E-Paper
Advertisement

దేశంలో గ్యాస్ సంక్షోభం.. మోదీ విధానాలపై రాహుల్ ధ్వజం, పేదలపై భారమంటూ మండిపాటు

దేశంలో గ్యాస్ సంక్షోభం.. మోదీ విధానాలపై రాహుల్ ధ్వజం, పేదలపై భారమంటూ మండిపాటు
Advertisement

Rahul Gandhi: ఇరాన్ యుద్ధం నేపథ్యంలో దేశంలో రోజు రోజుకూ గ్యాస్ సంక్షోభం తీవ్రమవుతోంది. గ్యాస్ సిలిండర్ కోసం సామాన్యులు పడరాని పాట్లు పడుతున్నారు. పరిస్థితులు జఠిలం కావడంతో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ రియాక్ట్ అయ్యారు. ఇలాంటి సమయంలో ప్రధాని మోదీ వ్యవహరిస్తున్న తీరును ఆయన దుయ్యబట్టారు.

దేశంలో గ్యాస్ సంక్షోభం జఠిలం..  మోదీ ప్రభుత్వం రాహుల్ ధ్వజం

Advertisement

దేశంలో గ్యాస్ సంక్షోభం తీవ్రమవుతోంది. గ్యాస్ సిలిండర్ కోసం సామాన్యుడు పడరాని పాట్లు పడుతున్నారు. గ్యాస్ డెలివరీ చేసే ఏజెన్సీల వద్ద గంటల తరబడి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒక వేళ గ్యాస్ బుకింగ్ చేసినా ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది. ఆన్‌లైన్ ద్వారా బుకింగ్ చేస్తే ఫోన్ కట్ అవుతున్న సందర్భాలు దేశవ్యాప్తంగా నెలకొంది.

గ్యాస్ సంక్షోభంపై నోరు విప్పారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌‌గాంధీ. కోవిడ్ మాదిరిగా ఎల్పీజీ గ్యాస్ సంక్షోభాన్ని ఎదుర్కొంటానని మోదీ చెప్పారని అన్నారు. ఈ విషయంలో ఆయన సరిగ్గా వ్యవహరించారో లేదో తెలీదుగానీ కోవిడ్ మాదిరిగా ఎలాంటి విధానం లేదన్నారు. పెద్ద పెద్ద ప్రకటనలు ఇస్తున్నారని, చివరకు పేదలపై భారం మోపుతున్నారని దుయ్యబట్టారు.

Advertisement

కార్మికులు గ్రామాలకు వలసలు మొదలు, సంక్షోభం దౌత్యం వల్ల జరిగిందా?

రోజుకు 500 నుంచి 800 సంపాదించే వలస కార్మికులకు గ్యాస్ అందుబాటులో లేకుండా పోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. సాయంత్రం ఇంటికి వెళ్లిన కార్మికులకు పొయ్యి వెలిగించుకోవడానికి డబ్బులు లేని పరిస్థితి ఏర్పడిందన్నారు. ఉపాధి కోసం నగరాలకు వచ్చినవారు, చివరకు గ్రామాలకు పారిపోయే పరిస్థితులు వచ్చాయని మండిపడ్డారు.

గ్యాస్ ఆధారిత పరిశ్రమల గురించి చెప్పనక్కర్లేదు. వస్త్ర మిల్లులు, కర్మాగారాలకు వెన్నెముకైన కార్మికులు ఇవాళ కుప్పకూలిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం దేశంలో వస్త్ర రంగం ఐసీయూలో ఉందన్నారు. తయారీ రంగం కుప్పకూలుతోందన్నారు. మరి ఈ సంక్షోభం ఎక్కడి నుంచి వచ్చింది? దౌత్యపరమైన చర్చల వల్ల జరిగిన పొరపాటా? దీనిపై మాట్లాడేందుకు ప్రభుత్వం నిరాకరిస్తోందన్నారు.

ALSO READ: సీఎం బిశ్వశర్మపై రాహుల్‌గాంధీ ఆగ్రహం.. ఆయన్ని వదిలిపెట్టం, చట్టపరమైన చర్యలు తప్పవు

అహంకారమే విధానంగా మారినప్పుడు ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతుందన్నారు. పరిశ్రమలు మూతపడడంతో కార్మికులు వలసపోతారన్నారు. దేశం దశాబ్దాల వెనక్కి వెళ్తుందన్నారు. ప్రతి సంక్షోభంలో పేదలే ఎందుకు మొదట చనిపోతున్నారని ప్రశ్నించారు. ఇలాంటి పరిస్థితుల్లో మౌనంగా ఉండడం సరికాదన్నారు. ఇది కేవలం పేదల సమస్య మాత్రమే కాదని, మనందరి సమస్య అని ఎక్స్ వేదికగా పేర్కొన్నారు.

Related News

రైల్వే జాబ్స్.. RRB NTPCలో మొత్తం 5,165 ఖాళీలు.. డిగ్రీ ఉంటే చాలు

బెంగాల్‌లో ప్రతీకార రాజకీయాలు.. అభిషేక్ బెనర్జీ ఆఫీసుపై దాడులు, వెలుగులోకి షాకింగ్ వీడియో

ఆపరేషన్ సింధూర్ హీరో జితేంద్ర మిశ్రా.. రామ్‌మందిర్ సీఈఓగా ఎలా అయ్యారు? వెనుక జరిగింది ఏమిటి?

ఇంజినీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ కంపెనీ GAIL‌లో ట్రైనీ జాబ్స్.. ఫ్రెషర్స్‌కు సూపర్ ఛాన్స్

అయోధ్య రామ మందిరానికి తొలి సీఈవో‌గా జితేంద్ర మిశ్రా!

బ్యాంక్ ఉద్యోగాల కోసం చూస్తున్నారా? IBPS RRBలో 13,706 పోస్టులు ఖాళీ.. పూర్తి వివరాలవిగో

23 రోజుల్లో 9 చలాన్లు.. రూ.56 వేల జరిమానా.. నోయిడా రేప్ బస్సు పాపాల చిట్టా!

మమతా బెనర్జీకి బిగ్ షాక్.. 28 ఏళ్ల మేనకోడలు ఆత్మహత్య.. మరణానికి కారణం అదేనా?

Big Stories

Advertisement
×