E-Paper
Advertisement

Rahul Gandhi: ఆ ఫైల్స్ రహస్యాలే ప్రధానిపై ఉన్న ఒత్తిడికి కారణం.. హీట్ పెంచుతున్న రాహుల్ గాంధీ ఆరోపణలు

Rahul Gandhi: ఆ ఫైల్స్ రహస్యాలే ప్రధానిపై ఉన్న ఒత్తిడికి కారణం.. హీట్ పెంచుతున్న రాహుల్ గాంధీ ఆరోపణలు
Advertisement

Rahul Gandhi: సభలో తనను మాట్లాడనీయకుండా అడ్డుకుంటున్నారని, భారత పార్లమెంటరీ చరిత్రలో తొలిసారిగా విపక్ష నేతకు (LOP) రాష్ట్రపతి ప్రసంగంపై మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడం శోచనీయమని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంటు వెలుపల మీడియా ప్రతినిధులతో మాట్లాడిన రాహుల్ గాంధీ, ప్రధాని మోదీపై సంచలన ఆరోపణలు చేస్తూ దేశ ప్రయోజనాలను పణంగా పెట్టారని మండిపడ్డారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రస్తుతం తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నారని, అందుకే విపక్షాల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. వేల కోట్ల రూపాయలతో కృత్రిమంగా నిర్మించిన ప్రధాని మోదీ ఇమేజ్ అనే బుడగ ఇప్పుడు బద్దలయ్యే సమయం ఆసన్నమైందని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు.

భారత చరిత్రలో గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రస్తుత ప్రధానమంత్రి ఎవరో వ్యక్తుల స్వార్థ ప్రయోజనాల కోసం ‘కాంప్రమైజ్’ అయ్యారని రాహుల్ గాంధీ ఆరోపించారు. దీనివల్ల దేశ ప్రయోజనాలు దెబ్బతినడమే కాకుండా, ముఖ్యంగా రైతులకు మరియు సామాన్య ప్రజలకు భారీ నష్టం వాటిల్లుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. అమెరికాలో అదానీపై నమోదైన కేసు కేవలం ఒక వ్యక్తికి సంబంధించింది మాత్రమే కాదని, అది నేరుగా ప్రధాని మోదీ ఆర్థిక మూలాలను లక్ష్యంగా చేసుకుందని విశ్లేషించారు. అలాగే ‘ఎప్‌స్టైన్ ఫైల్స్’ (Epstein Files)లో దాగిన రహస్యాలు ప్రధానిపై ఉన్న ప్రధాన ‘ప్రెషర్ పాయింట్స్’ అని, అందుకే ఆయన ఒత్తిడికి లోనవుతున్నారని పేర్కొన్నారు.

Advertisement

గత నాలుగు నెలలుగా ఆగిపోయిన ఒక కీలక ట్రేడ్ డీల్‌పై ప్రధాని నిన్న రాత్రి హడావిడిగా సంతకం చేయడం వెనుక విదేశీ ఒత్తిళ్లు ఉన్నాయని రాహుల్ గాంధీ ఆరోపించారు. కేవలం కొందరి ప్రయోజనాల కోసం దేశాన్ని, రైతుల రక్తాన్ని ప్రధాని అమ్మేశారని ఆయన తీవ్రంగా విమర్శించారు. పార్లమెంటులో చర్చకు అవకాశం ఇవ్వకపోవడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని, ప్రజల పక్షాన తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ పారదర్శకతను కోల్పోయారని, దేశం ఎదుర్కొంటున్న వాస్తవ సమస్యల నుండి దృష్టి మళ్లించడానికి ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నారని రాహుల్ గాంధీ తన ప్రసంగంలో నొక్కి చెప్పారు.

Read Also:  అంగట్లో ఉద్యోగాలు అమ్ముకున్న చరిత్ర మీది.. నువ్వు మాట్లాడుతున్నవా కేటీఆర్, బల్మూరి వెంకట్ ఫైర్

Related News

ఇంజినీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ కంపెనీ GAIL‌లో ట్రైనీ జాబ్స్.. ఫ్రెషర్స్‌కు సూపర్ ఛాన్స్

అయోధ్య రామ మందిరానికి తొలి సీఈవో‌గా జితేంద్ర మిశ్రా!

బ్యాంక్ ఉద్యోగాల కోసం చూస్తున్నారా? IBPS RRBలో 13,706 పోస్టులు ఖాళీ.. పూర్తి వివరాలవిగో

23 రోజుల్లో 9 చలాన్లు.. రూ.56 వేల జరిమానా.. నోయిడా రేప్ బస్సు పాపాల చిట్టా!

మమతా బెనర్జీకి బిగ్ షాక్.. 28 ఏళ్ల మేనకోడలు ఆత్మహత్య.. మరణానికి కారణం అదేనా?

సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు.. విద్యార్థులపై కేసులన్నీ కొట్టివేత.. సెప్టెంబర్ 5 ఢిల్లీ మార్చ్ రద్దు

వైద్యులపై దాడికి దిగితే.. కనికరం చూపొద్దు.. సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు

ప్రాణం పోయే ఆఖరిక్షణం.. దేవదూతల్లా పెళ్లైన జంట ప్రత్యక్షం, యువ బైకర్ సేఫ్, వీడియో వైరల్

Big Stories

Advertisement
×