E-Paper
Advertisement

ప్రధాని మోదీపై రాహుల్ గాంధీ ఫైర్.. దేశ ఆర్థిక వ్యవస్థపై ఆందోళన

ప్రధాని మోదీపై రాహుల్ గాంధీ ఫైర్.. దేశ ఆర్థిక వ్యవస్థపై ఆందోళన
Advertisement

Rahul Gandhi: దేశంలో నానాటికీ పెరిగిపోతున్న ధరలు, ఆర్థిక పరిస్థితులపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. దేశ ఆర్థిక వ్యవస్థ మునుపెన్నడూ లేని విధంగా అత్యంత ప్రమాదకరమైన స్థాయికి చేరుకుంటోందని ఆయన హెచ్చరించారు. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకుంటున్న ప్రజావ్యతిరేక నిర్ణయాల వల్లే సామాన్యుడిపై ఈ స్థాయి భారం పడుతోందని ఆయన మండిపడ్డారు.

కొరతతో ప్రజల కష్టాలు.. రాజ్యాంగ ఉల్లంఘన

Advertisement

రాబోయే రోజుల్లో దేశంలో ఎరువులు, చమురు, గ్యాస్ కొరత తీవ్రం కానుందని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. ఈ నిత్యావసరాల కొరత కారణంగా ప్రజలు అల్లాడిపోయే పరిస్థితులు వస్తాయని ఆయన జోస్యం చెప్పారు. ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగబద్ధంగా వ్యవహరించడం లేదని, ప్రజాస్వామ్య విలువులను పక్కనబెట్టి నిర్ణయాలు తీసుకుంటోందని ఆయన విమర్శించారు.

కొద్దిమంది చేతుల్లో దేశ ఆర్థిక వ్యవస్థ

Advertisement

దేశ ఆర్థిక రంగాన్ని ప్రధాని మోదీ కొద్దిమంది కార్పొరేట్ శక్తులకు ధారాదత్తం చేస్తున్నారని రాహుల్ గాంధీ ధ్వజమెత్తారు. భారతదేశ ఆర్థిక వ్యవస్థను అదానీ, అంబానీలతో పాటు అమెరికా చేతుల్లో పెట్టారంటూ ఆయన తీవ్రస్థాయిలో ఆరోపణలు గుప్పించారు. దేశ సంపదనంతా లూటీ చేసి, కొద్దిమంది పెద్దల ప్రయోజనాల కోసమే ఈ ప్రభుత్వం పనిచేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

మోదీపై విమర్శలు

భారత్ మున్ముందు ఎదుర్కోబోయే ఆర్థిక సంక్షోభం అన్ని రంగాలనూ, సామాన్యుల జీవితాలనూ పూర్తిగా నాశనం చేస్తుందని రాహుల్ గాంధీ హెచ్చరించారు. ఈ సంక్షోభం ముదిరి దేశం మొత్తం ఇబ్బందుల్లో పడినప్పుడు.. ప్రధాని మోదీ ప్రజల ముందుకు వచ్చి నటన ప్రదర్శిస్తారని ఎద్దేవా చేశారు. ‘ఇదంతా జరిగినప్పుడు మోదీ గారు ప్రజల ముందుకు వచ్చి, ఇందులో తన తప్పేమీ లేదంటూ ఏడుస్తారు’ అని రాహుల్ గాంధీ వ్యంగ్యంగా విమర్శించారు. ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరిచి తప్పుడు విధానాలను పక్కనబెట్టాలని డిమాండ్ చేశారు.

మోదీ ‘మెలోడీ’ చాక్లెట్ల‌పై రాహుల్ సెటైర్లు

ప్రధాని మోదీ ఇటలీ పర్యటనపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సెటైర్లు వేశారు. దేశంలో ఆర్థిక సంక్షోభం ముంచుకొస్తోందని, విదేశాలకు వెళ్లవద్దని ప్రజలకు చెప్పిన మోదీ.. తానే స్వయంగా ఖరీదైన విమానంలో ఇటలీ వెళ్లారని విమర్శించారు. ఇటలీ ప్రధాని మెలోనికి ‘మెలోడీ’ చాక్లెట్ ఇచ్చి రీల్స్ చేస్తున్నారని మండిపడ్డారు.

Also Read: కాంగ్రెస్ కార్యకర్తలకు బంపర్ భరోసా.. కష్టపడితే గుర్తింపు గ్యారెంటీ.. ఎంపీ చామల

Related News

స్పామ్, ఫ్రాడ్ కాల్స్‌ టెన్షన్‌కు ఇక చెక్.. కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం?

ప్రపంచాన్ని సైతం కదిలించిన చరిత్ర.. అక్టోబర్ 17 ప్రత్యేకత ఏమిటో మీకు తెలుసా..?

డేంజర్ బెల్స్.. ఏఐతో భారీగా పర్యావరణం విధ్వంసం.. ఎలానో తెలుసా..?

ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత.. అభిజిత్ దీప్కే ‘తిరంగా యాత్ర’ అడ్డుకున్న పోలీసులు.. ఇంటికెళ్లి నోటీసులు అందజేత!

అమ్మబాబోయ్.. 75 ఏళ్ల తాతతో 30 ఏళ్ల యువతి పెళ్లి.. నిశ్చితార్థం వీడియో వైరల్!

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. రైల్వేలో 1,688 ఖాళీలు, సాలరీ, దరఖాస్తు పూర్తి వివరాలివిగో

నా ఇంటి చుట్టూ నిఘా పెట్టారు.. ఏ క్షణమైనా అరెస్ట్ చేయవచ్చు, సీజేపీ ఫౌండర్ అభిజిత్ దీప్కే

ఉక్రెయిన్ యుద్ధభూమిలో ఎలాన్ మస్క్ బిగ్ ట్విస్ట్..?

Big Stories

Advertisement
×