BigTV English

Rahul Gandhi Fiery Speech: పార్లమెంట్‌లో శివాలెత్తిన రాహుల్ గాంధీ.. ప్రధాని మోదీపై ఫైర్..

Rahul Gandhi Fiery Speech: పార్లమెంట్‌లో శివాలెత్తిన రాహుల్ గాంధీ.. ప్రధాని మోదీపై ఫైర్..

Rahul Gandhi Fiery Speech in Parliament targets PM Modi: ప్రతిపక్ష నేత, ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ అధికార పక్షంపై విమర్శల వర్షం గుప్పించారు. లోక్ సభలో మణిపూర్ హింసను ప్రస్తావించిన రాహుల్ గాంధీ బీజేపీపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా ఆయన హిందూ సమాజం హింసను ప్రేరేపించదని తెలిపారు. భారతదేశ ప్రజలను బీజేపీ భయకంపితులను చేస్తోందన్నారాయన. ప్రతి మతం నిర్భయత, ధైర్యం, అహింస సందేశాలను చాటిచెబుతుందన్నారు.


రాహుల్ గాంధీ ప్రసంగం సందర్భంగా ప్రధాని మోదీ జోక్యం చేసుకున్నారు. మొత్తం హిందూ సమాజాన్ని హింసాత్మకంగా పేర్కొనడం తీవ్రమైన సమస్య అంటూ ఫైర్ అయ్యారు. దీంతో రాహుల్ గాంధీ బీజేపీ, ఆర్ఎస్ఎస్ మొత్తం హిందూ సమాజం కాదని బదులిచ్చారు. నిర్భయత ప్రాముఖ్యతను నొక్కిచెప్పడానికి ఇస్లాం, క్రైస్తవం, బౌద్ధమతం, జైనమతం, సిక్కు మతాలను ఉదహరిస్తూ అన్ని మతాలు ధైర్యం గురించి మాట్లాడతాయని రాహుల్ గాంధీ నొక్కి చెప్పారు.

అధికార పార్టీ ప్రతిపాదించిన ఆలోచనలను లక్షలాది మంది ప్రజలు ప్రతిఘటించారని రాహుల్ గాంధీ అన్నారు. రాజ్యాంగం, భారతదేశ ప్రాథమిక ఆలోచనపై బీజేపీ క్రమబద్ధమైన దాడులను ప్రారంభిస్తోందని ఆయన ఆరోపించారు.


రాహుల్ గాంధీ లోక్ సభలో నీట్ ప్రస్తావన తీసుకొచ్చారు. నీట్ పరీక్ష ప్రొఫెషనల్ పరీక్ష అని, కానీ బీజేపీ దాన్ని కమర్షియల్ గా మార్చారని ఆరోపించారు. రైతు చట్టాల వల్ల దాదాపు 700 మంది రైతులు ప్రాణాలు కోల్పోయారని అన్నారు. కనీసం వారికి సంతాపంగా మౌనం పాటించలేదని పేర్కొన్నారు. అసలు రాష్ట్రపతి ప్రసంగంలో నీట్, అగ్నివీర్ ప్రస్తావనే లేదన్నారు. బీజేపీ పాలనలో సంస్థలు నిర్వీర్యమయ్యాయన్నారు.

Also Read: నీట్‌పై చర్చకు నిరాకరణ.. లోక్‌సభ నుంచి విపక్షాల వాకౌట్

మణిపూర్‌లో హింసాకాండ చెలరేగినా ప్రధాని మోదీ ఇప్పటివరకు ఆ రాష్ట్రానికి వెళ్లలేదని రాహుల్ గాంధీ అన్నారు. జమ్మూ కశ్మీర్‌ను రెండు ముక్కలు చేశారని ఫైర్ అయ్యారు. డీమానిటైజేషన్ వలన యువత ఉపాధి అవకాశాలు కోల్పోయరని అన్నారు. జీఎస్టీ తీసుకురావడం వలన వ్యాపారులు, ప్రజలు అనేక బాధలు పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు.

Related News

New GST Rates: నేటి నుంచి భారీ ఉపశమనం.. GST 2.Oలో తగ్గిన వస్తువుల ధరల లిస్ట్ ఇదే!

PM Modi On GST 2.O: రేపటి నుంచి జీఎస్టీ ఉత్సవ్.. ప్రతి ఇంటిని స్వదేశీ చిహ్నంగా మార్చండి: ప్రధాని మోదీ

Deputy Cm: డిప్యుటీ సీఎం X అకౌంట్ హ్యాక్.. ఆ పోస్టులు ప్రత్యక్షం, ఇది పాకిస్తాన్ పనా?

Job Competition: 53,000 ప్యూన్ పోస్టులకు.. 25 లక్షల మంది పోటీ!

H-1B Visa: రద్దీగా ఎయిర్‌పోర్టులు .. అమెరికాకు ప్రవాసుల పయనం, పెరిగిన విమానాల టికెట్ల ధరలు

H-1B Visas: హెచ్-1బీ వీసాల ఫీజు పెంపు.. భారత టెక్ కంపెనీల పరిస్థితి ఏమిటి? ఆ సమస్య తప్పదా?

UPS Deadline: UPSలోకి మారాలనుకునే ప్రభుత్వ ఉద్యోగులకు సెప్టెంబర్-30 డెడ్ లైన్

India Vs Pakistan: ఇస్లామిక్ నాటో పైనే పాకిస్తాన్ ఆశలు.. భారత్‌కు ముప్పు తప్పదా?

Big Stories

×