BigTV English

Sonia Gandhi about WR Bill: అది రాజీవ్ గాంధీ కల.. సోనియా భావోద్వేగం..

Sonia Gandhi about WR Bill: అది రాజీవ్ గాంధీ కల.. సోనియా భావోద్వేగం..
Sonia Gandhi latest news

Sonia Gandhi latest news(Latest political news in India):

చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ఉద్దేశించిన బిల్లుపై లోక్‌సభలో చర్చ మొదలైంది. కాంగ్రెస్‌ అగ్రనాయకురాలు సోనియా గాంధీ చర్చను ప్రారంభించారు. కాంగ్రెస్‌ పార్టీ తరఫున ఈ నారీ శక్తి వందన్‌ అభియాన్‌- 2023 బిల్లుకు మద్దుతు ప్రకటించారు.


మహిళా రిజర్వేషన్‌ బిల్లును కాంగ్రెస్‌ సమర్థిస్తోందని సోనియా గాంధీ స్పష్టం చేశారు. ఆ సమయంలో చాలా భావోద్వేగం చెందారు.ఈ బిల్లును తీసుకురావడంతో రాజీవ్‌ గాంధీ స్వప్నం నెరవేరిందన్నారు. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ నాడు స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్‌ కల్పించాలని బిల్లు తీసుకొచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. ఆ బిల్లు రాజ్యసభలో 7 ఓట్ల తేడాతో వీగిపోయిందని తెలిపారు. ఆ తర్వాత పీవీ నరసింహరావు ప్రధానిగా ఉన్న సమయంలో ఆ బిల్లు ఆమోదం పొందిందన్నారు. ఫలితంగా స్థానిక సంస్థల్లో ఇప్పటివరకు 15 లక్షల మంది మహిళలు ప్రాతినిధ్యం వహించారని సోనియా సభలో వివరించారు.

నారీ శక్తి వందన్ అభియాన్ -2023 బిల్లు ఆమోదం పొందాలని ఆకాంక్షిస్తున్నామన్నారు సోనియా గాంధీ. మహిళలు రాజకీయ బాధ్యతలు చేపట్టాలని 13 ఏళ్లుగా ఎదురుచూస్తున్నారని చెప్పారు. ఇంక ఎంతకాలం వేచిచూడాలి? అని ప్రశ్నించారు. మహిళా రిజర్వేషన్లను తక్షణమే అమలు చేయాలని కోరారు. ఆలస్యమైతే మహిళలకు అన్యాయం జరుగుతుంద్నారు. ఈ కోటాలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ మహిళలకు సబ్‌ కోటా కల్పించాలని సోనియా డిమాండ్ చేశారు. చట్టం సమర్థ అమలుకు తక్షణమే కులగణన చేపట్టాలన్నారు.


Related News

Indian Air Force: పాకిస్తాన్ ని ఇలా చావుదెబ్బ కొట్టాం.. ఆపరేషన్ సిందూర్ అరుదైన వీడియో

New House To MPs: ఎంపీలకు 184 కొత్త ఇళ్లను ప్రారంభించిన పీఎం.. ఈ 5 బెడ్ రూమ్ ఫ్లాట్స్ ప్రత్యేకతలు ఇవే

Retail Real Estate: మళ్లీ ఊపందుకున్న రీటైల్ రియల్ ఏస్టేట్.. ఏకంగా 69 శాతానికి..?

Supreme Court: లక్షల వీధి కుక్కలను షెల్టర్లకు తరలించండి.. సుప్రీం సంచలన ఆదేశాలు

Delhi Politics: ఢిల్లీలో రాహుల్, ప్రియాంక అరెస్ట్, భగ్గుమన్న విపక్షాలు, ప్రజాస్వామ్యం కోసమే పోరాటం-సీఎం రేవంత్

Air India: మరో ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. ఫ్లైట్‌లో కాంగ్రెస్ పార్టీ ఎంపీలు

Big Stories

×