Big Stories

Bomb Threat to Mumbai Taj Hotel: బ్రేకింగ్ న్యూస్.. ముంబైలోని తాజ్ హోటల్‌కు బాంబు బెదిరింపు!

Bomb Threat to Mumbai Taj Hotel: దేశ వ్యాప్తంగా ఇటీవల బాంబు బెదిరింపులు కలకలం రేపుతున్నాయి. సోమవారం ముంబైలోని తాజ్ హోటల్, ఛత్రపతి శివాజీ మహరాజ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు కాల్స్ వచ్చాయి. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఆయా ప్రాంతాల్లో సోదాలు నిర్వహించగా బాంబులు గానీ, ఎలాంటి అనుమానాస్పద వస్తువులు కనిపించకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఆ కాల్ యూపీ నుంచి వచ్చిందని.. నిందుతుడి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

- Advertisement -

కొన్ని రోజులుగా దేశంలోని పలు ప్రాంతాల్లో ఉన్న స్కూళ్లు, ఎయిర్ పోర్టులకు బాంబు బెదిరింపు ఈ మెయిల్స్ వస్తున్నాయి. అయితే అవి ఎక్కడి నుంచి వచ్చాయని అధికారులు ఆరా తీసే లోపే ఇలా మళ్లీ మళ్లీ బాంబు బెదిరింపు మెయిల్ వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇటీవల కేంద్ర హోం శాఖ కార్యాలయానికి కూడా బాంబు బెదిరింపు ఈ మెయిల్ రాగా సోదాలు నిర్వహించిన అధికారులు ఎటువంటి బాంబులను గుర్తించలేదు.

- Advertisement -

Also Read: Delhi Metro: మెట్రో రైలులో మంటలు.. వీడియో ఇదిగో

కాగా, ఇటీవలే ఢిల్లీలోని పలు స్కూళ్లకు బాంబు బెదిరింపు మెయిల్స్ రాగా, ఫైర్ సిబ్బంది, పోలీసులు అక్కడికి చేరుకుని తనిఖీలు నిర్వహించగా ఎలాంటి బాంబులు లేవని తేల్చి చెప్పారు. అదేవిధంగా బెంగళూరులోని పలు హోటళ్లకు కూడా బాంబు బెదిరింపు మెయిల్స్ వచ్చిన విషయం తెలిసిందే. హోటల్స్ ను పేల్చేస్తామంటూ హెచ్చరించారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News