BigTV English

Rahulgandhi on NEET: లోక్‌సభలో నీట్ రగడ, రాహుల్ సూటి ప్రశ్న

Rahulgandhi on NEET: లోక్‌సభలో నీట్ రగడ, రాహుల్ సూటి ప్రశ్న

Rahulgandhi on NEET issue(Political news telugu): పార్లమెంట్ సమావేశాల తొలిరోజు నీట్ పేపర్ లీక్ వ్యవహారం లోక్‌సభను కుదిపే సింది. సోమవారం సభలో అధికార-విపక్షాల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. ఉదయం 11 గంటలకు సమావేశాలు ప్రారంభం కాగానే విపక్ష నేత రాహుల్‌గాంధీ నీట్ వ్యవహారాన్ని లేవనెత్తారు. నీట్‌ లోనే కాదు అన్ని ప్రధాన పరీక్షల్లోనూ మన పరీక్షా విధానంలో చాలా సమస్యలు ఉన్నాయన్నారు.


ఈ క్రమంలో జోక్యం చేసుకున్న మంత్రి ధర్మేంద్రప్రధాన్, గడిచిన కాలంలో పేపర్లు లీక్ అయిన దాఖలాలు లేవని, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఇప్పటివరకు 240 పరీక్షలను విజయవంతంగా నిర్వహించిందని గుర్తు చేశారు. నీట్ వ్యవహారంపై ప్రస్తుతం సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోందంటూ తప్పించుకునే ప్రయ త్నం చేశారు. కేవలం ఆరోపణలు చేయడంవల్ల అబద్దం నిజం కాదన్నారు. దేశంలో పరీక్షా విధానం చెత్త గా ఉందని ప్రతిపక్ష నేత చెప్పడం దారుణమన్నారు.

సమావేశాల నుంచి బయటకువచ్చిన ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ.. నీట్ వ్యవహారంపై మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ స్పందించి ఉండాల్సిందన్నారు. సుప్రీంకోర్టు, ప్రధాని మోదీ గురించి మాట్లాడారంటూ తప్పించు కునే ప్రయత్నం చేశారన్నారు. దీనిపై ఏం చేస్తున్నారో చెప్పలేకపోతున్నారన్నారు. నీట్ వ్యవహారం యువతకు చాలా ముఖ్యమైనదని, దీనిపై పార్లమెంట్‌లో చర్చకు కోరుతున్నామన్నారు. కానీ అధికార పార్టీ తప్పించుకునే ప్రయత్నం చేస్తోందన్నారు. ఈ అంశాన్ని సభలో తాము లేవనెత్తుతూనే ఉంటామన్నారు.


ALSO READ: మొబైల్ ఫోన్స్ ధరలు తగ్గుతాయా?.. కొత్త బడ్జెట్‌పై ఆశలు..

విపక్షాల ఆలోచనను గమనించిన ప్రధాని నరేంద్రమోదీ, పార్లమెంట్ సమావేశాలకు ముందు మీడియాతో మాట్లాడారు. రాజకీయాలు చేయడానికి పార్లమెంట్ వేదిక కాదని, ప్రతిపక్షాలకు హితవు పలికారు. 2029లో మరోసారి తలపడదామని, అప్పటివరకు రైతులు, మహిళలు, యవత జీవితాలను బాగు చేసేందుకు వినియోగించాలన్నారు.

సభలో నిరంతరం గందరగోళం వల్ల కొందరు సభ్యులు తమ సమస్యలను చెప్పలేకపోతున్నారన్నారు ఆవేదన వ్యక్తంచేశారు ప్రధాని మోదీ. ప్రజలు తీర్పు ఇచ్చేశారని, వాటిని నుంచి బయటకు వచ్చి దేశం కోసం పని చేయాలన్నారు. మొత్తానికి నీట్ అంశంపై సైలెంట్ కావాలన్నది ప్రభుత్వ ఆలోచనగా కనిపి స్తోందన్నమాట.

 

 

Related News

America Cool Drinks: అమెరికా కూల్ డ్రింక్స్ ఇక బంద్.. ఆ రాష్ట్రంలోని హోటళ్లు కీలక నిర్ణయం

Alien Attack on Earth: దూసుకొస్తున్న UFO! భూమిపై ఏలియన్స్ దాడి.. ఎప్పుడంటే!

NIRF Rankings 2025: NIRF ర్యాం‘కింగ్‌’లో ఐఐటీ చెన్నై.. ఐఐఎం అహ్మదాబాద్, తెలుగు రాష్ట్రాల యూనివర్సిటీలెక్కడ?

Delhi: పొంగిన యమునా నది.. ఫ్లైఓవర్ మధ్య భారీ హోల్, ఆటోకు తప్పిన ప్రమాదం

Scholarship scheme: అదిరిపోయే స్కీమ్.. ఇంటర్ పాసైతే చాలు.. ఏడాదికి రూ.20వేలు పొందొచ్చు..

Onam Tragedy: హుషారుగా డ్యాన్స్.. ఒక్కసారిగా ఆగిన గుండె.. కళ్ళముందే కుప్పకూలిన అసెంబ్లీ ఉద్యోగి!

Big Stories

×