Big Stories

WhatsApp New Feature: వ్యాట్సాప్ నుంచి కొత్త ఫీచర్.. ఇక వాటికి ఇంటర్నెట్ అవసరం లేదు..!

WhatsApp New Feature Internet Not Required: మార్కెట్‌లో ఎన్ని చాటింగ్ యాప్స్ ఉన్నా వాట్సాప్ క్రేజ్ మాత్రం తగ్గడం లేదు. వాట్సాప్ వినియోగించే వారి సంఖ్య రోజురోజుకు విపరీతంగా పెరుగుతుంది. ఉదయాన్నే నిద్రలేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు వాట్సాప్‌తోనే టైమ్ స్పెండ్ చేయాల్సిన అవసరం ఏర్పడంది. వాట్సాప్ కూడా లేటెస్ట్ ఫీచర్లు, అప్‌‌డేటెడ్ టెక్నాలజీతో ఎప్పుడు అట్రాక్ట్ చేస్తుంటుంది. ఇందులో భాగంగానే వాట్సాప్ మరోకొత్త ఫీచర్‌ను తీసుకురాబోతుంది. దీని ద్వారా మీరు ఇంటర్నెట్ లేకుండా  ఫైల్‌లను షేర్ చేయవచ్చు.

- Advertisement -

WABetaInfo వెబ్‌సైట్ సమాచారం ఆధారంగా వాట్సాప్ ఇంటర్నెట్ లేకుండా  ఫోటోలు, వీడియోలు, పాటలు, డాక్యుమెంట్స్ సెండ్ చేయవచ్చు. ఈ ఫీచర్‌ను వీలైనంత త్వరగా సంస్థ తీసుకురావాలని భావిస్తోంది. దీని ద్వారా ఇంటర్నెట్ లేకుండా ఎవరికైనా ఫైల్‌లను పంపవచ్చని తెలిపింది. ఈ ఫీచర్ కోసం మీ ఫోన్ నుండి WhatsAppకి ఎలాంటి యాక్సెస్ అవసరమో చూపించే కొన్ని స్క్రీన్‌షాట్‌లు లీక్ అయ్యాయి. ఈ ఫీచర్ కోసం ఆండ్రాయిడ్ యూజర్లు బ్లూటూత్ అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది. దీని ద్వారా దగ్గరలోని డివైజ్‌తో కనెక్ట్ అవుతుంది. కానీ మీకు ఇష్టం లేకపోతే మీరు ఈ అనుమతిని కూడా ఆఫ్ చేయవచ్చు.

- Advertisement -

Also Read: మైండ్ బ్లోయింగ్.. జస్ట్ రూ.750కే iQOO 5G ఫోన్!

ఇంటర్నెట్ లేకుండా WhatsAppలో ఫైల్‌లను షేర్ చేయడానికి, కొన్ని అనుమతులు అవసరం. ముందుగా, చుట్టుపక్కల ఉన్న ఏ ఫోన్‌లు ఈ ఫీచర్‌కు మద్దతిస్తాయో తెలుస్తుంది. బ్లూటూత్ ద్వారా సమీపంలోని ఫోన్‌లను చూడటానికి ఇది సాధారణ అనుమతి, మీరు కావాలనుకుంటే దాన్ని కూడా ఆఫ్ చేయవచ్చు. రెండవ అనుమతి మీ ఫోన్ ఫైల్‌లు, ఫోటో గ్యాలరీని యాక్సెస్ చేయడం, దీని ద్వారా మీరు షేర్ చేయాలనుకుంటున్న ఫైల్‌ను అప్‌లోడ్ చేయవచ్చు. మూడవ అనుమతి లొకేషన్‌గా ఉంటుంది. తద్వారా ఇతర ఫోన్ కనెక్ట్ అయ్యేంత దగ్గరగా ఉందో లేదో తెలుసుకోవచ్చు.

Also Read: మరి కొద్ది రోజుల్లో ఫోన్ల జాతర.. ఈ మోడల్ చాలా ధర తక్కువకే ..!

ఈ కొత్త ఫీచర్ ShareIT వంటి కొన్ని పాత యాప్‌ మాదిరిగానే పనిచేస్తుంది. ఈ యాప్‌లు ఇంటర్నెట్ లేకుండా రెండు ఫోన్‌ల మధ్య ఫైల్‌లను షేర్ చేయడానికి ఉపయోగపడతాయి. వాట్సాప్‌లో తరచుగా ఫోటోలు, వీడియోలు, డాక్యుమెంట్‌లను షేర్ చేస్తుంటారు కాబట్టి ఈ కొత్త ఫీచర్ చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటుంది. అయితే వాట్సాప్‌లో ఇంటర్నెట్ లేకుండా ఫైల్‌లను పంచుకునే  ఫీచర్ ఇంకా టెస్టింగ్‌లోనే ఉంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News