BigTV English

Ayodhya: అయోధ్య రాముడికి 155 దేశాల నదీజలాలతో అభిషేకం.. ఎప్పుడంటే..?

Ayodhya: అయోధ్య రాముడికి 155 దేశాల నదీజలాలతో అభిషేకం.. ఎప్పుడంటే..?

Ayodhya: ఉత్తర్‌ప్రదేశ్‌లోని అయోధ్యలో మహాక్రతువు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. శ్రీరాముడి విగ్రహానికి 155 దేశాల్లోని నదుల నుంచి సేకరించిన జలాలతో అభిషేకం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ ఈ నెల 23న శ్రీరాముడికి జలాభిషేకం నిర్వహించనున్నారు. మణిరామ్‌ దాస్‌ చావ్నీ ఆడిటోరియంలో నిర్వహించే ఈ కార్యక్రమంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ కూడా పాల్గొంటారు. శ్రీరామ జన్మభూమి తీర్థ్‌ క్షేత్ర ప్రధాన కార్యదర్శి చంపత్‌ రాయ్‌ ఈ విషయాన్ని వెల్లడించారు.


ఢిల్లీకి చెందిన రామభక్తుడు విజయ్‌ జొలీ నేతృత్వంలోని బృందం 155 దేశాల నుంచి తీసుకువచ్చిన జలాలను సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు అందజేస్తారు. పాకిస్థాన్‌లోని రావి నది నుంచి కూడా జలాలు సేకరించారు. ఈ జలాలను పాక్‌లోని హిందువులు దుబాయ్‌కు పంపారు. అక్కడ నుంచి ఢిల్లీకి జలాలు చేరుకున్నాయని చంపత్ రాయ్‌ వివరించారు.


Related News

Rakhi Fest: ఈ టీచర్ గ్రేట్.. 15వేల మంది మహిళలు రాఖీ కట్టారు.. ఫోటో వైరల్

Delhi heavy rains: ఢిల్లీలో వరద భీభత్సం.. ఏడుగురు మృతి.. అసలు కారణం ఇదే!

Independence Day 2025: వారంలో ఆగస్టు 15.. స్వేచ్ఛా దినంలోని గాధలు..

BJP MLAs: గర్భగుడి వివాదం.. వద్దంటే వినని బీజేపీ ఎంపీలు.. కేసు నమోదు.. ఎక్కడంటే?

Flight delays: ఢిల్లీలో భారీ వర్షం.. ఆగిన విమానాలు..!

Income Tax Bill: వెనక్కి తగ్గిన మోదీ సర్కార్.. ఆ బిల్ విత్ డ్రా

Big Stories

×