E-Paper
Advertisement

మోటో నుంచి కొత్త ఫోన్.. 7000mAh భారీ బ్యాటరీ.. ఒక్క ఛార్జ్‌తో 3 రోజులు పక్కా!

మోటో నుంచి కొత్త ఫోన్.. 7000mAh భారీ బ్యాటరీ.. ఒక్క ఛార్జ్‌తో 3 రోజులు పక్కా!
Advertisement

Moto G77 Power: మొబైల్ మార్కెట్లో ఎప్పటికప్పుడు సరికొత్త స్మార్ట్‌ఫోన్‌లతో సందడి చేసే మోటోరోలా సంస్థ తాజాగా భారత మార్కెట్లోకి మరో ఫోన్ ను లాంచ్ చేసింది. ‘మోటో G77 పవర్’ (Moto G77 Power) మోడల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. భారీ బ్యాటరీ ఫోన్ల కోసం ఎదురుచూసే యూజర్లను టార్గెట్ చేస్తూ.. ఈ ఫోన్‌ను మోటో తీసుకురావడం గమనార్హం. ఈ మెుబైల్ ధర, ఇందులోని లోటుపాట్లు ఏంటో ఈ కథనంలో చూద్దాం.

7,000mAh భారీ బ్యాటరీ

స్మార్ట్ ఫోన్ పేరులోని ‘పవర్’కు తగ్గట్లుగానే ఇందులో 7000mAh భారీ బ్యాటరీని అమర్చారు. సాధారణంగా మార్కెట్లో 5,000mAh బ్యాటరీలే ఎక్కువగా కనిపిస్తుండగా మోటోరోలా ఏకంగా 7,000mAh బ్యాటరీని అందించింది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే.. సాధారణ వాడకంతో దాదాపు మూడు రోజుల పాటు బ్యాటరీ లైఫ్ ఇస్తుందని కంపెనీ చెబుతోంది. దీనికి తోడు 30W టర్బోపవర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా దీనికి అందించారు.

డిజైన్ పాతదే.. నెంబరే మార్పు

Advertisement

లుక్ విషయానికి వస్తే మోటోరోలా ఈసారి కొత్త ప్రయోగాలేవీ చేయలేదు. మోటోరోలా గత మోడల్స్ తరహాలోనే ‘సేమ్ డిజైన్, డిఫరెంట్ నెంబర్’ అన్న చందంగా పాత డిజైన్‌నే దీనికి కూడా వాడేశారు. వెనుక వైపు వీగన్ లెదర్ ఫినిషింగ్, కెమెరా మాడ్యూల్ డిజైన్ అంతా పాత ఫోన్ల లాగే ఉంది. కేవలం మోడల్ నెంబర్ మార్చి కొత్త ఫోన్‌గా మార్కెట్లోకి తెచ్చారు.

సాఫ్ట్‌వేర్ సపోర్ట్.. మోటో వీక్ స్పాట్!

మోటోరోలా ఫోన్లలో క్లీన్ ఆండ్రాయిడ్ అనుభవం బాగున్నప్పటికీ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ల విషయంలో మాత్రం ఎప్పుడూ వెనుకబడే ఉంటుంది. ఈ మోటో G77 పవర్ సరికొత్త ఆండ్రాయిడ్ 16 (Android 16) తో వచ్చినప్పటికీ దీనికి కేవలం 1 సంవత్సరం మాత్రమే ఓఎస్ అప్‌డేట్ (OS Upgrade) ఇస్తామని కంపెనీ స్పష్టం చేసింది. అంటే కేవలం ఆండ్రాయిడ్ 17 వరకు మాత్రమే అప్‌డేట్ వస్తుంది. రూ.25,000 పైగా ఖర్చు పెట్టే ఫోన్‌కు కేవలం ఒకే ఒక్క ఓఎస్ అప్‌డేట్ ఇవ్వడం కచ్చితంగా మోటోరోలా బలహీనతే అని నిపుణులు అంటున్నారు.

Advertisement

Also Read: వర్షాకాలం కష్టాలకు చెక్.. మీ లైఫ్ ఈజీ చేసే.. 6 అద్భుతమైన స్మార్ట్ గ్యాడ్జెట్స్!

ఇంతకీ ధర ఎంతంటే?

భారత మార్కెట్లో మోటో G77 పవర్ (8GB రామ్ + 128GB స్టోరేజ్) వేరియంట్ ధరను రూ.25,999గా నిర్ణయించారు. అయితే ప్రారంభ ఆఫర్ కింద రూ.23,999కే దీనిని అందిస్తున్నారు. ఫ్లిప్ కార్ట్ లో జులై 13 మ.12 గంటలకు మెుబైల్ సేల్ అధికారికంగా ప్రారంభం కానుంది. గ్రే, బ్లూ, పింక్ కలర్ ఆప్షన్స్ లో దీనిని సొంతం చేసుకోవచ్చు. ఫ్లిప్ కార్ట్ తో పాటు మోటోరోలా ఆన్ లైన్ స్టోర్, ఇతర రిటైలర్ షాపుల్లోనూ ఇది అందుబాటులో ఉండనుంది.

Also Read: అద్దెకు ‘ప్రేయసి’.. ఒక్కో పనికి ఒక్కో రేటు.. ఎక్కడో కాదు మన ఇండియాలోనే!

Related News

Google Pixel 11పై బిగ్ డిస్కౌంట్.. ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో రూ.19,000 ఆదా చేసుకునే అవకాశం!

ఇది మామూలు ఫోన్ కాదు భయ్యా.. 200 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరాతో ఒప్పో సరికొత్త రికార్డ్!

Apple Watch Series 11పై అమెజాన్‌లో క్రేజీ డీల్.. యాపిల్ ప్రియులకు ఇంత కంటే మంచి ఛాన్స్ రాదు!

5Gకి గుడ్ బై చెప్పే టైం వచ్చేసింది..త్వరలోనే జియో 6G ఇంటర్నెట్

రూ.25 వేల బడ్జెట్‌లో ఐదు అదిరిపోయే ఫోన్ ఆఫర్లు.. ఏది కొనడం బెస్ట్ అంటే?

ఫేక్ ఇ-ఇన్‌వాయిస్ మెసేజ్‌లతో మోసపోకండి..అసలు,నకిలీ బిల్లులను ఇలా గుర్తించండి!

సమయాన్ని కొలవడంలో సరికొత్త విప్లవం.. న్యూక్లియర్ క్లాక్ ఎలా పనిచేస్తుందో తెలుసా?

డబ్బులు కట్ అయ్యి మనీ పడలేదా?ఈ తప్పులు అస్సలు చేయెద్దు!

Big Stories

Advertisement
×