BigTV English

Remal Cyclone Hits Bangla Coast: తీరందాటిన రెమాల్.. వణికిపోయిన బెంగాల్, బంగ్లా..!

Remal Cyclone Hits Bangla Coast: తీరందాటిన రెమాల్.. వణికిపోయిన బెంగాల్, బంగ్లా..!

Remal Cyclone Hits Bangla Coast: రెమాల్ తుపాను తీరం దాటింది. ఆదివారం అర్థరాత్రి తర్వాత బంగ్లాదేశ్, పశ్చిమ బెంగాల్ సరిహద్దుల్లో తీరం దాటినట్లు భారత వాతావరణ శాఖ వెల్లడించింది. తీరందాటే సమయంలో తుపాను ఈదురుగాలులతో బీభత్వం సృష్టించింది. 135 కిలోమీటర్ల వేగంతో వీచిన ఈదురుగాలుల ధాటికి బెంగాల్, బంగ్లా తీరాలు వణికిపోయాయి. అనేక ప్రాంతాల్లో చెట్లు నేలకొరిగాయి. విద్యుత్ స్తంభాలు విరిగి పడటంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. భారీ వర్షాలు కురుస్తుండటంతో చాలా ప్రాంతాలు నీటమునిగాయి. తుపాను ప్రభావంతో భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో అధికారులు ముందుగానే తీరప్రాంతాల నుంచి సుమారు లక్షమంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. తుపాను కారణంగా బంగ్లాదేశ్ లో ఇద్దరు మరణించారు.


తీర ప్రాంతాల్లో భారీగా వరదలు సంభవించే అవకాశం ఉండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఆదివారం మధ్యాహ్నం నుంచి కోల్ కతాలో విమాన సర్వీసులను నిలిపివేశారు అధికారులు. అలాగే తూర్పు, ఆగ్నేయ ప్రాంతాలకు వచ్చే, వెళ్లే రైళ్లను తాత్కాలికంగా రద్దు చేశారు. సహాయక చర్యల కోసం 16 బెటాలియన్లు, విపత్తు నిర్వహణ దళాలు సిద్ధంగా ఉన్నాయి. తుపాను కారణంగా నేలకూలిన చెట్లను తొలగించి, కొత్త విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేసే పనుల్లో విపత్తు నిర్వహణ బృందాలు నిమగ్నమయ్యాయి.

తుపాను తీరం దాటి అల్పపీడనంగా బలహీన పడినా.. భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ స్పష్టం చేసింది. ప్రజలు ఇళ్లలోనే ఉండి.. తగు జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొంది. పశ్చిమ బెంగాల్, ఒడిశా, ఈశాన్య రాష్ట్రాల్లో రేపటి వరకూ విస్తారంగా వర్షాలు కురుస్తారని తెలిపింది.


Also Read: Bomb Threat: బ్రేకింగ్ న్యూస్.. ముంబైలోని తాజ్ హోటల్‌కు బాంబు బెదిరింపు

మరోవైపు పశ్చిమ గాలుల ప్రభావంతో ఏపీ, యానాంలలో ఉక్కపోత మరింత పెరుగుతుందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. అలాగే సాధారణం కంటే 2-4 డిగ్రీల ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతాయని, ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమల్లో ఒకట్రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వెల్లడించారు. ఈ నెల చివరినాటికి నైరుతి రుతుపవనాలు కేరళలోకి ప్రవేశించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని చెప్పారు.

Related News

Rakhi Fest: ఈ టీచర్ గ్రేట్.. 15వేల మంది మహిళలు రాఖీ కట్టారు.. ఫోటో వైరల్

Delhi heavy rains: ఢిల్లీలో వరద భీభత్సం.. ఏడుగురు మృతి.. అసలు కారణం ఇదే!

Independence Day 2025: వారంలో ఆగస్టు 15.. స్వేచ్ఛా దినంలోని గాధలు..

BJP MLAs: గర్భగుడి వివాదం.. వద్దంటే వినని బీజేపీ ఎంపీలు.. కేసు నమోదు.. ఎక్కడంటే?

Flight delays: ఢిల్లీలో భారీ వర్షం.. ఆగిన విమానాలు..!

Income Tax Bill: వెనక్కి తగ్గిన మోదీ సర్కార్.. ఆ బిల్ విత్ డ్రా

Big Stories

×