BigTV English

Gujarat : వడోదరలో పడవ ప్రమాదానికి కారణమిదేనా..? నిర్లక్ష్యమే 18 మంది ప్రాణాలు తీసిందా?

Gujarat : వడోదరలో పడవ ప్రమాదానికి కారణమిదేనా..?  నిర్లక్ష్యమే 18 మంది ప్రాణాలు తీసిందా?

Gujarat : ఓ ప్రైవేటు పాఠశాల విద్యార్థులు, టీచర్లు విహార యాత్రకు వెళ్లి ప్రాణాలు కోల్పోయారు. అందులో 16 మంది విద్యార్థులు, ఇద్దరు ఉపాధ్యాయులు ఉన్నారు. గుజరాత్ లోని వడోదరలోని హరిణి సరస్సులో ఈ దుర్ఘటన జరిగింది. ప్రమాద సమయంలో పడవలో మొత్తం 27 మంది విద్యార్థులున్నారు.


వడోదరకు చెందిన ఓ ప్రైవేటు పాఠశాల తమ విద్యార్థులను హరిణి సరస్సు వద్దకు విహారయాత్రకు తీసుకెళ్లింది. విద్యార్థులు సరస్సులో విహరించేందుకు ఓ పడవ ఎక్కారు. వారితో పాటుఉపాధ్యాయులు కూడా ఎక్కారు. పడవ సరస్సులో కొంతదూరం వెళ్లగానే తిరగబడింది. పడవలో 27 మంది ఉండగా వారిలో 18 మంది జలసమాధి అయ్యారు. ఈత రాకపోవడంతో నీటిలో మునిగిపోయారు. కొందరిని బోటింగ్ సంస్థ సిబ్బంది కాపాడారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

సామర్థ్యానికి మించి పడవలో ఎక్కువ మందిని ఎక్కించడం వల్లే ప్రమాదం జరిగి ఉంటుందని భావిస్తున్నారు. పడవలో 14 సీట్లు ఉన్నాయి. కాని 34 మందిని అనుమతించారని అధికారులు తెలిపారు. కేవలం 10 మంది విద్యార్థులు మాత్రమే లైఫ్ జాకెట్లు ధరించారని అన్నారు. ఈ ఘటనపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, క్షతగాత్రులకు రూ.50వేల పరిహారాన్ని ప్రకటించారు.


Related News

Rajasthan: రాజస్థాన్‌లో ఘోర ప్రమాదం.. వ్యాన్- కంటైనర్ ఢీ.. స్పాట్‌‌లో 10 మంది మృతి, ఇంకా

Delhi crime news: దేశ రాజధాని ఢిల్లీలో దారుణం.. స్విమ్మింగ్ పూల్ వెళ్లిన బాలికలపై అత్యాచారం!

Loan app scam: రూపాయి లోన్ లేదు కానీ.. రూ.15 లక్షలు చెల్లించిన యువతి.. షాకింగ్ స్టోరీ!

Karnataka Crime: దారుణం.. అత్తను 19 ముక్కలుగా నరికి 19 చోట్ల పడేసిన అల్లుడు

Kerala Crime: గదిలో లాక్ చేసి.. మతం మారాలంటూ ప్రియురాలిని వేధించిన ప్రియుడు.. ప్రాణాలు విడిచిన యువతి

Bus accident: ఘోర ప్రమాదం.. బస్టాండ్‌లోకి దూసుకొచ్చిన బస్సు.. స్పాట్‌లోనే..?

Big Stories

×