Salary Account Benefits: ఉద్యోగం చేసే ప్రతీ ఒక్కొరికి సహజంగానే ఓ శాలరీ అకౌంట్ ఉంటుంది. అయితే మెజారిటీ ఉద్యోగులు ఈ ఖాతాను జీతం డ్రా చేయడానికి, రోజువారీ పేమెంట్స్ కోసం మాత్రమే వినియోగిస్తుంటారు. కానీ సాధారణ సేవింగ్స్ ఖాతాతో పోలిస్తే శాలరీ ఎకౌంట్‌కు బ్యాంకులు ఎన్నో ప్రత్యేక ప్రయోజనాలను కల్పిస్తాయన్న సంగతి చాలా మందికి తెలీదు. దీనివల్ల ఆ బెనిఫిట్స్ లను వారు పొందలేకపోతున్నారు. కాబట్టి శాలరీ అకౌంట్ ద్వారా ఒక ఉద్యోగికి కలిగే 10 రకాల ప్రయోనాలేంటో ఈ కథనంలో చూద్దాం.
సాధారణ సేవింగ్స్ ఖాతాలో ప్రతి నెలా కొంత కనీస బ్యాలెన్స్ మెయిన్ టెన్ చేయడం తప్పనిసరి. లేదంటే బ్యాంకులు జరిమానాలు విధిస్తాయి. కానీ శాలరీ ఖాతాలో ఈ సమస్యే ఉండదు. మీ ఖాతాలో బ్యాలెన్స్ సున్నా (Zero) ఉన్నప్పటికీ బ్యాంకులు ఎలాంటి పెనాల్టీలు వేయవు. ఇది ఉద్యోగులకు లభించే అతిపెద్ద ఊరట.
అత్యవసర సమయంలో లేదా నెలాఖరులో చేతిలో డబ్బులు లేనప్పుడు శాలరీ ఖాతాదారులకు ‘ఓవర్‌డ్రాఫ్ట్’ సదుపాయం బాగా ఉపయోగపడుతుంది. మీ ఖాతాలో డబ్బులు లేకపోయినా బ్యాంక్ విధించిన నిర్దేశిత పరిమితితో ముందస్తుగా డబ్బు విత్‌డ్రా చేసుకోవచ్చు. లేదంటే డిజిటల్ పేమెంట్స్ చేయవచ్చు.
క్రమం తప్పకుండా ప్రతి నెలా జీతం వస్తుండటంతో బ్యాంకులు శాలరీ ఖాతాదారులను ఎక్కువగా నమ్ముతాయి. దీనివల్ల పర్సనల్ లోన్స్, హోమ్ లోన్స్, కార్ లోన్స్ పొందడం చాలా తేలికవుతుంది. అంతేకాకుండా సాధారణ కస్టమర్ల కంటే తక్కువ వడ్డీ రేట్లకే రుణాలు మంజూరు చేసే అవకాశం ఉంటుంది.
సాధారణ ఖాతాదారులకు డెబిట్ కార్డ్, కొత్త చెక్‌బుక్ జారీకి బ్యాంకులు ఛార్జీలు వసూలు చేస్తాయి. కానీ శాలరీ ఖాతాదారులకు రూపే, వీసా లేదా మాస్టర్ కార్డ్ వంటి డెబిట్ కార్డులతో పాటు చెక్‌బుక్‌లను చాలా బ్యాంకులు ఉచితంగానే అందిస్తాయి.
ఇంటర్నెట్ బ్యాంకింగ్ లేదా మొబైల్ యాప్‌ల ద్వారా చేసే NEFT, RTGS, IMPS లావాదేవీలకు శాలరీ ఖాతాదారులకు ఎలాంటి ఛార్జీలు పడవు. ఎలాంటి అదనపు రుసుము లేకుండా ఎంత మొత్తాన్నైనా సులభంగా వేరే ఖాతాలకు బదిలీ చేసుకోవచ్చు.
శాలరీ ఎకౌంట్ ఉన్నవారికి బ్యాంకులు ప్రీ-అప్రూవ్డ్ క్రెడిట్ కార్డులను సులభంగా ఇస్తాయి. ఎలాంటి జాయినింగ్, వార్షిక ఫీజులు లేకుండా లభించే ఈ కార్డులపై రివార్డు పాయింట్లు, క్యాష్‌బ్యాక్‌లు, ఫ్యూయల్ సర్‌ఛార్జ్ మినహాయింపులు పొందే వెసులుబాటు ఉంటుంది.
చాలామందికి తెలియని విషయం ఏమిటంటే.. శాలరీ ఖాతాపై ఉచిత ప్రమాద రక్షణ బీమా లభిస్తుంది. కొన్ని బ్యాంకులు ఆరోగ్య బీమా సౌకర్యాన్ని కూడా అందిస్తాయి. దీనికోసం ఉద్యోగి ప్రత్యేకంగా ఎలాంటి ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేదు.
ఎక్కువ జీతం పొందే ఖాతాదారులకు బ్యాంకులు ‘ప్రియోరిటీ బ్యాంకింగ్’ సేవలను అందిస్తాయి. బ్యాంకు శాఖకు వెళ్లినప్పుడు ప్రత్యేక కౌంటర్లు, వేగవంతమైన సేవలతో పాటు సందేహాలను నివృత్తి చేయడానికి ఒక డెడికేటెడ్ ‘రిలేషన్‌షిప్ మేనేజర్’ను కూడా కేటాయిస్తాయి.
ఆన్‌లైన్ షాపింగ్, ఫుడ్ డెలివరీ యాప్‌లు, రెస్టారెంట్లు, ట్రావెల్ బుకింగ్స్‌పై శాలరీ అకౌంట్ కు సంబంధించిన డెబిట్, క్రెడిట్ కార్డులను ఉపయోగిస్తే ప్రత్యేక డిస్కౌంట్లు, క్యాష్‌బ్యాక్ ఆఫర్లు లభిస్తాయి. ఇవి రోజువారీ ఖర్చులను తగ్గించుకోవడానికి ఎంతో దోహదపడతాయి.
Also Read: మెట్రో పిల్లర్లనే మింగేస్తున్న రెస్టారెంట్లు.. ప్రశ్నించిన బిగ్ టీవీ రిపోర్టర్లపై రౌడీయిజం!
సాధారణంగా ఇతర గ్రామీణ లేదా పట్టణ ప్రాంతాల్లో ఏటీఎం వాడకంపై పరిమితులు ఉంటాయి. కానీ శాలరీ ఖాతాదారులకు ప్రతి నెలా ఎక్కువ సంఖ్యలో ఫ్రీ ఏటీఎం నుంచి నగదు విత్ డ్రా చేసుకునే వెసులుబాటు ఉంటుంది. దీనివల్ల ప్రతిసారీ ఛార్జీలు పడతాయనే భయం లేకుండా నగదు విత్‌డ్రా చేసుకోవచ్చు.
Also Read: రూ.1000 కోట్ల మెట్రో స్కామ్.. రమణారెడ్డి పావు మాత్రమేనా? వెనకున్న అదృశ్య శక్తులు ఎవరు?