E-Paper
Advertisement

రోజుకు 3GB డేటా కావాలా? Airtelలో ఈ రెండే బెస్ట్ ప్లాన్స్.. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ సైతం ఉచితం!

రోజుకు 3GB డేటా కావాలా? Airtelలో ఈ రెండే బెస్ట్ ప్లాన్స్.. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ సైతం ఉచితం!
Advertisement

Airtel Recharge: ఈ రోజుల్లో డేటా వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. దీనికి తగినట్లుగానే ఎయిర్ టెల్ ప్రతీరోజూ భారీగా డేటా అందించే రీఛార్జ్ ప్లాన్లను అందుబాటులోకి తెచ్చింది. ప్రధానంగా 3GB డైలీ డేటా కోరుకునేవారికి ఓటీటీ సబ్ స్క్రిప్షన్లతో కలిపి రెండు అద్భుతమైన ప్లాన్లను అందుబాటులో ఉంచుంది. ఆ ప్లాన్లకు సంబంధించిన వివరాలను ఈ కథనంలో చూద్దాం.

ఎయిర్‌టెల్ రూ. 838 ప్లాన్

ఎయిర్ టెల్ ఈ ప్లాన్ ను 56 రోజుల వ్యాలిడిటీతో తీసుకొచ్చింది. ప్రతిరోజూ 3GB డేటాతో పాటు అన్‌లిమిటెడ్ కాల్స్, రోజుకు 100 SMSలు పొందొచ్చు. ఇక ఓటీటీ విషయానికి వస్తే.. ‘అమెజాన్ ప్రైమ్ లైట్’ (Amazon Prime Lite) సబ్‌స్క్రిప్షన్ యూజర్లకు లభిస్తుంది. దీంతో పాటు ‘ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ప్లే ప్రీమియం’ ద్వారా సోనీ లివ్, లయన్స్ గేట్ ప్లే, ఆహా, సన్‌నెక్స్ట్ వంటి 18కి పైగా ఓటీటీ యాప్‌లను ఉచితంగా వీక్షించవచ్చు. అలాగే రూ.4,000 విలువైన ‘అడోబ్ ఎక్స్‌ప్రెస్ ప్రీమియం’ 12 నెలల సబ్‌స్క్రిప్షన్, సైబర్ మోసాల నుండి రక్షణ ఇచ్చే ‘ఎయిర్‌టెల్ సేఫ్’, ఉచిత హల్లోట్యూన్స్ పొందొచ్చు.

ఎయిర్‌టెల్ రూ.1798 ప్లాన్

Advertisement

ఈ ప్రీమియం ప్లాన్ ను 84 రోజుల వ్యాలిడిటీతో ఎయిర్ టెల్ తీసుకొచ్చింది. ఈ ప్లాన్ ద్వారా కూడా యూజర్లకు రోజూ 3GB డేటా, అన్‌లిమిటెడ్ ఉచిత కాల్స్, రోజుకు 100 SMSలు లభిస్తాయి. అయితే ఈ ప్లాన్లను ప్రధాన ఆకర్షణ ఏంటంటే నెట్ ఫ్లిక్స్ ఫ్రీ సబ్ స్క్రిప్షన్. యూజర్లు తమకు నచ్చిన టీవీ, మొబైల్, ల్యాప్‌టాప్‌లలో నెట్‌ఫ్లిక్స్ కంటెంట్‌ను ఉచితంగా వీక్షించవచ్చు. మరోవైపు ఈ ప్లాన్ లో 12 నెలల అడోబ్ ఎక్స్‌ప్రెస్ ప్రీమియం, ఎయిర్‌టెల్ సేఫ్ సేవలు, ఉచిత హెల్లోట్యూన్స్ ప్రయోజనాలు పొందొచ్చు.

Also Read: శాలరీ అకౌంట్ ఉందా? అయితే ఈ 10 అమేజింగ్ బెనిఫిట్స్.. అస్సలు మిస్ అవ్వకండి!

అన్‌లిమిటెడ్ 5G డేటా ఆఫర్

Advertisement

అయితే ఈ రెండు ప్లాన్లలోనూ అర్హులైన యూజర్లకు అపరిమిత 5G డేటాను ఎయిర్ టెల్ ఆఫర్ చేస్తోంది. రోజువారీ 3GB పరిమితితో సంబంధం లేకుండా ఉచితంగా 5G డేటాను ఉపయోగించుకోవచ్చు. ఒకవేళ రోజువారీ 3GB డేటా పరిమితి ముగిస్తే ఇంటర్నెట్ వేగం 64 Kbpsకి తగ్గుతుందని ఎయిర్ టెల్ వర్గాలు తెలిపాయి. మెుత్తంగా రోజువారీ డేటా వాడకం ఎక్కువగా ఉండి, అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్ వంటి ప్లాట్‌ఫామ్‌లను క్రమం తప్పకుండా చూసే వారికి ఎయిర్‌టెల్ అందించే ఈ ప్లాన్లు ఎంతగానో ఉపయోగపడతాయని చెప్పవచ్చు.

Also Read: మెట్రో పిల్లర్లనే మింగేస్తున్న రెస్టారెంట్లు.. ప్రశ్నించిన బిగ్ టీవీ రిపోర్టర్లపై రౌడీయిజం!

Tags

Related News

ఒక్కసారి ఛార్జ్ చేస్తే.. రోజులు తరబడి టెన్షన్ ఫ్రీ

వాట్సాప్ చాట్స్ డిలీట్ చేయకుండా.. స్టోరేజ్ ఎలా ఖాళీ చేయాలి?

రూ.1500లోపు అదిరిపోయే ఇయర్ బడ్స్..ఆఫర్ అంటే ఇలా ఉండాలి

రూ.500 లోపు.. బెస్ట్ ఉమెన్స్ వాచ్ మోడల్స్!

ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల నుంచి టీవీల వరకు.. Flipkart Big Billion Days డేట్స్ వచ్చేశాయోచ్!

కొత్త ల్యాప్‌టాప్ కొనే ఆలోచనలో ఉన్నారా? Asus తెచ్చిన ఈ 5 మోడల్స్‌పై ఓ లుక్కేయండి!

65 ఇంచుల టీవీపై మతిపోయే ఆఫర్..వెంటనే కొనేయండి

Big Stories

Advertisement
×