Actress Hema:సినీ నటి హేమ జీవితంలో గత కొంతకాలంగా అనేక వివాదాలు చుట్టుముట్టాయి. ముఖ్యంగా డ్రగ్స్ కేసులో ఆమె పేరు వినిపించడం ఇండస్ట్రీలో పెద్ద దుమారం రేపింది. అయితే, తాజాగా హైదరాబాద్‌లోని క్వాక్ ఏరీనా పబ్ సోదాల్లో ఆమెకు ‘నెగిటివ్’ రావడంతో పెద్ద గండం గడిచినట్లయింది. ఈ తప్పుడు ప్రచారాల వల్ల తాను వ్యక్తిగతంగా ఎంతో నష్టపోయానని, తన తల్లిని కూడా కోల్పోయానని హేమ కన్నీటి పర్యంతమయ్యారు. తనపై జరిగిన కుట్రలను ఎదుర్కుంటూ ఆమె ఇప్పుడు క్లీన్ చిట్‌తో బయటకు వచ్చారు.ఇప్పుడు తాజాగా బిగ్ టీవీ ఇంటర్వ్యూలో పాల్గొన్న హేమ పలు విషయాలను బయటపెట్టింది.
హైదరాబాద్ కొండాపూర్‌లోని ‘క్వాక్ ఏరీనా పబ్’పై పోలీసులు అకస్మాత్తుగా జరిపిన డ్రగ్స్ సోదాలు సంచలనం సృష్టించాయి. అక్కడ ఉన్న 64 మందికి పరీక్షలు నిర్వహించగా, అందులో హేమ కూడా ఉన్నారు. అయితే, ఆమెకు నిర్వహించిన యూరిన్ టెస్టుల్లో డ్రగ్స్ తీసుకోలేదని (నెగిటివ్) తేలింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ఇన్స్టాగ్రామ్ వీడియో ద్వారా వెల్లడించారు. “మీ హేమక్క ఎప్పుడూ తప్పు చేయదు, నిజాయితీగానే ఉంటుంది” అని చెబుతూ, తనపై అనవసరంగా దుష్ప్రచారం చేయవద్దని ఆమె నెటిజన్లను కోరారు.
డ్రగ్స్ వివాదం హేమ జీవితంలో తీరని శోకాన్ని మిగిల్చింది. గతంలో బెంగళూరు పబ్ ఉదంతం సమయంలో జరిగిన రచ్చ వల్ల తన తల్లి తీవ్ర మనోవేదనకు గురై చనిపోయారని హేమ ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. “ఆ తప్పుడు వీడియోలు, వార్తల వల్ల ఇప్పటికే నేను నా తల్లిని కోల్పోయాను. ఇక దయచేసి పాత వీడియోలన్నీ డిలీట్ చేయండి” అని ఆమె తాజాగా బిగ్ టీవీ ఇంటర్వూలో ప్రాధేయపడ్డారు. రేపు తన కుటుంబ సభ్యులు ఆ వార్తలను చూసి బాధపడకూడదన్నదే తన ఆరాటమని, ఒక తప్పు చేయని మహిళగా తాను అనుభవించిన నరకం వర్ణనాతీతమని ఆమె కన్నీళ్లు పెట్టుకున్నారు.
హేమపై గతంలో విమర్శలు చేసిన వారు ఇప్పుడు తమ తప్పు తెలుసుకుంటున్నారు. బిగ్ బాస్ ఫేమ్ తమన్నా సింహాద్రి తాజాగా ఒక వీడియో విడుదల చేస్తూ హేమకు క్షమాపణలు చెప్పారు. ఆనాడు హేమకు మద్దతుగా నిలవకుండా విమర్శలు చేసినందుకు పశ్చాత్తాపపడుతున్నట్లు ఆమె తెలిపారు. అయితే, తన వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా మాట్లాడిన తమన్నా సింహాద్రి, కరాటే కళ్యాణిలపై హేమ ఇప్పటికే క్రిమినల్ కేసు మరియు పరువు నష్టం దావా వేశారు. చట్టపరంగా తన పోరాటం కొనసాగుతుందని ఆమె స్పష్టం చేశారు.
ALSO READ:ఒకప్పుడు జబర్దస్త్ కమెడియన్.. ఇప్పుడు కాఫీ పౌడర్ షాప్ ఓనర్!
ముక్కుసూటిగా మాట్లాడే నటిగా హేమకు టాలీవుడ్‌లో మంచి పేరుంది. కానీ, వరుస వివాదాలు ఆమె కెరీర్‌ను, వ్యక్తిగత జీవితాన్ని ఇబ్బందుల్లోకి నెట్టాయి. రోజుకు 500 ఫోన్ కాల్స్ వస్తుంటే సమాధానం చెప్పలేక ఎంతో నరకం చూశానని ఆమె గుర్తు చేసుకున్నారు. ఇప్పుడు డ్రగ్స్ టెస్టులో నెగిటివ్ రావడంతో ఆమె అభిమానులు ఊపిరి పీల్చుకుంటున్నారు. ఎన్ని కష్టాలు ఎదురైనా, తన నిజాయితీని నిరూపించుకోవడానికి ఆమె పోరాడుతున్న తీరు చూసి నెటిజన్లు ఇప్పుడు ఆమెకు మద్దతుగా నిలుస్తున్నారు.