BigTV English

India A Vs England Lions : ఒక్కడు నిలిచాడు.. సెంచరీతో ఆదుకున్నాడు..

India A Vs England Lions : ఒక్కడు నిలిచాడు.. సెంచరీతో ఆదుకున్నాడు..

India A Vs England Lions : ఇంగ్లాండ్ లయన్స్ , ఇండియా -ఏ మధ్య నాలుగురోజుల మ్యాచ్ అహ్మదాబాద్ లో జరుగుతోంది. ఇంగ్లాండ్ లయన్స్ తొలి ఇన్నింగ్స్ లో 8 వికెట్ల నష్టానికి 553 పరుగులు చేసి డిక్లేర్ చేసింది. తొలి ఇన్నింగ్స్ లో ఇండియా- ఏ జట్టు తీవ్రంగా నిరాశపరిచింది. ఒక దశలో 95 పరుగులకే 7 వికెట్లు కోల్పోయింది.


ఆ సమయంలో జట్టుని ఒంటిచేత్తో ఆదుకున్నాడు. అతని పేరు రజత్ పటీదార్.. కళ్ల ముందే వికెట్లు పడిపోతుంటే టెయిల్ ఎండర్స్ ని అడ్డు పెట్టుకుని, ఎటాకింగ్ ప్లే ఆడాడు. 91 బంతుల్లో 89 పరుగులు చేశాడు. అక్కడ నుంచి  వరుసగా మూడు సిక్సులు ఫటా ఫటా కొట్టాడు. సెంచరీ వచ్చేసింది. అప్పటికి భారత్ స్కోర్ 150/8గా ఉంది.  

తుషార్ దేశ్‌పాండే, నవదీప్ సైనీతో కలిసి రజత్ పటీదార్ పరువు కాపాడాడు. తుషార్, రజత్ జోడీ 8వ వికెట్‌కు 51 పరుగులు జోడించింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత జట్టు 8 వికెట్ల నష్టానికి 215 పరుగులు చేసింది.


ఈ మ్యాచ్ లో ఇండియా- ఏ జట్టు హీరో రజత్ పటీదార్ 132 బంతుల్లో 140 రన్స్‌తో  నాటౌట్ గా ఉన్నాడు. ఈ మ్యాచ్‌లో 18 ఫోర్లు, 5 సిక్సులు పటీదార్ బ్యాటింగ్ నుంచి వచ్చాయి. అంటే తనెంత విధ్వంసకరంగా ఆడాడో అర్థమవుతోంది. బౌండరీలు, సిక్సులతోనే వందకుపైగా పరుగులు సాధించడం విశేషం.

టాప్ ఆర్డర్ కుప్పకూలినప్పటికీ.. తుషార్ దేశ్‌పాండే సహకారంతో పటీదార్ ఇండియా-ఏ పరువు నిలిపాడు. భారీ సెంచరీ చేయడంతో టీమ్ ఇండియా టెస్ట్ జట్టులో తన పేరుని సెలక్టర్లు పరిగణనలోకి తీసుకునేలా చేశాడు. ఇంకా ఇండియా-ఏ జట్టు 338 పరుగులు వెనుకంజలో ఉంది. మూడోరోజు ఇండియా-ఏ 227 పరుగుల వద్ద ఉండగా పటీదార్ 151 పరుగులు చేసి 9వ వికెట్ గా వెనుదిరిగాడు. అదే స్కోర్ వద్ద చివరి వికెట్ పడిపోయింది. దీంతో ఇంగ్లాండ్ లయన్స్ కు తొలి ఇన్నింగ్స్ లో 326 పరుగుల ఆధిక్యం లభించింది.

అహ్మదాబాద్ గ్రౌండ్ బిలో ఇంగ్లాండ్ లయన్స్ తో నాలుగురోజుల టెస్ట్ మ్యాచ్ లు మూడు జరగనున్నాయి. మొదటి టెస్ట్ జరుగుతోంది. రెండో టెస్ట్ జనవరి 24 -27 వరకు, మూడో టెస్ట్ ఫిబ్రవరి 1-4 వరకు జరగనున్నాయి.

Tags

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×