E-Paper
Advertisement

ప్యారడైజ్ విషయంలో కీర్తి సురేష్ సీరియస్.. అసలు మ్యాటర్ చెప్పిన నాని!

ప్యారడైజ్ విషయంలో కీర్తి సురేష్ సీరియస్.. అసలు మ్యాటర్ చెప్పిన నాని!
Advertisement

The Paradise: నాచురల్ స్టార్ నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న తాజా చిత్రం ది ప్యారడైజ్. ఈ సినిమా సెప్టెంబర్ 24వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే తాజాగా చిత్ర బృందం చెన్నైలో ప్రెస్ మీట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల, హీరో నాని(Nani) పాల్గొన్నారు. ఈ నేపథ్యంలోనే తమిళ మీడియా వారు నానిని ప్రశ్నిస్తూ ఈ సినిమాలో కీర్తి సురేష్(Keerthy Suresh) భాగం అవ్వటం చాలా సంతోషంగా ఉంది యేషనాగుల(Yeshnagula) కట్టసాంగ్ కూడా చాలా సక్సెస్ అయ్యింది అంటూ ఈ విషయం పట్ల ప్రశ్నలు వేశారు.

కీర్తి సురేష్ సీరియస్ అయింది..

ఈ ప్రశ్నకు నాని సమాధానం చెబుతూ నిజానికి కీర్తి సురేష్ తనకు చాలా మంచి ఫ్యామిలీ ఫ్రెండ్ అని తెలిపారు. మా ఇద్దరి కాంబినేషన్లో నేను లోకల్ దసరా సినిమాలు వచ్చాయని, కీర్తి సురేష్ శ్రీకాంత్ కు బెస్ట్ ఫ్రెండ్ అయిందని తెలిపారు. శ్రీకాంత్ నేను కలిసి ది ప్యారడైజ్ సినిమా చేస్తున్నామనే విషయం తెలియడంతో మాపై అలిగిందని నాని తెలిపారు. ఈ సినిమాలో తను భాగం కాలేదని చాలా బాధపడింది. లక్కీగా ఆమె ఈ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ చేసే అవకాశం అందుకున్నారని అందుకు చాలా సంతోషంగా ఉందని నాని తెలిపారు..

జడలు కారణంగా ఇబ్బందులు …

Advertisement

ప్రస్తుతం ఏషనాగుల సాంగ్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉందని నాని ఈ సందర్భంగా తెలియజేశారు. ఇక ఈ సినిమాలో జడలు వేసుకుని కనిపించడం ఇబ్బందిగా అనిపించలేదా అంటూ మరో ప్రశ్న ఎదురయింది. ఈ ప్రశ్నకు నాని సమాధానం చెబుతూ దాదాపు 106 రోజులపాటు జడలతోనే షూటింగ్ చేశామని అలా షూట్ చేసే సమయంలో చాలా ఇబ్బంది పడ్డామని నాని తెలియజేశారు. మొదట్లో హీరోకి జడలు ఉంటే హీరోనా లేదా కమెడియనా అనే విమర్శలు వస్తాయని భావించాను కానీ డైరెక్టర్ శ్రీకాంత్ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఇక ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ కు చాలా మంచి ఆదరణ లభించడంతో మేమంతా కూడా చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నామని తెలిపారు.

తల్లి కొడుకుల సెంటిమెంట్ నేపథ్యంలో..

Advertisement

ఇక ఈ సినిమా తల్లి కొడుకుల సెంటిమెంట్ నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ సినిమా తరచు వాయిదా పడుతూ వస్తోంది. ఇక సెప్టెంబర్ 24వ తేదీ ఈ సినిమా భారీగా విడుదలకు సిద్ధమయింది. ఇక రెండు తెలుగు రాష్ట్రాలలో సెప్టెంబర్ 23వ తేదీ ప్రీమియర్లు ప్రసారం కాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా విడుదలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి అయ్యాయి ఈ సినిమాకు సెన్సార్ బోర్డ్ A సర్టిఫికెట్ జారీ చేస్తూ 2:49 నిమిషాల రన్ టైంకి లాక్ చేశారు. మరి నాని కెరియర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ప్యారడైజ్ ఎలాంటి ఆదరణ సొంతం చేసుకుంటుందనేది తెలియాల్సి ఉంది.

Also Read: గెటప్ శ్రీను రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా? హీరోలను మించిపోయాడుగా?

Related News

ఆ తమిళ డైరెక్టర్ తో సినిమా చేయటం డ్రీమ్..నాని కల నెరవేరేనా?

టాక్సిక్ ప్లాప్.. చేతిలో మాత్రం భారీ ప్రాజెక్టులు! యష్ లెక్కేంటో?

పిల్లలు పుట్టాక మీ భార్యలను వదిలేస్తారా? మాధవీలత ఘాటు వ్యాఖ్యలు

సంక్రాంతి రేసులోనే ‘కాకా’ మేకర్స్ క్లారిటీ.. ‘విశ్వంభర’ వెనక్కి తగ్గాల్సిందేనా!

బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన ‘గబ్బర్ సింగ్’ రమేష్.. ఇప్పుడు ఎలా ఉన్నారంటే?

40ల్లోనూ తగ్గని అందం.. అనసూయ గ్లామర్ లుక్స్ వైరల్!

సెన్సార్ పూర్తి చేసుకున్న సెప్టెంబర్ 18 రిలీజ్ చిత్రాలు.. ఏ మూవీ రన్ టైమ్ ఎంతంటే?

Big Stories

Advertisement
×