E-Paper
Advertisement

పిల్లి శాపాల‌కు ఉట్టి తెగిప‌డ‌దు..! కేసీఆర్‌పై బండి సంజ‌య్ తాజా కామెంట్స్ వెనుక మ‌ర్మం ఇదే!

పిల్లి శాపాల‌కు ఉట్టి తెగిప‌డ‌దు..! కేసీఆర్‌పై బండి సంజ‌య్ తాజా కామెంట్స్ వెనుక మ‌ర్మం ఇదే!
Advertisement

చాలా రోజుల త‌రువాత కేసీఆర్ మొన్న జ‌గిత్యాల బ‌హిరంగ స‌భ పెట్టాడు. గుర్తుంది క‌దా! ఆస‌భ‌లో సీఎం రేవంత్‌రెడ్డిని ఉద్దేశించి ఓ సామెత చెప్పాడు. తెల్లారి లేస్తే రేవంత్ త‌న చావు కోరుకుంటున్నాడ‌ని చెబుతూ.. పిల్లికి ఉట్టి అంద‌డం లేద‌ని.. అది తెగి కింద ప‌డాల‌ని శాప‌నార్ధాలు పెట్టింద‌ట‌..! అది శాప‌న‌ల‌కు ఉట్టి తెగిప‌డ‌త‌దా? అని కౌంట‌ర్ ఇచ్చుకున్నాడు. స‌రిగ్గా ఇదే తీరులో… కేసీఆర్‌కు కౌంట‌ర్ ఇచ్చాడు కేంద్ర మంత్రి బండి సంజ‌య్‌. త‌నను కేంద్ర మంత్రి ప‌ద‌వి నుంచి బ‌ర్త‌ర‌ఫ్ చేయాల‌ని బీఆరెస్ డిమాండ్ చేస్తున్న‌ద‌ని మీడియా అడిగిన ప్ర‌శ్న‌కు ఆయ‌న.. సూటిగా, ఘాటుగా స‌మాధాన‌మిచ్చాడు. డైరెక్టుగా కేసీఆర్ పేరు తీసుకునే విమ‌ర్శించాడు.

అక్క‌డ ఫామ్‌హౌజ్‌లో కూసుని ఆయ‌న మ‌స్తు కోరుకుంటాడు.. అందులో త‌ప్పులేదు.. ఎందుకంటే… ఆయ‌న గ‌డీల పాల‌న‌ను కూల్చింది మేమే.. అవినీతి సామ్రాజ్యాన్ని బ‌ద్ద‌లు కొట్టిందీ మేమే…కుటుంబ పాల‌న‌కు చ‌ర‌మ‌గీతం పాడిందీ మేమే..! అందుకే మాపై ఆ క‌సి ఉంటుంది! అన్నాడు. అంటే.. త‌న‌పై కేసీఆర్‌, కేటీఆర్‌ల‌కు వ్య‌క్తిగ‌త క‌క్ష ఉంద‌ని, అందుకే ఇదంతా చేస్తున్నార‌ని అర్థం వ‌చ్చేలా మాట్లాడిన ఆయ‌న‌.. ఇంకోమాట కూడా అన్నాడు. పాపం కేసీఆర్‌కు 17 ఎంపీ మంది ఎంపీలున్నారు. ఈయ‌న పార్టీ స‌పోర్టుతోనే అక్క‌డ మోడీ ప్ర‌ధానిగా ఉన్నాడు. ఈయ‌న కోర‌గానే… ఆయ‌న వింటాడు! అని వ్యంగ్యంగా ఆయ‌న మాట్లాడిన మాట‌ల్లో అదిష్టానం అంత‌రంగాన్ని ప‌రోక్షంగా వెల్ల‌డించిన‌ట్ట‌య్యింది.

Advertisement

ఇక్క‌డ కేసీఆర్‌కు అంత సీన్‌లేదు. తండ్రీకొడుకులు ఇద్ద‌రూ డిమాండ్ చేయ‌గానే అక్క‌డ ఉన్న మోడీ వినే స్థితి లేదు. ఆయ‌నకు త‌నంటే ఏమిటో తెలుసు..! మంత్రి ప‌ద‌వి బ‌ర్త‌ర‌ఫ్ అనేది జ‌ర‌గ‌ని ప‌ని అని న‌ర్మ‌గ‌ర్బంగా త‌న అభిప్రాయాన్ని తెలియ‌జేశాడు బండి. త‌న‌ను కొడుకు విష‌యంలో బ‌ద్నాం చేసేందుకు కేసీఆర్ కొడుకు ఓ ఫేక్ మీడియా సామ్రాజ్యాన్నే న‌డిపాడ‌న్నాడు సంజ‌య్‌. అంటే త‌న‌పై తండ్రీకొడుకులకు ఎంత క‌సి ఉందో దీన్ని బ‌ట్టి ప్ర‌జ‌లు అర్థం చేసుకోవాల‌ని ఆయ‌న ప‌రోక్షంగా విడ‌మ‌రిచి చెప్పిన‌ట్టుగా అనిపించింది.

ఈ కామెంట్స్ ద్వారా బీఆరెస్‌పై త‌న మాట‌ల దాడి మున్ముందు ఇంకా దూకుడుగా ఉంటుందనే సిగ్న‌ల్ ఇచ్చాడు బండి. కొడుకు కేసు కోర్టు ప‌రిధిలో ఉంద‌ని చెబుతూనే.. త‌నే స్వ‌యంగా కొడుకును పోలీసుల‌కు అప్ప‌గించాన‌ని, రాజ‌కీయ చ‌రిత్ర‌లో ఇదెక్క‌డ‌న్నా జ‌రిగిందా? అని కూడా ఆయ‌న త‌న‌ను విమ‌ర్శించిన పార్టీల‌ను ప్ర‌శ్నించిన‌ట్టుగా మాట్లాడారు. త‌న‌కు అధిష్టానం భ‌రోసా ఉంద‌ని, కేంద్ర మంత్రి ప‌ద‌వికి వచ్చిన న‌ష్ట‌మేమీ లేద‌నే విధంగా తాజా ప‌రిణామాల త‌రువాత ఆయ‌న చేసిన కామెంట్స్ రాజ‌కీయంగా చ‌ర్చ‌కు తెర తీశాయి. త‌నను వ్య‌క్తిగ‌తంగా డ్యామేజీ చేయ‌డంలో బీఆరెస్ పార్టీ అత్యుత్సాహం, ఫేక్ ప్ర‌చారాల ప‌ట్ల కూడా కేసీఆర్, కేటీఆర్‌కు ఇన్‌డైరెక్టుగా బండి వార్నింగ్ ఇచ్చిన‌ట్టే మాట్లాడాడు.

Advertisement

ఇక పొలిటిక‌ల్‌గా వీరిపై మ‌రింత‌గా త‌న దూకుడు ఉంటుంద‌నే చ‌ర్చ‌కు తావిచ్చాడు. దీంతో పాటు ఆయ‌న క‌రుడుగ‌ట్టిన బీజేపీ నేత‌లు, కార్య‌క‌ర్త‌లు.. అని ఓ సంద‌ర్భంగా సంబోధిస్తూ మాట్లాడారు. అంటే త‌న కొడుకు కేసు విష‌యంలో .. తెర వెనుక ప్రోత్స‌హించిన‌, అగ్నికి ఆజ్యం పోసిన నేత‌ల విష‌యాల‌నూ ఆయ‌న ప‌రోక్షంగా గుర్తు చేసిన‌ట్టు కామెంట్ చేశారు. ఈ కేసులో కేటీఆర్‌, కేసీఆర్‌లే కాదు.. సొంత పార్టీ నేత‌ల వెన్నుపోటు రాజ‌కీయాలు కూడా వ్య‌క్తిగ‌తంగా త‌న‌ను ఇబ్బంది పెట్టాయ‌ని చెప్ప‌క‌నే చెప్పాడు బండి. ఇప్పుడు ఈ కామెంట్స్ రాజ‌కీయ స‌ర్కిళ్ల‌లో హాట్ టాపిక్‌గా మారాయి.

Related News

ముళ్ల కుర్చీపై కూర్చున్న మ‌ల్ల‌న్న‌! బాస్‌ను తిట్టే తిట్ల‌న్నీ వింటూ ఓపిగ్గా భ‌రించిన మ‌ల్లారెడ్డి..!

ప‌శ్చాత్తాపాలు.. మీ పాపాల‌ను క‌డ‌గ‌లేవు! అందెశ్రీ గ‌ళానికి సంకెళ్లేశావు..! ఫామ్‌హౌజ్‌లో నిన్ను బంధీ చేశాము..!

డెబ్బైవేల‌కు ఒక్క‌రు త‌గ్గినా.. త‌ల‌న‌రుక్కుంటా..! ఉద్యోగాల క‌ల్ప‌న‌లో ఎవ‌రి లెక్క‌లు వారివే..

కేటీఆర్ ప‌శ్చాత్తాపం! పొరపాట్ల‌కు చింతిస్తున్నాం.. మీ ఆకాంక్ష‌ల బాధ్య‌త నేను తీసుకుంటా..!

ఇక చివరి దరువు ధరణి! విచారణలేనా!? చర్యలుండవా…? జ‌నం ఏమ‌నుకుంటున్నారు..?

మావిగ‌న్‌ను ముంచిన అమ‌రావ‌తి!జ‌గ‌న్‌కు చెంప‌పెట్టులాంటి బాబు ఆన్స‌ర్.. అమ‌రావ‌తి ఆర్థిక మండ‌లి..!

అంతుచిక్క‌ని అర్వింద్ అంతరంగం! అనుకున్న‌ది చేస్తాడు.. చెప్పాల్సింది చెప్పేస్తాడు…లైన్ దాటి!

కేసీఆర్ ట్ర‌య‌ల్ ర‌న్‌! కేటీఆర్‌ భారీ బ‌హిరంగ స‌భ‌లు! మొన్న రైతు స‌భ‌.. రేపు యువ సంగ్రామ స‌ద‌స్సు.. !

Big Stories

Advertisement
×