E-Paper
Advertisement

బీజేపీ కంచుకోట బంకీపూర్‌పై పీకే కన్ను, ఆధిక్యం దిశగా ప్రశాంత్ కిషోర్

బీజేపీ కంచుకోట బంకీపూర్‌పై పీకే కన్ను, ఆధిక్యం దిశగా ప్రశాంత్ కిషోర్
Advertisement

Bankipur Bypoll: దేశవ్యాప్తంగా జరిగిన ఉప ఎన్నికల లెక్కింపు జరుగుతోంది. అన్నింటి కంటే ముందుగా బీహార్‌లోని బంకీపూర్ నియోజకవర్గంపై అందరి దృష్టి పడింది. బీజేపీకి కంచుకోట బంకీపూర్ నియోజకవర్గం నుంచి ప్రశాంత్ కిషోర్ బరిలోకి దిగారు. నాలుగు రౌండ్లు తర్వాత బీజేపీ అభ్యర్థి కంటే వెయ్యి ఓట్లు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఇదే జోరు కొనసాగేనా?

బీహార్ ఉప ఎన్నికల.. రాజకీయ పార్టీల్లో ఆసక్తి

నీట్ పేపర్ లీకేజీల వివాదం, విద్యార్థి ఉద్యమాల తర్వాత బీజేపీ పాలిత రాష్ట్రాల్లో జరిగిన ఉపఎన్నికల ఓట్ల లెక్కింపు ఆసక్తికరంగా సాగుతోంది. బీహార్‌లోని బంకీపూర్ అసెంబ్లీ నియోజకవర్గంపై అందరి దృష్టి కేంద్రీకృతమైంది. రాజకీయ వ్యూహకర్త, జనసురాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిశోర్ తొలి రౌండ్ నుంచి ఆధిక్యంలో దూసుకెళ్తున్నారు.

Advertisement

మూడో విడత ఓట్ల లెక్కింపు పూర్తి అయ్యేసరికి ప్రశాంత్ కిషోర్.. బీజేపీ అభ్యర్థి నీరజ్ కుమార్ సిన్హాపై 1,145 ఓట్ల ఆధిక్యంతో కొనసాగుతున్నారు. మూడవ విడత ఓట్ల లెక్కింపు తర్వాత పీకే  6,269 ఓట్లు సాధించారు. బీజేపీ అభ్యర్థి  సిన్హా 5,124 ఓట్లు వచ్చాయి. ఆర్జేడీకి చెందిన రేఖా గుప్తా 884 ఓట్లతో మూడవ స్థానంలో నిలిచారు. ఈ ముగ్గురి మధ్య హోరాహోరీ పోరు నెలకొంది.

 

బీజేపీ కంచుకోట బంకీపూర్‌పై పీకే కన్ను

Advertisement

సోమవారం ఉదయం 8 గంటలకు పాట్నాలోని ఏఎన్ కాలేజీలో కట్టుదిట్టమైన భద్రత మధ్య ఓట్ల లెక్కింపు మొదలైంది. 26 మంది పోటీ పడుతున్న ఈ నియోజకవర్గంలో మొత్తం 31 రౌండ్లు లెక్కింపు జరగనుంది. 1995 నుంచి పాట్నా వెస్ట్‌గా పిలువబడిన బంకీపూర్ నియోజకవర్గం బీజేపీ కంటిన్యూ గెలుస్తూ వస్తోంది.

గత ఏప్రిల్‌లో రాజ్యసభకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ ఎన్నిక కావడంతో ఆ సీట ఖాళీ అయ్యింది.  2010 నుంచి ఇప్పటివరకు జరిగిన ఎన్నికల్లో నాలుగుసార్లు నితిన్ గెలుస్తూ వచ్చారు. బైపోల్ నేపథ్యంలో ఆ సీటు నుంచి  బీజేపీ యువ నేత సిన్హాను బరిలోకి దింపింది. 2025 ఎన్నికల్లో నబిన్ చేతిలో 50 వేల ఓట్ల తేడాతో ఓడిపోయిన గుప్తాను ఆర్జేడీ మరోసారి రంగంలోకి దించింది.

 

తొలి నాలుగు రౌండ్లలో ప్రశాంత్ కిషోర్‌దే ఆధిక్యం

గతేడాది అసెంబ్లీ ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ పార్టీని విజయపథంలో నడిపించడంలో విఫలమయ్యారు. ఆయన ఎన్నికల్లో పోటీ చేయలేదు. ఈసారి ఆయన సొంతంగా పోటీ చేస్తున్నారు. ఆయన రంగప్రవేశంతో బంకిపూర్‌లో ఎన్నికల వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. పీకే రాకముందు బీజేపీ గెలుపు ఈజీ అని భావించారు. ఈసారి ప్రశాంత్ రాకతో పోటీ ఆసక్తికరంగా మారింది.

ALSO READ: వీడేవడండీ బాబోయ్! ముసలిని భుజంపై మోసుకెళ్తున్నాడు.. వీడియో వైరల్!

తక్కువ ఓటింగ్ శాతానికి పేరుగాంచింది బంకీపూర్ నియోజకవర్గం. 2025లో నితిన్ నవీన్ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసినప్పుడు 41.10 శాతం ఓట్లు పోలయ్యాయి. ఈసారి ఉప ఎన్నికలో కేవలం 34.30 శాతానికి పరిమితమైంది. ఇంకా పాతిక రౌండ్లు ఉండడంతో గెలుపు తమదేనని ధీమాతో ఉంది బీజేపీ. సమ్రాట్ చౌదరి ముఖ్యమంత్రి తర్వాత జరుగుతున్న బైపోల్ కావడంతో ప్రజలు ఆయనకు మద్దతు ఇస్తారా? అనేది కూడా చూడాలి.

Related News

వీడేవడండీ బాబోయ్! ముసలిని భుజంపై మోసుకెళ్తున్నాడు.. వీడియో వైరల్!

చాయ్‌వాలాజ్‌ ఫౌండర్ ఆత్మహత్య.. 17 ఏళ్లకు వ్యాపారంలోకి ఎంట్రీ, ఇంట్లో ఎవరూ లేనప్పుడు

కాక్రోచ్ జనతా పార్టీ వేగంగా అడుగులు.. బుధవారం కీలక సమావేశం, అభిజీత్ మనసులో ఏముంది?

ఢిల్లీలో హైటెన్షన్.. ఎంపీ పప్పు యాదవ్‌పై షూ విసిరిన నిందితుడు!

మైసూరులో విషాదం.. ఐదేళ్ల చిన్నారి ప్రాణం తీసిన కుర్‌కురే!

ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన కారు.. స్పాట్‌లోనే ఐదుగురు మృతి!

జంతర్ మంతర్ వద్ద అలజడి, సీఎం టార్గెట్.. పాక్ ఉగ్రవాదుల కుట్ర బట్టబయలు!

Big Stories

Advertisement
×