Mega Family:టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో బడా ఫ్యామిలీగా గుర్తింపు సొంతం చేసుకున్న మెగా ఫ్యామిలీ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ఒక్క ఈ కుటుంబం నుంచే దాదాపు పది మందికి పైగా హీరోలు ఇండస్ట్రీలో చలామణి అవుతున్నారు. ముఖ్యంగా చిరంజీవి (Chiranjeevi ), పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) వంటి సీనియర్ హీరోలు వరుస పెట్టి సినిమాలు చేస్తుంటే.. రామ్ చరణ్ (Ram Charan)వంటి గ్లోబల్ స్టార్.. అల్లు అర్జున్ (Allu Arjun) వంటి ఐకాన్ స్టార్లు గ్లోబల్ స్థాయిలో తమ పాపులారిటీని విస్తరించుకునే ప్రయత్నంలో బిజీగా ఉన్నారు. ఇక ఈ కుటుంబం నుంచి వచ్చిన మిగతా హీరోలు ఇండస్ట్రీలో స్టార్ స్టేటస్ ను అందుకునే ప్రయత్నం చేస్తున్న విషయం తెలిసిందే.
ఈ క్రమంలోనే ఇప్పుడు ఈ కుటుంబానికి సంబంధించిన ఒక వార్తా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ముఖ్యంగా మెగా కుటుంబానికి చెందిన ఒక స్టార్ కిడ్ ఇప్పుడు ఇండస్ట్రీలో యంగ్ హీరోయిన్ గా కొనసాగుతున్న బ్యూటీతో ప్రేమలో పడ్డారని, త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారనే వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి.. మరి ఎవరు ఆ స్టార్ కిడ్ ? ఎవరు ఆ యంగ్ హీరోయిన్ ?అనే విషయాలు ఇప్పుడు చూద్దాం..
సినిమా ఇండస్ట్రీలో స్టార్ కిడ్స్ పెళ్లిళ్లు దాదాపు అందరివి అయిపోతున్నాయి. రీసెంట్ గా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కూడా నిశ్చితార్థం చేసుకున్నారు ఈనెల 29న ఆయన కూడా వైవాహిక బంధం లోకి అడుగుపెడుతున్నారు. ఇక మిగిలింది అక్కినేని ఫ్యామిలీ నుండి సుశాంత్, మెగా ఫ్యామిలీ నుండి సాయి ధరంతేజ్ ,పంజా వైష్ణవ్ తేజ్ మాత్రమే.. అటు చాలాకాలంగా సుశాంత్ , మీనాక్షి చౌదరితో ప్రేమలో ఉన్నారని రూమర్స్ వినిపించాయి. అయితే ఈ రూమర్స్ పై మీనాక్షి చౌదరి గతంలో స్పందించినా ఆ రూమర్స్ మాత్రం ఎక్కడ ఆగలేదు . ఆమె మళ్ళీ ఈ ఏడాది సంక్రాంతికి అనగనగా ఒక రాజు సినిమా ప్రమోషన్స్ లో భాగంగా స్పందిస్తూ సుశాంత్ తనకు స్నేహితుడు మాత్రమేనని అలాంటి రూమర్స్ దయచేసి స్ప్రెడ్ చేయకండి అంటూ క్లారిటీ ఇచ్చింది.
ఇక మిగిలింది సాయి ధరంతేజ్, పంజా వైష్ణవ తేజ్. గతంలో సాయిధరమ్ తేజ్ కి కూడా కొంతమంది హీరోయిన్స్ తో జతకట్టారు. కానీ అవేవీ నిజం కాలేదు. ప్రస్తుతం ఆయన సంబరాల ఏటిగట్టు సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకోబోతున్నారు అనడంలో సందేహం లేదు. అందుకే పెళ్లిపై ఆలోచనలు చేయకుండా కెరియర్ పై దృష్టి పెట్టి బిజీగా మారిపోయారు సాయిధరమ్ తేజ్. ఇక మిగిలింది పంజా వైష్ణవ తేజ్ మాత్రమే.. ఉప్పెన సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న వైష్ణవ్. ఆ తర్వాత చేసిన కొండపొలంతో పాటు మరికొన్ని చిత్రాలు డిజాస్టర్ గా నిలిచాయి. ప్రస్తుతం వైష్ణవ్ తేజ్ సినిమాలు ప్లాప్ లోనే ఉన్నాయి. అటు ఉప్పెన సినిమాతో హీరోయిన్గా ఇండస్ట్రీకి పరిచయమైన కృత్తి శెట్టి కూడా వరుస డిజాస్టర్ లతో సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తోంది.
అందులో భాగంగానే ఈమె ప్రముఖ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్ , కళ్యాణ్ రామ్ హీరోలుగా నటిస్తున్న ఒక కొత్త చిత్రంలో కళ్యాణ్ రామ్ కి జోడిగా ఫిక్స్ అయింది . ఈ విషయాన్ని అనిల్ రావిపూడి ఇటీవల అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే . ఇప్పుడు ఈ ఇద్దరు ప్రేమించుకుంటున్నారు అనే వార్త సోషల్ మీడియాలో గట్టిగా వినిపిస్తోంది. ఉప్పెన సినిమా సమయంలో ఇద్దరి మధ్య స్నేహం పెరిగిందని, ఆ స్నేహం కాస్త ప్రేమగా మారిందని.. త్వరలోనే మెగా ఫ్యామిలీలోకి కృతి శెట్టి కోడలిగా అడుగుపెట్టబోతోందనే వార్తలు సోషల్ మీడియాలో జోరుగా సాగుతున్నాయి.
ALSO READ:ధనుష్ తో స్నేహం.. చేదు జ్ఞాపకంపై విఘ్నేష్ శివన్ షాకింగ్ కామెంట్స్!
అయితే ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ఒకప్పుడు మెగా ప్రిన్స్ హీరో వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి ల విషయంలో వచ్చిన గాసిప్స్ నిజమయ్యాయి. మరి ఇప్పుడు ఈ జంటపై కూడా గాసిప్స్ వస్తున్నాయి. ఒకవేళ ఈ గాసిప్స్ నిజమవుతాయా ? లేదా? అనే విషయాన్ని కాలమే నిర్ణయించాలి.