E-Paper
Advertisement

Supreme Court: సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. ఎన్డీయేతర రాష్ట్రాలకు చుక్కెదురు

Supreme Court: సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. ఎన్డీయేతర రాష్ట్రాలకు చుక్కెదురు
Advertisement

Supreme Court: పెండింగ్‌ బిల్లుల ఆమోదానికి సంబంధించిన విషయంలో ఎన్డీయేతర రాష్ట్రాలకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఈ విషయంలో రాష్ట్రపతి, గవర్నర్లకు గడువు విధించలేమని తేల్చి చెప్పింది సుప్రీంకోర్టు. గవర్నర్ కు పరిమితమై సూచనలు మాత్రమే ఇవ్వగలమని ధర్మాసనం అభిప్రాయపడింది.

గవర్నర్ వద్ద పెండింగ్‌ బిల్లుల వ్యవహారం

Advertisement

వివిధ రాష్ట్రాల శాసనసభలు ఆమోదించిన బిల్లులకు సమ్మతి తెలిపే విషయంలో గవర్నర్లకు న్యాయస్థానం గడువు విధించడంపై రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము సంధించిన ప్రశ్నలపై సుప్రీంకోర్టు గురువారం కీలక తీర్పు వెలువరించింది. పెండింగ్‌ బిల్లుల విషయంలో రాష్ట్రపతి, గవర్నర్లకు గడువును విధించడం తగదని పేర్కొంది.

కారణం చెప్పకుండా బిల్లులు వెనక్కి పంపలేరని పేర్కొంది. గవర్నర్లు అపరిమిత అధికారాలను వినియోగించలేరని తెలిపింది. ఈ విషయంలో ఆర్టికల్‌ 200 కింద వారికి విచక్షణ అధికారం ఉంటుందని ఐదుగురు సభ్యుల ధర్మాసనం తేల్చి చెప్పింది.  అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను పలు రాష్ట్రాల గవర్నర్లు పెండింగ్‌లో పెడుతున్నారు.

Advertisement

సుప్రీంకోర్టు సంచలన తీర్పు, ఎన్డీయేతర రాష్ట్రాలకు చుక్కెదురు

ఈ క్రమంలో స్టాలిన్ ప్రభుత్వం వేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు గతంలో తీర్పు ఇచ్చింది. మూడు నెలల గడువు లోపు వాటిని ఆమోదించాలని, లేకుంటే ఆమోదించినట్లేనని పేర్కొంది. గవర్నర్‌ విషయంలో కాదు రాష్ట్రపతి విషయంలోనూ ఇదే నిబంధన వర్తిస్తుందని పేర్కొంది. ఈ తీర్పుపై స్వయంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రిఫరెన్స్‌ కోరింది న్యాయస్థానం. ఈ క్రమంలో సుప్రీంకోర్టుకు 14 ప్రశ్నలు సంధించిన విషయం తెల్సిందే.

తమిళనాడు కేసులో గవర్నర్లు బిల్లులను పరిష్కరించేందుకు గడువు నిర్ణయించింది ఇద్దరు న్యాయమూర్తుల ధర్మాసనం. గతంలో జారీ చేసిన ఆదేశాలను ప్రధాన న్యాయమూర్తి బిఆర్ గవాయ్, న్యాయమూర్తులు సూర్యకాంత్, విక్రమ్ నాథ్, పిఎస్ నరసింహ, ఎఎస్ చందూర్కర్‌లతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం కొట్టివేసింది.

ALSO READ: తీవ్ర విషాదం.. శబరిమల యాత్రలో అపశృతి, క్యూలైన్‌లో మహిళ మృతి

గవర్నర్లు, రాష్ట్రపతి అధికారాలపై పరిమితి రాజ్యాంగస్ఫూర్తికి, ప్రాథమిక నిర్మాణ సిద్ధాంతానికి విరుద్ధమని వ్యాఖ్యానించింది.డీమ్డ్ అసెంట్ వాదనలను తోసిపుచ్చింది. అలాంటి తీర్పు కార్యనిర్వాహక విధులను న్యాయపరంగా స్వాధీనం చేసుకున్నట్లు అవుతుందని హెచ్చరించింది. చట్టాలను రూపొందించే ప్రక్రియలో గవర్నర్లు కాదు, ఎన్నికైన ప్రభుత్వాలు ప్రధాన పాత్ర వహించాలని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది.

ఎన్నికైన ప్రభుత్వం-మంత్రివర్గం-డ్రైవర్ సీటులో ఉండాలని కోర్టు నొక్కి చెప్పింది. డ్రైవర్ సీటులో ఇద్దరు ఉండకూడదంటే గవర్నర్ బిల్లు ఆమోదాన్ని అడ్డుకోలేరని సూచిస్తుందని తెలిపింది. బిల్లును నిలిపివేసే ప్రక్రియను అడ్డుకునే అధికారం గవర్నర్‌కు లేదని, ఆయన ఆమోదం పొందవచ్చు. లేదంటే బిల్లును అసెంబ్లీకి తిరిగి పంపవచ్చు లేకుంటే రాష్ట్రపతికి పంపవచ్చని ధర్మాసనం పేర్కొంది.

Related News

కాశ్మీర్‌లో ప్రకృతి భీభత్సం.. ఆకస్మిక వరదలు, కుప్పలుగా వాహనాలు, 8 మంది మృతి

కర్ణాటకలో ఘోర విషాదం.. పెళ్ళయిన 15 రోజుల్లోనే నవవధువు మృతి.. అసలేం జరిగింది?

నగరాల్లో డెలివరీ బాయ్స్ అరాచకాలు.. ఇంట్లో ఒంటరిగా ఉందని డోర్ నెట్టుకుని లోపలికి, ఆపై..

లెక్కలు బయట పెట్టండి.. మౌనం సరికాదు, ప్రధాని నరేంద్రమోదీకి రాహుల్‌‌గాంధీ-ఖర్గే లేఖ

వానల కోసం సరికొత్త పూజ.. వర్షాలు కురవాలని గాడిదలకు స్వీట్లు తినిపించిన స్థానికులు!

జపాన్‌లో వర్క్ కల్చర్.. ఓ భారతీయుడి కీలక వ్యాఖ్యలు, వీకెండ్స్‌లో అయితే

అమర్‌నాథ్-వైష్ణోదేవి యాత్రలకు తాత్కాలికంగా బ్రేక్.. బేస్ క్యాంపుల ఆగిన యాత్రికులు, ఏం జరిగింది?

ఏడేళ్ల బంధం.. ఎండమావి అయింది.. ప్రియుడితో కలిసి భర్త తల నరికిన భార్య, ఎక్కడంటే?

Big Stories

Advertisement
×