E-Paper
Advertisement

హోండా కార్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. ఆ మూడు మోడల్స్ పై ఏకంగా రూ.2.45 లక్షల డిస్కౌంట్!

హోండా కార్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. ఆ మూడు మోడల్స్ పై ఏకంగా రూ.2.45 లక్షల డిస్కౌంట్!
Advertisement

Honda Discounts August 2026: కొత్త హోండా కారు కొనాలని ఆలోచిస్తున్న వారికి కంపెనీ ఆగస్టు 2026లో మంచి ఆఫర్లు అందిస్తోంది. ఈ నెలలో ఎలివేట్, సిటీ, అమేజ్ కార్లపై సూపర్ డిస్కౌంట్లను ప్రకటించింది. కొన్ని వేరియంట్లపై  రూ.2.45 లక్షల వరకు బెనిఫిట్స్ అందిస్తోంది. అయితే, ఈ మొత్తం కేవలం క్యాష్ తగ్గింపు మాత్రమే కాదు. ఇందులో క్యాష్ డిస్కౌంట్‌ తో పాటు ఎక్స్ఛేంజ్ బోనస్, లాయల్టీ బెనిఫిట్, కార్పొరేట్ ఆఫర్, ఎక్స్‌ టెండెడ్ వారంటీ డిస్కౌంట్, యాక్సెసరీ ప్యాకేజీలు కూడా ఉన్నాయి.

హోండా ఎలివేట్‌పై అత్యధిక డిస్కౌంట్

ఈ నెలలో హోండా ఎలివేట్ SUVపై అత్యధిక ఆఫర్లు లభిస్తున్నాయి. ముఖ్యంగా ఎలివేట్ ZX వేరియంట్‌పై మొత్తం రూ.2.45 లక్షల వరకు ప్రయోజనాలు ప్రకటించారు. ఈ ప్యాకేజీలో క్యాష్ డిస్కౌంట్, ఎక్స్ఛేంజ్ బోనస్, హోండా ఎక్స్ఛేంజ్ బెనిఫిట్, లాయల్టీ బోనస్, కార్పొరేట్ ఆఫర్,  ఎక్స్‌ టెండెడ్ వారంటీ తగ్గింపు వంటి అంశాలు ఉన్నాయి. అదనంగా 360 డిగ్రీ కెమెరా, డ్యాష్‌ క్యామ్, యాంబియంట్ లైటింగ్ లాంటి యాక్సెసరీ ప్యాకేజీలను కూడా అందిస్తున్నారు. అలాగే ఎలివేట్ V Apex వేరియంట్‌పై రూ.2.01 లక్షల వరకు, VX వేరియంట్‌పై రూ.1.57 లక్షల వరకు బెనిఫిట్స్ ఉన్నాయి.

ఎలివేట్‌కు రెండు ఆఫర్ ఆప్షన్లు

Advertisement

హోండా ఎలివేట్ కొనుగోలుదారులకు రెండు రకాల ఆఫర్లను అందిస్తోంది. ఒక ఆప్షన్‌లో యాక్సెసరీ ప్యాకేజీలు ఎక్కువగా ఉండగా, మరో ఆప్షన్‌లో నగదు తగ్గింపుకు ప్రాధాన్యం ఇచ్చారు. కొనుగోలుదారులకు ఏ ఆఫర్ ఎక్కువ ప్రయోజనం ఇస్తుందో తెలుసుకోవాలంటే బుకింగ్‌కు ముందు రెండు ఆప్షన్లను డీలర్ దగ్గర పోల్చి చూడడం మంచిది.

హోండా సిటీపై రూ.95 వేల వరకు ఆదా

హోండా సిటీ సెడాన్‌పై కూడా ఈ నెల మంచి ఆఫర్లు ఉన్నాయి. ఎంపిక చేసిన వేరియంట్లపై రూ.95,000 వరకు బెనిఫిట్స్  పొందవచ్చు. ఈ ఆఫర్‌ లో క్యాష్ డిస్కౌంట్, ఎక్స్ఛేంజ్ బోనస్, లాయల్టీ బెనిఫిట్, కార్పొరేట్ ఆఫర్ లాంటి ప్రయోజనాలు ఉన్నాయి. హైబ్రిడ్ సిటీ e:HEVపై క్యాష్ డిస్కౌంట్ లేకపోయినా, ఇతర బోనస్‌ల ద్వారా కొంత మేర ఆదా చేసే అవకాశం కల్పించారు.

హోండా అమేజ్‌పైనా ఆకర్షణీయమైన ఆఫర్లు

Advertisement

బడ్జెట్ సెడాన్ కొనాలనుకునే వారికి హోండా అమేజ్‌ పై కూడా మంచి డీల్స్ అందుబాటులో ఉన్నాయి. రెండో తరం అమేజ్‌ పై రూ.58,000 వరకు, కొత్త తరం అమేజ్‌లో కొన్ని వేరియంట్లపై రూ.67,000 వరకు ప్రయోజనాలు లభిస్తున్నాయి. ఈ ఆఫర్లలో నగదు తగ్గింపు, ఎక్స్ఛేంజ్ బోనస్, లాయల్టీ బెనిఫిట్, కార్పొరేట్ డిస్కౌంట్, ఎక్స్‌ టెండెడ్ వారంటీ ప్రయోజనాలు ఉన్నాయి.

అందరికీ అన్ని ఆఫర్లు వర్తించవు

హోండా ప్రకటించిన ప్రతి ఆఫర్ అందరికీ ఒకే విధంగా వర్తించదు. ఇప్పటికే హోండా కారు కలిగి ఉన్నవారు, పాత కారును ఎక్స్ఛేంజ్ చేసే కస్టమర్లు, కార్పొరేట్ ఉద్యోగులు, స్వయం ఉపాధి వర్గానికి చెందిన వాళ్లు అదనపు ప్రయోజనాలు పొందే అవకాశం ఉంది. సో, మీరు కారు కొనుగోలు చేసే ముందు సమీప హోండా డీలర్‌ను సంప్రదించి, మీకు వర్తించే అన్ని ఆఫర్ల వివరాలను తెలుసుకోవడం మంచిది.

Read Also: ఆగస్టులో దేశీ మార్కెట్ లో లాంచ్ కానున్న కొత్త కార్లు.. ఏ మోడల్ ఎప్పుడు వస్తుందో తెలుసా?

Related News

థార్ కొనాలనుకుంటున్నారా? కాస్త ఆగండి.. కొత్త ఫేస్‌లిఫ్ట్ వచ్చేస్తోంది!

అపాచీ బైక్‌లకు బిగ్ అప్‌డేట్.. కొత్త వేరియంట్లు, అదిరిపోయే ఫీచర్లు ఇవే!

మారుతి బాలెనో vs టాటా ఆల్ట్రోజ్.. టాప్ వేరియంట్లలో ఏది బెస్ట్?

థార్ To డస్టర్.. దీపావళికి ముందే రాబోతున్న 5 అదిరిపోయే SUVలు!

మహీంద్రా BE 6 vs టాటా కర్వ్ EV.. రెండింటిలో ఏది తోప్ అంటే?

సీటు కింద ఏకంగా 70 లీటర్ల స్టోరేజ్.. ఎక్కువ బూట్ స్పేస్ కావాలంటే వీటిని కొనండి!

ఎర్టిగా To ఇన్నోవా.. ఆగస్టులో ఎక్కువగా అమ్ముడైన 7-సీటర్ కార్లు ఇవే!

సింగిల్ ఛార్జ్ తో 400 కి.మీ రేంజ్.. కళ్లు చెదిరే ఈవీ స్కూటర్లు ఇవే!

Big Stories

Advertisement
×