E-Paper
Advertisement

వర్షాకాలం కష్టాలకు చెక్.. మీ లైఫ్ ఈజీ చేసే.. 6 అద్భుతమైన స్మార్ట్ గ్యాడ్జెట్స్!

వర్షాకాలం కష్టాలకు చెక్.. మీ లైఫ్ ఈజీ చేసే.. 6 అద్భుతమైన స్మార్ట్ గ్యాడ్జెట్స్!
Advertisement

Monsoon Gadgets: సాధారణంగా వర్షా కాలంలో అనేక సమస్యలు వెంటాడుతూ ఉంటాయి. ప్రయాణాలు చేయాలన్నా, ఇంట్లో పనులు చక్కబెట్టుకోవాలన్నా కాస్త ఇబ్బందిగానే ఉంటుంది. అయితే మారుతున్న కాలంతో పాటు టెక్నాలజీ కూడా మనకు తోడుగా నిలుస్తోంది. ఈ వర్షాకాలంలో మీ ప్రయాణాలను సురక్షితంగా మార్చడంతో పాటు, ఇంట్లోని పనులను సులువు చేసే 6 అద్భుతమైన స్మార్ట్ గ్యాడ్జెట్స్ ను ఈ కథనంలో అందించడం జరుగుతోంది. వాటిపై ఓ లుక్కేయండి.

Qubo Dashcam Pro 4K

వర్షాకాలంలో రోడ్లపై ప్రయాణించడం పెద్ద సవాలు. భారీ వర్షం కారణంగా రోడ్లు సరిగ్గా కనిపించకపోవడం, ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువ. ఇలాంటి సమయంలో ‘క్యూబో డ్యాష్‌క్యామ్ ప్రో 4K’.. కారుకు కన్నులా పనిచేస్తుంది. దీని 4K అల్ట్రా HD రికార్డింగ్ వల్ల వర్షంలో కూడా రోడ్డు, ఎదురుగా వచ్చే వాహనాల నంబర్ ప్లేట్లు చాలా స్పష్టంగా కనిపిస్తాయి. ప్రమాదాలు జరిగినప్పుడు లేదా ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవాల్సి వచ్చినప్పుడు ఈ గ్యాడ్జెట్ ఇచ్చే ప్రూఫ్ ఎంతో ఉపయోగపడుతుంది.

Inalsa NutriFry DuoSlim

Advertisement

బయట వర్షం పడుతుంటే వేడి వేడిగా బజ్జీలు, పకోడీలు, సమోసాలు తినాలని చాలా మందికి అనిపిస్తుంది. కానీ వర్షాకాలంలో నూనె పదార్థాలు ఎక్కువగా తింటే ఆరోగ్యం పాడవుతుందని చాలా మంది భావిస్తుంటారు. అలాంటి వారికి ‘ఇనాల్సా న్యూట్రీఫ్రై డుఓస్లిమ్ డబుల్ బాస్కెట్ ఎయిర్ ఫ్రైయర్’ బెస్ట్ ఛాయిస్. ఇందులో రెండు వేర్వేరు బాస్కెట్లు (7 లీటర్లు + 7 లీటర్లు) ఉంటాయి. అంటే ఒకే సమయంలో రెండు వేర్వేరు స్నాక్స్ ఎలాంటి నూనె లేకుండానే చేసుకోవచ్చు.

Qubo Q200 Smart Air Purifier

వర్షాల వల్ల ఇంట్లో తేమ పెరిగి ఒక రకమైన బ్యాడ్ వాసన వస్తుంది. అంతేకాకుండా గాలిలో బ్యాక్టీరియా, అలర్జీలు కలిగించే కణాలు చేరి జలుబు, దగ్గుకు దారితీస్తాయి. ఈ సమస్యకు ‘క్యూబో Q200 స్మార్ట్ ఎయిర్ ప్యూరిఫైయర్’తో చెక్ పెట్టొచ్చు. ఇది ట్రూ HEPA H13 ఫిల్టర్‌ తో రూపొందింది. గదిలోని సూక్ష్మ క్రిములను, దుమ్ము, బ్యాడ్ స్మెల్ ను పీల్చేసి.. స్వచ్ఛమైన గాలిని అందిస్తుంది. చిన్న గదులు లేదా బెడ్‌రూమ్‌లకు ఇది పర్ఫెక్ట్ ఛాయిస్.

Philips Glass Like Shine Hair Dryer

Advertisement

వర్షాకాలంలో ఆఫీసుకో లేదా బయటికో వెళ్లినప్పుడు అనుకోకుండా వర్షంలో తడిసిపోవడం సహజం. అలా తడిసిన జుట్టు త్వరగా ఆరకపోతే జలుబు చేయడమే కాకుండా జుట్టు కూడా పాడవుతుంది. కాబట్టి ‘ఫిలిప్స్ గ్లాస్ లైక్ షైన్ హెయిర్ డ్రైయర్’.. మీ జుట్టును వేగంగా డ్రై చేస్తుంది. జుట్టు చిక్కుబడకుండా, మంచి షైనింగ్ వచ్చేలా సహాయ పడుతుంది. వర్షంలో తడిసి ఇంటికి రాగానే దీని సహాయంతో జుట్టును త్వరగా ఆరబెట్టుకుని ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా ఉండొచ్చు.

Dreame L10 Prime Robot Vacuum

బయట నుంచి ఇంట్లోకి రాగానే కాళ్లకు ఉన్న బురద, తడి వల్ల ఇల్లంతా అపరిశుభ్రంగా మారుతుంది. దీంతో రోజుకు 4 సార్లు ఇల్లు తుడవడం ఎవరికైనా విసుగు తెప్పిస్తుంది. అందుకే ‘డ్రీమీ L10 ప్రైమ్ రోబోట్ వాక్యూమ్ అండ్ మోప్’ ఈ పనిని సులువు చేస్తుంది. ఇది దానంతట అదే ఇల్లంతా తిరుగుతూ దుమ్మును క్లీన్ చేయడమే కాకుండా తడి గుడ్డతో నీట్‌గా తుడుస్తుంది. దీనివల్ల వర్షాకాలంలో కూడా ఇల్లు ఎల్లప్పుడూ మెరుస్తూ ఉంటుంది.

Also Read: అద్దెకు ‘ప్రేయసి’.. ఒక్కో పనికి ఒక్కో రేటు.. ఎక్కడో కాదు మన ఇండియాలోనే!

Wonderchef Chai Magic Tea Maker

వర్షం పడేటప్పుడు కిటికీ పక్కన కూర్చుని వేడి వేడి చాయ్ తాగడం ఇచ్చే మజాయే వేరు. కానీ ప్రతిసారీ కిచెన్‌లోకి వెళ్లి చాయ్ పెట్టడం కొందరికి బద్దకంగా అనిపిస్తూ ఉంటుంది. అలాంటి వారి కోసమే ఈ ‘వండర్‌షెఫ్ చాయ్ మ్యాజిక్ టీ మేకర్’. ఇందులో నీళ్లు, పాలు, టీపొడి, అల్లం వేసి బటన్ నొక్కితే చాలు.. అద్భుతమైన టేస్టీ చాయ్ రెడీ అయిపోతుంది. శ్రమ లేకుండా పర్ఫెక్ట్ వర్షాకాలాన్ని ఆస్వాదించడానికి ఇది బెస్ట్ గ్యాడ్జెట్ అని చెప్పవచ్చు.

Also Read: టెలికాం రంగంలో పెను మార్పులు.. Jio, Airtel దెబ్బకు Vi విలవిల!

Related News

వెయిట్ లిఫ్టింగ్ చేస్తూ.. జడ్జీల ప్యానెల్‌పై పడ్డ రోబో.. స్ట్రెచ్చర్‌పై తరలింపు!

రూ.499కే పిల్లల కోసం కిరాక్ గ్యాడ్జెట్.. పోర్ట్రానిక్స్ సరికొత్త రఫ్ ప్యాడ్స్ ఫీచర్లివే!

64% పవర్ సేవింగ్ టెక్నాలజీతో షియోమీ కొత్త డివైజ్‌లు.. భారత్‌లోకి ఎప్పుడంటే?

ఇంత తక్కువ ధరకి 120Hz డిస్‌ప్లే, 50MP కెమెరానా? Lava Virat V1 Pro 5G వచ్చేసిందోచ్!

Galaxy S27 Ultra కెమెరా రీ-డిజైన్.. Qi2 మాగ్నెటిక్ ఛార్జింగ్‌తో రాబోతుందా?

9000mAh బ్యాటరీ.. ఏడేళ్ల అప్‌డేట్స్.. 2026లో బెస్ట్ మిడ్‌రేంజ్ ఫోన్ల లిస్ట్ వచ్చేసింది!

గూగుల్ షాకింగ్ నిర్ణయం.. ఆ రెండు కారణాలతో Pixel 10 ధర భారీగా పతనం!

ఇయర్‌బడ్స్ కాదు.. ఏకంగా స్మార్ట్‌ఫోన్‌నే దించేస్తున్న Mivi, పూర్తి వివరాలు ఇవే!

Big Stories

Advertisement
×