E-Paper
Advertisement

బిగ్ బ్రేకింగ్.. తెలంగాణలో ఎబోలా వైరస్ అలర్ట్..!

బిగ్ బ్రేకింగ్.. తెలంగాణలో ఎబోలా వైరస్ అలర్ట్..!

Ebola Alert: స్వేచ్చ బ్యూరో: ప్రపంచవ్యాప్తంగా కలవరం రేపుతున్న ప్రమాదకర ‘ఎబోలా’ వైరస్ ముప్పు నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత అప్రమత్తమైంది. సరిహద్దులు దాటి వైరస్ రాష్ట్రంలోకి ప్రవేశించకుండా ఉండేందుకు వైద్య ఆరోగ్య శాఖ యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టింది. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులే లక్ష్యంగా ఎయిర్‌పోర్టుల్లో నిఘా పెట్టడంతో పాటు, అనుమానితులకు తక్షణ చికిత్స అందించేందుకు సర్కారు సర్వం సిద్ధం చేసింది.

గాంధీ ఆసుపత్రిలో..

ఎబోలా లాంటి అత్యంత వేగంగా వ్యాపించే అంటువ్యాధులను ఎదుర్కొనేందుకు హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రిని నోడల్ కేంద్రంగా ప్రభుత్వం ప్రకటించింది. గాంధీ ఆసుపత్రిలోని 7వ అంతస్తును పూర్తిగా ఎబోలా ప్రత్యేక వార్డుగా మార్చారు. ఇక్కడికి సాధారణ రోగులు ఎవరినీ అనుమతించడం లేదు.వైరస్ సోకిన వారికి చికిత్స అందించేందుకు ప్రత్యేక వైద్యులు, పారామెడికల్ సిబ్బందితో కూడిన బృందాన్ని రంగంలోకి దించారు.పీపీఈ కిట్లు, ప్రత్యేక వెంటిలేటర్లు, ఎబోలా బాధితులకు అవసరమైన అత్యవసర మందులను ఇక్కడ సిద్ధంగా ఉంచినట్లు వైద్యాధికారులు తెలిపారు.

ఎయిర్‌పోర్టులో కఠిన నిఘా.. విదేశీ ప్రయాణికులే టార్గెట్..

వైరస్ రాష్ట్రంలోకి ఎంటర్ కాకుండా ఉండేందుకు ప్రధాన ద్వారమైన శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద నిరంతర నిఘా ఏర్పాటు చేశారు. ఎబోలా ప్రభావిత దేశాల నుండి వచ్చే ప్రయాణికులకు విమానాశ్రయంలోనే థర్మల్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు.విదేశీ ప్రయాణికులు తమ ఆరోగ్య పరిస్థితిని, ప్రయాణ వివరాలను విధిగా అధికారులకు సమర్పించాల్సి ఉంటుంది.

Also read; ఇందిరమ్మ ఇళ్ల ఎంపిక గ్రామసభల్లోనే.. క్లారిటీ ఇచ్చిన అధికారులు

ఎబోలా లక్షణాలు

ఎయిర్‌పోర్టులోనే 24 గంటలూ పనిచేసేలా వైద్య ఆరోగ్య శాఖ ఒక ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసింది. ఇక స్క్రీనింగ్ సమయంలో ఎవరికైనా ఎబోలా లక్షణాలు అంటే తీవ్రమైన జ్వరం, ఒంటి నొప్పులు, వాంతులు, అంతర్గత రక్తస్రావం ఉన్నట్లు అనుమానం వస్తే, వారిని ఏమాత్రం ఆలస్యం చేయకుండా ప్రత్యేక అంబులెన్స్‌ల ద్వారా నేరుగా గాంధీ ఆసుపత్రిలోని 7వ అంతస్తు స్పెషల్ వార్డుకు తరలిస్తున్నారు. అక్కడ వారి శాంపిల్స్ సేకరించి, ల్యాబ్ రిపోర్టులు వచ్చే వరకు ఐసోలేషన్‌లో ఉంచి పర్యవేక్షిస్తారు.

అప్రమత్తత చర్యలు..

“ప్రజలు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇది కేవలం ముందస్తు అప్రమత్తత చర్యలు మాత్రమే. వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు, అంటువ్యాధుల నేపథ్యంలో ప్రజలను రక్షించేందుకు ప్రభుత్వం అన్ని రకాల మౌలిక వసతులను సిద్ధం చేసింది.” అని రాష్ట్ర వైద్యాధికారులు ప్రకటించారు. వైరస్ లు, అంటువ్యాధులను నియంత్రించే సామర్ధ్యం తెలంగాణ హాస్పిటల్స్ కు ఉన్నట్లు తెలిపారు. కొవిడ్ సమయంలో ఏర్పాటు చేసుకున్న ఎక్విప్ మెంట్లు, ఇతర ఇన్ ఫ్రాస్ట్రక్చర్ తో ఎలాంటి వైరస్ లు వచ్చినా..సమర్ధవంతంగా హ్యాండిల్ చేయొచ్చని స్పష్టం చేశారు.

Also read; రెండు కాళ్లు ఫ్రాక్చర్.. ఆసుపత్రి బెడ్‌పై నుంచి పండు మాస్టర్ షాకింగ్ కామెంట్స్!

Related News

పాలమూరు రైతులకు గుడ్ న్యూస్.. కృష్ణా జలాలపై సీఎం కీలక ప్రకటన

ఇందిరమ్మ ఇళ్ల ఎంపిక గ్రామసభల్లోనే.. క్లారిటీ ఇచ్చిన అధికారులు

భవన అనుమతుల సర్టిఫికెట్లకు మోక్షం ఎప్పుడో.. ఇంకా ఎదురుచూపులేనా..?

సీఎస్ అంశంపై మళ్లీ కేంద్రానికి లేఖ రాయనున్న సీఎం రేవంత్..?

అంగన్వాడీలకు గుడ్ న్యూస్ చెప్పనున్న ప్రభుత్వం..!

Operation Khazana: నక్సలైట్ల బంగారం కోసం.. భద్రతా బలగాలు కూంబింగ్..!

‘అధికారం పోయిన బలుపు తగ్గలేదు’ .. కేటీఆర్‌పై కడియం శ్రీహరి ఘాటు వ్యాఖ్యలు

Big Stories

×