MOSS Echo Whisper TWS: ప్రస్తుత టెక్ మార్కెట్‌లో యాక్టివ్ నాయిస్ క్యాన్సలేషన్ ఫీచర్‌తో వచ్చే ఇయర్ బడ్స్‌కు విపరీతమైన క్రేజ్ ఉంది. తక్కువ బడ్జెట్‌లో ప్రీమియం ఫీచర్లను అందించే లక్ష్యంతో మార్కెట్లోకి వచ్చిన మోడలే ఇది కూడా. అద్భుతమైన బ్యాటరీ బ్యాకప్, 10mm డ్రైవర్లు , డ్యూయల్ డివైస్ పేరింగ్ సపోర్ట్‌తో వస్తున్న.. ఈ ఇయర్ బడ్స్ కేవలం రూ.1,799 ధరకే లభిస్తున్నాయి. ట్రెండీగా ఉండే ఈ బడ్జెట్ ANC ఇయర్ బడ్స్ విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ రోజుల్లో గాడ్జెట్లు కేవలం పని చేయడమే కాకుండా, చూడటానికి కూడా స్టైలిష్‌గా ఉండాలని అందరూ కోరుకుంటున్నారు.ఈ మోడల్ ఇయర్ బడ్స్ చాలా మోడ్రన్, ప్రీమియం డిజైన్‌తో వస్తాయి. దీని ఛార్జింగ్ కేస్ , ఇయర్ బడ్స్ ఫినిషింగ్ చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. అంతే కాకుండా వీటిని చెవుల్లో పెట్టుకున్నప్పుడు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఎర్గోనామిక్ డిజైన్‌తో తయారు చేసారు. ఆఫీస్‌లో ఉన్నా, జిమ్‌లో వర్కవుట్ చేస్తున్నా లేదా ప్రయాణాల్లో ఉన్నా ఇవి చెవుల నుంచి జారిపోకుండా గట్టిగా సెట్ అయి ఉంటాయి.
బేస్ లవర్స్ ను ఆకట్టుకునేలా ఇందులో పవర్ ఫుల్ 10mm డ్రైవర్లను అమర్చారు. దీని.. వల్ల పాటలు వింటున్నప్పుడు డీప్ బేస్, క్రిస్టల్ క్లియర్ వోకల్స్ చక్కగా వినిపిస్తాయి. రాక్ మ్యూజిక్ అయినా.. క్లాసికల్ సాంగ్స్ అయినా ప్రతి బీట్ చాలా స్పష్టంగా ఎంజాయ్ చేయొచ్చు. తక్కువ బడ్జెట్‌లో ఈ స్థాయి ఆడియో అవుట్ పుట్ ఇవ్వడం నిజంగా గ్రేట్ అని చెప్పొచ్చు.
ఈ ఇయర్ బడ్స్‌లో అత్యంత ముఖ్యమైన హైలైట్ దీని నాయిస్ క్యాన్సలేషన్ ఫీచర్లు. ఇది బయటి సౌండ్స్‌ను ప్రభావవంతంగా అడ్డుకోవడానికి ANC సపోర్ట్‌ను కలిగి ఉంటుంది. రద్దీగా ఉండే రోడ్లపై లేదా బస్సుల్లో ప్రయాణిస్తున్నప్పుడు చుట్టు పక్కల శబ్దాలు మనకు వినిపించకుండా ఇది నివారిస్తుంది. అలాగే క్వాడ్-మిక్ ENC టెక్నాలజీ కారణంగా ఫోన్ కాల్స్‌లో.. అవతలి వారికి మన గొంతు ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా.. చాలా స్పష్టంగా వినిపిస్తుంది. వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేవారికి ఇది ఎంతగానో ఉపయోగ పడుతుంది.
బ్యాటరీ బ్యాకప్ విషయంలో.. ఈ డివైస్ అస్సలు నిరాశపరచదు. ఇది సుమారు 60 గంటల వరకు లాంగ్ బ్యాటరీ లైఫ్‌ను అందిస్తుంది. ఒక్క సారి ఛార్జ్ చేస్తే .. రోజంతా ఎలాంటి టెన్షన్ లేకుండా మ్యూజిక్ వినొచ్చు. అంతే కాకుండా కాల్స్ మాట్లాడుకోవచ్చు. అలాగే ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉండటం వల్ల అత్యవసర సమయాల్లో తక్కువ సమయంలోనే.. బ్యాటరీని త్వరగా ఛార్జ్ చేసుకోవచ్చు.
కనెక్టివిటీ పరంగా.. ఇది లేటెస్ట్ టెక్నాలజీని సపోర్ట్ చేస్తుంది. బ్లూటూత్ వెర్షన్ కారణంగా.. ఫోన్ లేదా ల్యాప్‌టాప్‌తో ఇయర్ బడ్స్‌ను కనెక్ట్ చేయడం క్షణాల్లో జరిగిపోతుంది. కనెక్షన్ మధ్యలో కట్ అవ్వడం లేదా లాగ్ అవ్వడం లాంటి సమస్యలు రావు. ముఖ్యంగా ఇందులో.. ఇచ్చిన డ్యూయల్ డివైస్ పేరింగ్ ఫీచర్ ద్వారా ఒకేసారి రెండు డివైస్‌లకు కనెక్ట్ చేసుకోవచ్చు. ఉదాహరణకు ల్యాప్ టాప్‌లో సినిమా చూస్తూనే.. ఫోన్‌కి వచ్చే కాల్స్‌ని ఈజీగా అటెండ్ చేయొచ్చు.
Also Read: రూ.500 లోపు.. బెస్ట్ ఉమెన్స్ వాచ్ మోడల్స్!
మార్కెట్లో లభించే ఇతర ప్రీమియం బ్రాండ్లతో పోలిస్తే.. ఈ మోడల్ కేవలం రూ.1,799 ధరకే లభించడం విశేషం. ANC,లాంగ్ బ్యాటరీ బ్యాకప్, డ్యూయల్ డివైస్ పేరింగ్ వంటి అడ్వాన్స్‌డ్ ఫీచర్లు తక్కువ బడ్జెట్‌లో కోరుకునే ప్రతి ఒక్కరికీ ఇది ఒక అద్భుతమైన ఆప్షన్. బడ్జెట్ ఫ్రెండ్లీ వైర్‌లెస్ ఇయర్ బడ్స్ కొనాలనుకునేవారికి.. ఇది పర్ఫెక్ట్ ఛాయిస్!