E-Paper
Advertisement

ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు.. బీజేపీకి కొత్త టెన్షన్.. కాంగ్రెస్ వైపు మైనార్టీల మొగ్గు, అస్సాం టు తమిళనాడు

ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు.. బీజేపీకి కొత్త టెన్షన్.. కాంగ్రెస్ వైపు మైనార్టీల మొగ్గు, అస్సాం టు తమిళనాడు
Advertisement

Assam Result: దేశంలోని ముస్లిం వర్గాలు దశాబ్దమున్నరపాటు బీజేపీకి అండగా నిలిచింది. అందువల్లే మోదీ ప్రభుత్వం హ్యాట్రిక్ సాధించిందని చెబుతుంటారు. ఆ ఓటు బ్యాంకు ఇప్పుడిప్పుడే టర్న్ అవుతున్నట్లు కనిపిస్తోంది. అందుకు నిదర్శనం ఇటీవల కేరళ-అస్సాంలోని వచ్చిన ఫలితాలు. ఇదే కంటిన్యూ అయితే 2029 పార్లమెంటు ఎన్నికల్లో మోదీ ప్రభుత్వానికి కష్టాలు తప్పవనే వాదన బలంగా వినిపిస్తోంది.

ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు.. బీజేపీకి కొత్త టెన్షన్ 

Advertisement

ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ మూడు రాష్ట్రాల్లో ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తోంది. దీంతో ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు సంబరాల్లో మునిగి తేలారు. ఆనందం వెంటే విషాదం కూడా ఉంటుందని అప్పుడప్పుడు నేతలు చెబుతుంటారు. తాజాగా మైనార్టీ ఓటర్లు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నట్లు కనిపిస్తోంది. అందుకు కేరళ, అస్సాం రాష్ట్రాల్లో  కాంగ్రెస్ పార్టీ సాధించిన సీట్లు అందుకు ఉదాహరణ.

ఐదు రాష్ట్రాలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఆసక్తికర విశ్లేషణలు బయటకు వస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ తరపున గెలుపొందిన అభ్యర్థులు అత్యధిక శాతం ముస్లిం వర్గానికి చెందినవారు ఉన్నారు. అసోం, కేరళ, పశ్చిమ బెంగాల్, తమిళనాడుల్లో ఇది స్పష్టంగా కనిపిస్తోంది.

Advertisement

కాంగ్రెస్ వైపు మైనార్టీల మొగ్గు.. అన్ని రాష్ట్రాల్లో ముస్లిం అభ్యర్థులు గెలుపు

అసోం ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ 19 అసెంబ్లీ సీట్లను గెలుచుకుంది. అందులో 18 మంది ముస్లిం అభ్యర్థులు విజయం సాధించారు. ఈసారి కాంగ్రెస్ పార్టీ 20 మంది ముస్లింలకు టికెట్లు ఇచ్చింది. కాంగ్రెస్ మిత్రపక్షమైన రాయిజోర్ దళ్ గెలిచిన ఇద్దరిలో ఒకరు ముస్లిం నేత ఉన్నారు.

కేరళలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ ఘన విజయం సాధించింది. 140 స్థానాలున్న కేరళలో వివిధ పార్టీల నుంచి 35 మంది ముస్లిం అభ్యర్థులు ఎమ్మెల్యేలుగా గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టారు. అందులో 30 మంది యూడీఎఫ్ కూటమి నుంచి ఉన్నారు. 30 మందిలో 8 మంది కాంగ్రెస్ అభ్యర్థులు కాగా మిత్రపక్షాలకు చెందినవారు 22 మంది ఉన్నారు.

ALSO READ: తమిళ విక్టరీ విజయ్ కోసం.. గూగుల్ తెగ వెతికేస్తున్న నెటిజన్స్, ఆ వివరాలు ఇవే! 

బెంగాల్‌లో కాంగ్రెస్ గెలుపొందిన రెండు స్థానాల్లో ముస్లిం అభ్యర్థులు విజయం సాధించారు. ఆ పార్టీ 63 మంది ముస్లింలకు టికెట్లు కేటాయించిన విషయం తెల్సిందే. ఇక తమిళనాడు విషయానికి వద్దాం. డీఎంకెతో పొత్తులో భాగంగా రెండు సీట్లు ముస్లింలకు కేటాయించింది కాంగ్రెస్ పార్టీ. అందులో ఒక అభ్యర్థి గెలిచారు.

ఐదు రాష్ట్రాల ఫలితాలను విశ్లేషిస్తే.. కేరళ, అసోం, బెంగాల్, తమిళనాడు రాష్ట్రాల్లో కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు నిలబెట్టిన ముస్లిం అభ్యర్థుల్లో గెలుపు 80 శాతంగా ఉందని తేలింది. ఇదే జోరు కంటిన్యూ అయితే 2029 పార్లమెంటు ఎన్నికల్లో మోదీ ప్రభుత్వానికి కష్టాలు తప్పవనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి.

Related News

రైతులను నెలకు రూ.3 వేలు పెన్షన్.. ఆ స్కీమ్ గురించి తెలుసా, వెంటనే అప్లై చేయండి?

రోడ్డుపై BMW బీభత్సం, స్పాట్‌లో ముగ్గురు మృతి, ముంబైలో ఘోర రోడ్డు ప్రమాదం

లాల్‌బాగ్ గణేష్ మండపం వద్ద ఘోర విషాదం.. చిన్నారితో సహా ఇద్దరు భక్తులు దుర్మరణం

భార్య ప్రైవేట్ పార్ట్స్ కొరికితే.. భర్త ముక్కు కొరికేశాడు, యూపీలో విచిత్రమైన ఘటన

రైల్లో టికెట్ లేకుండా ప్రయాణం చేసిన మహిళ .. TTEతో వాగ్వాదం, స్వయంగా బట్టలు చించుకుని

మధ్యప్రదేశ్‌లో ఘోర ప్రమాదం.. జలపాతంలోకి దూసుకెళ్లిన కారు, 8 మంది మృతి

భార్యకు మస్కా కొట్టి.. ప్రేయసితో మలేషియా ట్రిప్ ప్లాన్.. తీరా ఎయిర్‌పోర్టులో ఊహించని ట్విస్ట్!

దీదీకి దెబ్బ మీద దెబ్బ.. నందిగ్రామ్ తర్వాత రెజీనగర్‌లోనూ షాక్!

Big Stories

Advertisement
×