E-Paper
Advertisement

వార్నీ.. రోబోతో ఓట్లు అడుగుతున్నారా? దళపతి ఫ్యాన్స్ మామూలు రచ్చ కాదుగా!

వార్నీ.. రోబోతో ఓట్లు అడుగుతున్నారా? దళపతి ఫ్యాన్స్ మామూలు రచ్చ కాదుగా!
Advertisement

Robot Campaign: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల సమరం క్లైమాక్స్‌కు చేరుకుంది. ప్రచారానికి ఆఖరి రోజైన నేడు కోయంబత్తూరులో ‘తమిళగ వెట్రి కళగం’ (TVK) పార్టీ చేసిన హడావిడి అంత ఇంత కాదు. సాధారణంగా నేతలు రోడ్‌షోలు, మైకులతో హోరెత్తిస్తారు, కానీ ఇక్కడ మాత్రం ఒక రోబో రంగంలోకి దిగి ఓట్లు అడగడం విశేషం. టీవీకే కండువా కప్పుకున్న ఈ రోబో, సౌత్ చెన్నై అభ్యర్థి సెంథిల్ కుమార్‌ తరపున ప్రజలకు అభివాదం చేస్తూ.. వారితో కరచాలనం చేస్తూ సందడి చేసింది. దీనికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

విజయ్ పర్యటనలపై విమర్శలు

Advertisement

పార్టీ అధినేత విజయ్ క్షేత్రస్థాయిలో తక్కువగా పర్యటిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్న తరుణంలో, అభ్యర్థులు ఇలాంటి వినూత్న పద్ధతులను ఆశ్రయిస్తున్నారు. తిరువెరుంబూర్‌లో విజయ్ కార్డ్‌బోర్డ్ కటౌట్లను, కుంభకోణంలో హోలోగ్రామ్ ఏఐ సాంకేతికతను వాడుతుండగా, కొలత్తూరులో విజయ్‌ను పోలి ఉన్న వ్యక్తితో ప్రచారం చేయిస్తున్నారు. షెడ్యూల్ విడుదలయ్యాక విజయ్ కేవలం ఏడు జిల్లాలకే పరిమితమయ్యారని విపక్షాలు విమర్శిస్తుంటే.. దానికి ఆయన గట్టిగానే బదులిచ్చారు. పోలీసులు, అధికారులు కావాలనే చివరి నిమిషంలో తమ కార్యక్రమాలకు అనుమతులు నిరాకరిస్తున్నారని ఆరోపించారు. కేవలం సంప్రదాయ పద్ధతులకే పరిమితం కాలేదని, రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే తమకు అనుకూల పవనాలు వీస్తున్నాయని విజయ్ ధీమా వ్యక్తం చేశారు.

నేటితో (ఏప్రిల్ 21, మంగళవారం) ప్రచార పర్వం ముగియనుండటంతో, విజయ్ చెన్నైలో భారీ రోడ్‌షో నిర్వహించి కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఏప్రిల్ 23 ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది.

Advertisement

ఎన్నికల కమిషన్ నిబంధనలు..

ప్రచార గడువు ముగిసిన తర్వాత ఎలాంటి బహిరంగ సభలు, ఊరేగింపులు నిర్వహించకూడదని అధికారులు స్పష్టం చేశారు. కేవలం మైకులు మాత్రమే కాదు.. టీవీలు, రేడియోలు, వాట్సాప్, ఫేస్‌బుక్, ఎక్స్‌ (ట్విట్టర్) వంటి సోషల్ మీడియా వేదికల్లో కూడా ఎలాంటి ప్రచారం చేయకూడదని కఠిన నిబంధనలు విధించారు. సినిమాల ద్వారా గానీ, సంగీత కచేరీల ద్వారా గానీ ఓటర్లను ప్రభావితం చేసే ప్రయత్నం చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. మొత్తానికి టెక్నాలజీని వాడుకుంటూ సాగిన ఈ ఎన్నికల ప్రచారం తమిళనాట కొత్త ట్రెండ్‌కు తెరలేపింది.

Also Read: కేసీఆర్, రేవంత్‌లది ‘వీణ-వాణి’ బంధం.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు

Related News

సీఎం యోగి కాన్వాయ్ సమీపంలో పేలుడు, ఉలిక్కిపడిన అధికారులు, మధుర వెళ్లే దారిలో ఘటన

బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆఫీసర్ జాబ్స్.. కనీస వేతనం రూ.50,000.. పూర్తి వివరాలివిగో

ISRO: ఇస్రో ‘నాటీ బాయ్’ ప్రయోగం సక్సెస్.. చైనా-పాక్‌లపై నిఘా నేత్రం, ప్రతీ 10 నిమిషాలకు చుక్కలే

రైల్వే జాబ్స్.. RRB NTPCలో మొత్తం 5,165 ఖాళీలు.. డిగ్రీ ఉంటే చాలు

బెంగాల్‌లో ప్రతీకార రాజకీయాలు.. అభిషేక్ బెనర్జీ ఆఫీసుపై దాడులు, వెలుగులోకి షాకింగ్ వీడియో

ఆపరేషన్ సింధూర్ హీరో జితేంద్ర మిశ్రా.. రామ్‌మందిర్ సీఈఓగా ఎలా అయ్యారు? వెనుక జరిగింది ఏమిటి?

ఇంజినీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ కంపెనీ GAIL‌లో ట్రైనీ జాబ్స్.. ఫ్రెషర్స్‌కు సూపర్ ఛాన్స్

అయోధ్య రామ మందిరానికి తొలి సీఈవో‌గా జితేంద్ర మిశ్రా!

Big Stories

Advertisement
×