BigTV English

Child Trafficking gang : అక్కడ కొని.. ఇక్కడ అమ్మేస్తున్నారట.. శిశువుల అక్రమ రవాణాలో షాకింగ్ విషయాలు వెల్లడి

Child Trafficking gang : అక్కడ కొని.. ఇక్కడ అమ్మేస్తున్నారట.. శిశువుల అక్రమ రవాణాలో షాకింగ్ విషయాలు వెల్లడి

Child Trafficking gang : అప్పుడే కళ్లు తెరిచిన శిశువుల నుంచి తల్లి ఒడిలో పాలు తాగే రోజుల పిల్లల వరకు అందరూ ఆమె దగ్గర దొరుకుతారు. మీకు అబ్బాయి కావాలన్నా అడగొచ్చు, అమ్మాయి కావాలన్నా తీసుకెళ్లవచ్చు. ఇదంతా చదవి ఆవిడ సమాజ సేవలోని మాతృమార్తి అనుకుంటే పొరబాటు పడ్డట్టే. చిన్నారులకు మాతృమూర్తి ప్రేమను దూరం చేస్తూ… పని ప్రాణాలతో కాసుల బేరం ఆడే దుర్మార్గురాలు. జంతువులు, పశువుల దగ్గర నుంచి సైతం పాలు తాగే వాటి పిల్లల్ని దూరం చేసేందుకు తల్లడిల్లి పోతుంటాం. కానీ.. మనస్సు అంతా మనీతో నిండిపోగా, చిన్నారులు ఆమెకు నోట్ల కట్టలుగా కనిపిస్తుండగా.. అంగట్లో సరుకుల్లా పిల్లల్ని అమ్మేస్తుంటోంది. ఆమే.. వందన. గుజరాత్ రాష్ట్రానికి చెందిన ఈ కిలేడి.. చిన్నారుల విక్రయ వ్యాపారాన్ని హైదరాబాద్ పోలీసులు చేధించారు. ఆమెను అదుపులోకి తీసుకుని విచారించగా.. అనేక విస్తుగొలిపే వాస్తవాలు వెలుగు చూస్తున్నాయి. అవేంటంటే..


విక్రయ ముఠా అరెస్ట్

ఇటీవల కొన్ని రోజుల క్రితం హైదరాబాద్ లో చైల్డ్ ట్రాఫికింగ్ ముఠాను పోలీసలు అరెస్ట్ చేశారు. మల్కాజ్ గిరి స్పెషల్ ఆపరేషన్స్ టీమ్ – చైతన్యపురి పోలీసుల నిర్వహించిన ఈ ఆపరేషన్ లో చిన్నారుల్ని అక్రమ మార్గాల్లో తరలించి.. నోట్ల కట్టలకు విక్రయిస్తున్న దుర్మార్గుల్ని పట్టుకున్నారు. చిన్నారుల్ని అమ్మిన వాళ్లను, కొనుగోలు చేసిన మొత్తం 11 మందిని అరెస్ట్ చేశారు. వీరిలో.. నలుగురు బ్రోకర్లు, ఓ కీలక నిందితురాలని గుర్తించిన పోలీసులు.. వారి నుంచి మరింత సమాచారం రాబట్టారు. వీరంతా.. అప్పుడే పుట్టిన చిన్నారుల్ని.. గుజరాత్ నుంచి తీసుకొస్తూ.. రెండు తెలుగు రాష్ట్రాల్లో విక్రయిస్తున్నారు.


ఆడబిడ్డ రేటేంత.? మగ పిల్లాడి ఖరీదెంత.?

గుజరాత్ కు చెందిన వందన అనే మహిళ.. అక్కడి నుంచి అప్పుడే పుట్టిన చిన్నారుల్ని తీసుకువస్తోంది. సోషల్ మీడియా ద్వారా హైదరాబాద్ లోని కృష్ణవేణి అనే మహిళతో పరిచయం పెట్టుకుని.. ఇక్కడ ఆ పిల్లల్ని విక్రయిస్తోంది. గుజరాత్ నుంచి తీసుకొచ్చే పిల్లలను సిటీలో అమ్మేందుకు నలుగురు బ్రోకర్లను నియమించుకున్నారు. వీరు పిల్లలు లేని దంపతుల్ని టార్గెట్ చేసుకుని.. వారికి చిన్నారుల్ని విక్రయిస్తున్నారు.

ఈ ముఠా సిటీలో ఈ దందాను పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. ఆడ శిశువును రూ.2.5 లక్షలకు, మగ శిశువును రూ.4.5 లక్షలకు విక్రయిస్తుండగా.. పోలీసులు గుర్తించి అరెస్టు చేశారు. ఈ కేసుతో సంబంధం ఉన్న వందన, కృష్ణవేణిలతో పాటుగా వారికి సహాయంగా ఉన్న దీప్తీ అనే మహిళల్ని పోలీసులు అరెస్టు చేశారు.

కొనుగోలు చేసినా కేసులు తప్పవు

పిల్లలు లేని దంపతులు ప్రభుత్వం జారీ చేసిన నిబంధనలు, దత్తత ప్రకారం పిల్లల్ని పెంచుకోవాలని, ఇలాంటి అక్రమ మార్గాల్లో వచ్చిన పిల్లల్ని తీసుకోవడం వల్ల న్యాయపరమైన చిక్కుల్లో పడతారని హెచ్చరిస్తున్నారు. తాజాగా ఘటనలో పిల్లల్ని విక్రయించిన వారితో పాటుగా కొనుగోలు చేసిన వారిపైనా పోలీసు కేసులు నమోదు అయ్యాయి. చిన్నారులు మరీ మూడు, నాలుగు రోజుల పిల్లలే కావడం.. వారిని వివిధ మార్గాల ద్వారా హైదరాబాద్ నుంచి తీసుకొస్తున్న దుండగులు.. నకిలీ పత్రాలు సృష్టించి.. ఈ దందాకు పాల్పడుతున్నారు.

సంచనల విషయాలు వెల్లడి

ఈ కేసును లోతుగా విచారణ జరిపిన పోలీసులు సంచలన విషయాల్ని వెల్లడించారు. కేసు విచారణలో నిందితురాలు వందన తెలిపిన వివరాలు సంచలనంగా మారాయి. ఇప్పటి వరకు ఆసుపత్రులు, రోడ్డు పైన ఉండే మహిళల నుంచి చిన్నారుల్ని ఎత్తుకొస్తున్నట్లుగా భావించారు. పిల్లల కోసం వారి తల్లిదండ్రులు ఎంత అల్లాడిపోతారోనని.. వారిని వారి చెంతకు చేర్చడం ఎలాగా అని తాపత్రయపడ్డారు. కానీ.. తీరా విచారణ దశకు వచ్చే వరకు ఆశ్చర్యకర విషయాలు వెలుగులోకి వచ్చాయి.

పిల్లల్ని ఎక్కడి నుంచి ఎత్తుకురావడం లేదని తెలిపిన నిందితురాలు వందన.. గుజరాత్ నుంచి పిల్లల్ని కొంటున్నట్లు వెల్లడించింది. అదీ.. వారి తల్లిదండ్రుల నుంచే కొనుగోలు చేస్తున్నట్లు తెలిపింది. తాము విక్రయించిన పిల్లల్లో కిడ్నాప్ చేసిన వాళ్లు ఎవరూ లేరని అంటోంది. పేదరికంలోని మహిళలకు డబ్బు ఆశ చూపించి వారి దగ్గర నుంచి చిన్నారుల్ని సేకరిస్తున్నట్లుగా నిందితురాలు వందన వెల్లడించింది.

గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాల్లోని పేద వర్గాలకు చెందిన మహిళల్ని టార్గెట్ గా చేసుకుని.. వారి పిల్లల్ని కొనుగోలు చేస్తున్నారు. అక్కడ వారికి.. ఒక్కో బిడ్డను రూ.50 వేల నుంచి రూ.60 వేల వరకు చెల్లిస్తున్నట్లుగా తెలిపిన ప్రధాన నిందితురాలు వందన.. హైదరాబాద్ లో ఒక్కో చిన్నారిని రూ.5 వరకు విక్రయిస్తున్నట్లుగా వెల్లడించింది.

Tags

Related News

Bandi Sanjay: కేటీఆర్ కు ఉన్న అతి తెలివి నాకెక్కడ? – బండి సంజయ్

Hyderabad floods: హైదరాబాద్‌ ఇక మునగదు.. సీఎం రేవంత్ రెడ్డి అదిరి పోయే ప్లాన్ ఇదే!

Bandi Sanjay: వావి వరుసలు లేకుండా వారి ఫోన్లు ట్యాపింగ్ చేశారు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ 12 జిల్లాల్లో దంచుడే దంచుడు.. పిడుగులు కూడా..?

Weather Update: వర్షపాతాన్ని ఎలా కొలుస్తారు ? రెడ్, ఆరెంజ్, ఎల్లో అలెర్ట్‌కు అర్థం ఏంటి ?

Sunil Kumar Ahuja Scam: వేల కోట్లు మింగేసి విదేశాలకు జంప్..! అహూజా అక్రమాల చిట్టా

Big Stories

×