E-Paper
Advertisement

Ind vs Sa 2nd Test : మొదటి ఇన్నింగ్స్ లో దక్షిణాఫ్రికా ఆలౌట్.. స్కోర్ వివరాలు ఇవే

Ind vs Sa 2nd Test : మొదటి ఇన్నింగ్స్ లో దక్షిణాఫ్రికా ఆలౌట్.. స్కోర్ వివరాలు ఇవే
Advertisement

Ind vs Sa 2nd Test: సౌతాఫ్రికా వ‌ర్సెస్ టీమిండియా మ‌ధ్య రెండో టెస్ట్ మ్యాచ్ జ‌రుగుతున్న విష‌యం తెలిసిందే. గౌహ‌తి వేదిక‌గా భార‌త్ తో జ‌రిగిన రెండో టెస్ట్ మ్యాచ్ జ‌రుగుతోంది. అయితే తొలి టెస్ట్ లో టీమిండియా ఓట‌మి పాలైంది. రెండో టెస్ట్ లో తొలుత టాస్ గెలిచిన సౌతాఫ్రికా జ‌ట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. 151.2 ఓవ‌ర్ల‌లో సౌతాఫ్రికా జ‌ట్టు 489 ప‌రుగులు చేసి ఆలౌట్ అయింది. బ్యాటింగ్ ను ప‌రిశీలించిన‌ట్ట‌యితే ఐడెన్ మార్క్ర‌మ్ 38, రికెల్ట‌న్ 35, స్ట‌బ్స్ 49, కెప్టెన్ బ‌వుమా 41, జోర్స్ 28, మ‌ల్డ‌ర్ 13, ముత్తు స్వామి 109, వెర్రెన్నె 45, జాన్స‌న్ 93, మ‌హారాజ్ 12 నాటౌట్, హార్మ‌ర్ 5 చేయ‌డంతో సౌతాఫ్రికా జ‌ట్టు 489 ప‌రుగులు చేయ‌గ‌లిగింది. బుమ్రా 2, సిరాజ్ 2, కుల్దీప్ యాద‌వ్ 4, జ‌డేజా 2 వికెట్లు తీసుకున్నారు.

Also Read : Aus vs Eng Ashes 2025-26 : కొంప‌ముంచిన హెడ్ సెంచ‌రీ, 2 రోజుల్లోనే మ్యాచ్ ఫినీష్‌.. రూ.17.35 కోట్ల భారీ నష్టం!

ముత్తు స్వామి సెంచ‌రీ

Advertisement

ముఖ్యంగా రెండో రోజు సౌతాఫ్రికా లోయ‌ర్ ఆర్డ‌ర్ బ్యాట‌ర్లు ఆధిప‌త్యం చెలాయించారు. ఏడో స్థానంలో బ్యాటింగ్ కి వ‌చ్చిన సెనుర‌న్ ముత్తు స్వామి సెంచ‌రీ చేశాడు. మ‌రోవైపు అంత‌ర్జాతీయ క్రికెట్ లో తొలి సెంచ‌రీ కావ‌డం విశేషం. 247/6 వ‌ద్ద రెండో రోజు ఆట‌ను ప్రారంభించి.. 489 ప‌రుగుల వ‌ద్ద ముగించింది సౌతాఫ్రికా. టీ బ్రేక్ త‌రువాత కైల్ వెర్రెయెన్నె పెవిలియ‌న్ కి చేరాడు. అనంత‌రం జాన్స‌న్ కూడా దూకుడుగా ఆడాడు. భార‌త స్పిన్న‌ర్ల పై జాన్స‌న్ సిక్స‌ర్ల‌తో రెచ్చిపోయాడు. అత‌డినీ ఆపేందుకు బుమ్రాను తీసుకొచ్చిన‌ప్ప‌టికీ ఫ‌లితం మాత్రం ద‌క్క‌లేదు. చివ‌రికీ కుల్దీప్ యాద‌వ్ బౌలింగ్ లో  బౌల్డ్ అయ్యాడు. ఏడో స్థానంలో వ‌చ్చి ముత్తు స్వామితో పాటు ఎనిమిది, తొమ్మిది స్థానాల్లో బ్యాటింగ్ కి వ‌చ్చిన కైల్ వెర్రెయెన్నె మార్కో జాన్సెన్ లు సైతం ఆక‌ట్టుకున్నారు. వెర్రెయెన్నె 45 ప‌రుగులు సాధించగా.. జాన్సెన్ 93 ప‌రుగులు చేశాడు. జాన్సెన్ 91 బంతుల్లో 6 ఫోర్లు 7 సిక్స్ ల‌తో చెల‌రేగి ఆడి స్కోర్ బోర్డును ప‌రుగులు పెట్టించాడు.

బుమ్రా బౌలింగ్ అదుర్స్

ద‌క్షిణాఫ్రికా బ్యాటింగ్ లో ఏడో వికెట్ కి 88 ప‌రుగులు, ఎనిమిదో వికెట్ 97 ప‌రుగుల భాగ‌స్వామ్యం ల‌భించ‌డంతో స‌ఫారీలు భారీ స్కోర్ న‌మోదు చేశారు. భార‌త బౌల‌ర్ల‌లో కుల్దీప్ యాద‌వ్ నాలుగు వికెట్లు సాధించ‌గా.. ర‌వీంద్ర జ‌డేజా, బుమ్రా, సిరాజ్ త‌లో రెండు వికెట్లు తీసుకున్నారు. చివ‌రి వికెట్ గా పెవిలియ‌న్ చేరిన జాన్సెన్ తృటిలో సెంచ‌రీ కోల్పోయాడు. భార‌త బౌల‌ర్ల‌లో కుల్దీప్ 115 ప‌రుగులు స‌మ‌ర్పించుకోగా.. సిరాజ్ 106 ప‌రుగులు ఇచ్చాడు. 25 ఓవ‌ర్లు మించి వేసిన బౌల‌ర్ల‌లో బుమ్రా ఒక్క‌డే కుదురుగా ప‌రుగులు ఇచ్చాడు. బుమ్రా 32 ఓవ‌ర్లు వేసి 75 ప‌రుగులు ఇచ్చాడు. సాధార‌ణంగా బుమ్రా చాలా ఓవ‌ర్లు మెయిడెన్ చేశాడు. కానీ కొన్ని ఓవ‌ర్ల‌లో మాత్రం ప‌రుగులు స‌మ‌ర్పించుకున్నాడు. దాదాపు అంద‌రూ ఇలాగే ప‌రుగులు స‌మ‌ర్పించుకోవ‌డంతో సౌతాఫ్రికా జ‌ట్టు 489 ప‌రుగులు చేసుకుంది.

Advertisement

Also Read : Ind vs Sa Odi: దక్షిణాఫ్రికాతో వ‌న్డే సిరీస్‌.. పెళ్లి క్యాన్సిల్ చేసుకున్న టీమిండియా ప్లేయ‌ర్

Related News

ఇమామ్ ఉల్ హక్ పెద్ద ద‌ద్ద‌మ్మ‌…త‌న‌ మామ లాగా బ‌ద్ధ‌క‌స్తుడే

టీమిండియా ఓట‌మిని శాసించిన‌ సామ్‌ కర్రన్..అత‌ను వేసిన మూన్ బాల్స్ కొంప‌ముంచాయి

లార్డ్స్ వన్డేలో బాల్ టాంపరింగ్…శ్రేయస్ అయ్యర్ పై బ్యాన్?

లార్డ్స్ నుంచి అలిగి ఇంటికి వెళ్లిపోయిన గంభీర్..?

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ లో వాడిన‌ బంతుల్లో చిప్స్…షాకింగ్ వీడియో వైర‌ల్ !

టైటిల్ గెల‌వ‌గానే త‌ల‌కెక్కిన పొగ‌రు..ట్రంప్ ను తోసేసి, స్పెయిన్ ఓవ‌రాక్ష‌న్‌

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

Big Stories

Advertisement
×