E-Paper
Advertisement

Wild Parrots Recovered: రైలులో 400 అరుదైన చిలుకలు అక్రమ రవాణా.. షాకింగ్ వీడియో

Wild Parrots Recovered: రైలులో 400 అరుదైన చిలుకలు అక్రమ రవాణా.. షాకింగ్ వీడియో
Advertisement

Wild Parrots Recovered: యూపీ నుంచి వెస్ట్ బెంగాల్ కు రైలులో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి వద్ద 400 అరుదైన చిలుకలు పట్టుబడ్డాయి. సంచులు, పంజరాలతో ప్రయాణిస్తున్న వ్యక్తిని అనుమానంతో రైల్వే పోలీసులు తనిఖీ చేశారు. దీంతో ఇరుకైన సంచుల్లో 400 వరకు చిలుకలు కనిపించాయి. ఈ షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వారణాసి జీఆర్పీ, ఆర్పీఎఫ్ పోలీసుల జాయింట్ ఆపరేషన్ లో పంజాబ్ మెయిల్ ఎక్స్‌ప్రెస్ లో ప్రయాణిస్తున్న మహమ్మద్ జాహిత్ అనే ప్రయాణికుడి నుంచి దాదాపు 400 అడవి చిలుకలను రక్షించారు.

రైలులో రవాణా

యూపీలోని అమేథి నుంచి పశ్చిమ బెంగాల్‌లోని బర్ధమాన్‌కు చిలుకలను రవాణా చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఇరుకైన సంచులు, చిన్న బోనులలో చిలుకలను ప్యాక్ చేసినట్లు తెలుస్తోంది. రైలులో అనుమానాస్పదంగా ఉన్న ప్రయాణికుడిని అడ్డగించి సామాను తనిఖీ చేశారు పోలీసులు. దీంతో అతడి వద్ద ఉన్న సంచుల్లో చిలుకలు కనిపించడంతో షాక్ అయ్యారు. వణ్యప్రాణి సంరక్షణ చట్టం కింద నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

అరుదైన అడవి జాతులు

Advertisement

జీఆర్పీ ఇన్‌స్పెక్టర్ తెలిపిన వివరాలు ప్రకారం.. స్వాధీనం చేసుకున్న చిలుకలు అడవి జాతులకు చెందినవి. అంటువంటి పక్షులతో వ్యాపారం, రవాణా వణ్యప్రాణి సంరక్షణ చట్టం ప్రకారం నేరం. జీఆర్పీ బృందం వెంటనే ఈ విషయంపై అటవీ శాఖకు సమాచారం అందించింది. అటవీ సిబ్బంది.. పోలీస్ స్టేషన్ కు వచ్చి చిలుకల జాతులు, వాటి ఆరోగ్య పరిస్థితి, అక్రమ రవాణా విధానాన్ని పరిశీలించారు.

Advertisement

బర్డ్ లైఫ్ అనే వన్యప్రాణుల సంరక్షణ సంస్థ.. ఈ ఘటనపై పోలీసులకు సమాచారం అందించింది. ఒక స్మగ్లర్ రైలులో పశ్చిమ బెంగాల్‌కు పెద్ద సంఖ్యలో అడవి చిలుకలను అక్రమ రవాణా చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు బర్డ్ లైఫ్ పోలీసులకు తెలిపింది. ఈ సమాచారంతో జీఆర్పీ, ఆర్ఫీఎఫ్ ప్రధాన స్టేషన్లు, రైళ్లలో తనిఖీలను పెంచారు.

Also Read:  ఇసుక అక్రమ రవాణా జరుగుతోందా? వెంటనే ఇలా చేయండి

చిలుకల రవాణా వెనుక

పోలీసుల విచారణలో నిందితుడు మహమ్మద్ జాహిద్ మరిన్ని విషయాలు చెప్పాడు. చిలుకలను బర్ధమాన్‌కు తీసుకెళ్తున్నట్లు తెలిపాడు. అక్కడ వాటిని విక్రయిస్తామని జాహిద్ చెప్పాడు. వన్యప్రాణుల రక్షణ చట్టం కింద జాహిద్‌పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. రక్షించిన చిలుకలను అటవీ శాఖ అదుపులోకి తీసుకుంది. వాటికి పునరావాస ప్రక్రియను చేపట్టింది. పక్షులను సురక్షితమైన ప్రదేశానికి తరలించడానికి, వాటిని మళ్లీ అడవిలో విడిచిపెట్టనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ అక్రమ రవాణా ప్రయత్నం వెనుక ఉన్న చైన్ సరఫరాపై జీఎస్పీ,ఆర్పీఎఫ్, అటవీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

Related News

డీజీపీ అనురాగ్‌ సూసైడ్‌, విచారణకు ప్రభుత్వ ఆదేశం, ఆఫీసులో ఏం జరిగింది?

రేషన్‌కార్డు దారులకు తీపి కబురు.. ఒకేసారి మూడునెలల కోటా, ఇంకెందుకు ఆలస్యం

ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత.. సీజేపీ ఆందోళనకారులపై లాఠీచార్జ్.. అసలేం జరుగుతుంది?

రన్నింగ్‌ బస్సులో జుట్టు పట్టుకొని కొట్టుకున్న లేడి కండక్టర్, మహిళా ప్యాసింజర్.. ఇదిగో వీడియో!

తమిళనాడులో వేడెక్కిన రాజకీయం.. సీఎం విజయ్‌కు బెదిరింపులు, డీఎంకె ఎమ్మెల్యే అరెస్ట్

ట్రీట్‌మెంట్‌కి వచ్చిన పేషెంట్.. ఫ్యాన్ చంపేసింది, ఆసుపత్రిలో ఆ రాత్రి ఏం జరిగిందంటే..

కేంద్రానికి ఆఖరి గడువు.. మూడు ఆప్షన్లలో ఏది ఎంచుకున్నా దీక్ష విరమిస్తా: సోనమ్ వాంగ్‌చుక్

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

Big Stories

Advertisement
×