E-Paper
Advertisement

నాని – నితిన్ కొత్త మూవీ.. టైటిల్ గ్లింప్స్ రిలీజ్..

నాని – నితిన్ కొత్త మూవీ.. టైటిల్ గ్లింప్స్ రిలీజ్..
Advertisement

Nani – Nithin Movie:టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో నేచురల్ స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న నాని (Nani) .. ఒకవైపు సినిమాలలో హీరోగా నటిస్తూనే.. మరొకవైపు ఇతర హీరోల చిత్రాలకు నిర్మాతగా వ్యవహరిస్తూ దూసుకుపోతున్నారు. ఈ క్రమంలోనే శ్రీకాంత్ ఓదెలా (Srikanth odela) దర్శకత్వంలో ‘ది ప్యారడైజ్’ సినిమాలో హీరోగా నటిస్తున్న నాని.. మరొకవైపు నిర్మాతగా కొత్త సినిమా మొదలు పెట్టేసారు. గత కొన్ని రోజులుగా వస్తున్న రూమర్స్ ను నిజం చేస్తూ, నితిన్(Nithin ) హీరోగా కొత్త చిత్రాన్ని తాజాగా ప్రకటించారు . ఈ మేరకు టైటిల్ రివీల్ చేస్తూ విడుదల చేసిన గ్లింప్స్ ఆసక్తిని పెంచుతోంది.

నాని – నితిన్ అలియాస్ రుక్మిణీ టైటిల్ గ్లింప్స్ రిలీజ్

అసలు విషయంలోకి వెళ్తే..సోమవారం హైదరాబాదులో లాంఛనంగా ఈ కొత్త ప్రాజెక్టును ప్రారంభించారు. దండోరా చిత్ర దర్శకుడు మురళి కాంత్ (Murali Kanth) ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా.. ‘అలియాస్ రుక్మిణీ ‘ అనే అచ్చ తెలుగు పేరుతో టైటిల్ ని ఫిక్స్ చేస్తూ గ్లింప్స్ విడుదల చేశారు మేకర్స్. టైటిల్ గ్లింప్స్ విషయానికి వస్తే.. నాని వాయిస్ ఓవర్ తో ప్రారంభమైన ఈ గ్లింప్స్ లో. ఇంజనీరింగ్ బుక్స్ ముందు వేసుకొని పడుకునే హీరోని చూపిస్తూ.. గరం గోపాల్, ఆమెకు ఆమె అంటే ఇష్టం, వ్రతం వెంకన్న వంటి పుస్తకాలను చూపించారు. వీటిని రాసింది రుక్మిణి అనే మహిళ . ఈమె ఎవరో అని మనం ఆలోచించేలోపే.. అప్పుడే నిద్ర లేచిన హీరో పాత్రధారి నితిన్.. తన కంటి అద్దాలను తుడుచుకుంటూ.. ఆమె నా భార్య.. మై వైఫ్ చెప్పడం చాలా బాగుంది. మరి రొమాంటిక్ నవలలు రాసే భార్య ఉన్న హీరో ఎలాంటి అనుభవాలు ఎదుర్కొన్నాడు అనేది స్టోరీ లాగా అనిపిస్తోంది. త్వరలోనే షూటింగ్ మొదలు పెట్టబోతున్నట్లు వెల్లడించారు. ఈ చిత్రానికి విజయ్ బుల్గానిన్ నేపథ్య సంగీతం బాగుంది. మరి టైటిల్ గ్లింప్స్ తోనే సినిమాపై ఆసక్తితో పాటు అంచనాలు పెంచేశారు చిత్ర బృందం.

Advertisement

also read:అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరోయిన్ ఎవరో తెలుసా?

నితిన్ ఖాతాలో హిట్ గ్యారెంటీ?

నైజాం ఏరియాలో సినీ డిస్ట్రిబ్యూటర్ గా పేరు సొంతం చేసుకున్న సుధాకర్ రెడ్డి వారసుడిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు నితిన్. తేజ దర్శకత్వంలో విడుదలైన ‘జయం’ సినిమాతో అరంగేట్రం చేసిన ఈయన.. ఆ తర్వాత సై , ఇస్క్, దిల్, గుండెజారి గల్లంతయ్యిందే వంటి విజయవంతమైన చిత్రాలలో నటించి మంచి పేరు సొంతం చేసుకున్నారు. ఇకపోతే అ ఆ, చల్ మోహన్ రంగా, భీష్మ తర్వాత వచ్చిన రంగ్ దే , మాస్ట్రో లాంటి చిత్రాలు పర్వాలేదనిపించుకున్నా.. ఆ తర్వాత వచ్చిన మాచర్ల నియోజకవర్గం, ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్, తమ్ముడు, రాబిన్ హుడ్ ఇవేవీ కూడా ప్రేక్షకులను మెప్పించలేకపోయాయి. కనీసం తమ్ముడు సినిమాతోనైనా మంచి విజయం అందుకోవాలని ప్రయత్నాలు చేశారు. కానీ వర్క్ అవుట్ కాలేదు. ఇప్పుడు కొత్త నేపథ్యంతో సరికొత్త కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందు రాబోతున్నారు. తాజాగా విడుదల చేసిన టైటిల్ గ్లింప్స్ సినిమాపై అంచనాలు పెంచేసింది. ముఖ్యంగా ఈ సినిమా మ్యూజిక్ అదిరిపోనుంది అనే విషయం అయితే మాత్రం స్పష్టంగా తెలుస్తోంది. మరి ఈ సినిమాతో నితిన్ హిట్ కొట్టడం గ్యారెంటీ అనే కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

Advertisement

 

Related News

టాక్సిక్ మూవీలో 5మంది హీరోయిన్స్.. హైయెస్ట్ రెమ్యూనరేషన్ ఈమెకే!

అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరోయిన్ ఎవరో తెలుసా?

హీరోయిన్ రితికా నాయక్ రియల్ లైఫ్ లో కష్టాలు .. కన్నీళ్లు తెప్పించే స్టోరీ..

జానీ మాస్టర్ అవుట్.. సందీప్ ఇన్!

అక్క మరణంపై మెహర్ రమేష్ ఎమోషనల్ పోస్ట్!

కాబోయే భర్తను పరిచయం చేసిన ‘గద్దల కొండ గణేష్’ మూవీ హీరోయిన్!

కూతుళ్లు చెప్పినా వినకుండా రూ.26 కోట్లు నష్టపోయిన నిర్మాత?

Big Stories

Advertisement
×