో ఉంది.

Related News

OTT Movie : ‘గేమ్ ఆఫ్ థ్రోన్’కు మించిన కంటెంట్ ఉన్న సిరీస్ మావా… అస్సలు వదలొద్దు

Phaphey Kuttniyan OTT : అందంగా దోచుకునే అమ్మాయిలు… కామెడీ మూవీకి క్రైమ్ ట్విస్ట్… 3 నెలల తరువాత ఓటీటీలోకి

Mithra Mandali OTT : ఓటీటీలోకి ‘మిత్రమండలి’… రీ-లోడెడ్ వెర్షన్ వర్కౌట్ అవుతుందా ?

November 2025 OTT releases : ‘ఫ్యామిలీ మ్యాన్ 3’ నుంచి ‘స్ట్రేంజర్ థింగ్స్ 5’ వరకు… ఈ నెల ఓటీటీలో మోస్ట్ అవైటింగ్ సిరీస్ లు

OTT Movie : ‘గర్ల్ ఫ్రెండ్’ రిలీజ్ కంటే ముందు చూడాల్సిన రష్మిక మందన్న టాప్ 5 మూవీస్… ఏ ఓటీటీలో ఉన్నాయంటే ?

OTT Movie : టీనేజర్ల పాడు పనులు… బాయ్ ఫ్రెండ్ ను ఊహించుకుని… చిన్న పిల్లలు చూడకూడని మూవీ

OTT Movie : ఈ సినిమాను చూస్తే పోతారు మొత్తం పోతారు… డెడ్లీయెస్ట్ మూవీ ఎవర్… ఒంటరిగా చూసే దమ్ముందా ?

OTT Movie : మంత్రగాడి అరాచకం… అమ్మాయి దొరగ్గానే వదలకుండా అదే పని… చిన్న పిల్లలు చూడకూడని చిత్రం భయ్యా

Big Stories

×