BigTV English

Smriti Irani comment: బావ కన్నేశాడు, ఆయన పరిస్థితి ఏంటి?

Smriti Irani comment: బావ కన్నేశాడు, ఆయన పరిస్థితి ఏంటి?

Smriti Irani comment: లోక్‌సభకు పోటీ చేసే అభ్యర్థుల జాబితాను విడతల వారిగా ప్రకటిస్తోంది కాంగ్రెస్ పార్టీ. ఈ క్రమంలో చాలా సీట్లు పెండింగ్‌లో ఉన్నాయి. కొన్నింటిపై కసరత్తు చేస్తోంది ఆ పార్టీ. ఓకే అయిన సీట్లకు ఎప్పుటికప్పుడు అభ్యర్థులను వెల్లడిస్తోంది. అన్నింటి కంటే ముఖ్యమైనది ఉత్తరప్రదేశ్‌లోని అమేధి సీటు. ఈ నియోజకవర్గంపై అందరి దృష్టిపడింది. ఇంకా అక్కడ అభ్యర్థిని కాంగ్రెస్ ప్రకటించలేదు. అక్కడ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ పోటీ చేస్తున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.


సీన్ కట్ చేస్తే.. అమేథి నియోజకవర్గం నుంచి సిట్టింగ్ ఎంపీ, కేంద్రమంత్రి స్మృతి ఇరానీ బీజేపీ నుంచి బరిలోకి దిగారు. ఆమె పేరు పార్టీ ప్రకటించిన నుంచి నియోజకవర్గంలో రోడ్ షోలు చేస్తున్నారు. కానీ ప్రత్యర్థి ఎవరో తెలియక ఆరోపణలు చేయకపోవడంతో ఆమె ప్రచారంలో జోష్ తగ్గింది. దీంతో కొద్దిరోజులుగా నియోజకవర్గంలో పార్టీ నేతలను కలిసి వస్తున్నారట ఆమె.

పరిస్థితి గమనించిన స్మృతి ఇరానీ.. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీపై విమర్శలు ఎక్కుపెట్టారు. పోలింగ్‌ కు కేవలం దాదాపు 30 రోజులు మాత్రమే ఉందని, ఇప్పటివరకు ఆ పార్టీ అభ్యర్థిని ప్రకటించలేదన్నారు. వారి అహంకారిని ఇది నిదర్శమని వ్యాఖ్యానించారు. అంతేకాదు ఈసారి రాహుల్ బావ రాబర్ట్‌వాద్రా ఆ సీటుపై కన్నేశారని చెప్పుకొచ్చారు. మరి రాహుల్ ఇప్పుడు ఏం చేస్తారోనని చూడాలంటూ సెటైర్లు వేశారు.


ALSO READ: మీకు క్షమాపణలు చెప్పేందుకే నేను ఇక్కడికి వచ్చాను: పవార్

ఒక్కసారి కొద్దిరోజులు వెనక్కి వెళ్తే.. అమేథి ప్రజలు తనను కావాలని కోరుకుంటున్నారని, ఇక్కడి అభ్యర్థిపై సరైన సమయంలో పార్టీ నిర్ణయం తీసుకుంటుందన్నారు రాబర్ట్‌వాద్రా. అమేథి నియోజకవర్గానికి మే 20న ఎన్నికలు జరగనున్నాయి.  ఇక్కడ రాహుల్‌గాంధీ వరుసగా మూడుసార్లు గెలుపొందారు. గత ఎన్నికల్లో స్మృతి ఇరానీ విజయం సాధించారు. అంతకుముందు నాలుగుసార్లు రాజీవ్‌గాంధీ ఇదే నియోజకవర్గం నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు కూడా. మరి ఈసారి రాహుల్ ఇక్కడి నుంచి పోటీ చేస్తారా లేదా అన్నదానిపై కాంగ్రెస్ పార్టీ నుంచి ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.

Tags

Related News

Rahul Gandhi: ఒక సింగిల్ బెడ్ రూం ఇంట్లో 80 మంది ఓటర్లు ఉన్నారట…

Jammu Kashmir: లోయలో పడిన ఆర్మీ వాహనం.. ఇద్దరు జవాన్లు మృతి, 12 మందికి గాయాలు..

Cloudburst: ఉత్తరాఖండ్‌లో ప్రళయం.. పదే పదే ఎందుకీ దుస్థితి.. కారణం ఇదేనా!

Sunil Ahuja: ఐటీ రైడ్స్ భయం.. దేశం వదిలిన సునీల్ ఆహుజా? ఏం జరిగింది?

Breaking: కుప్పకూలిన హెలికాప్టర్.. మంత్రులు మృతి

MP News: పట్టించుకోని వాహనదారులు.. పెట్రోల్ కష్టాలు రెట్టింపు, ఏం జరిగింది?

Big Stories

×