BigTV English

Team India lead by 322: మూడో రోజు హీరో యశస్వి…: టీమ్ ఇండియా ఆధిక్యం 322

Team India lead by 322: మూడో రోజు హీరో యశస్వి…: టీమ్ ఇండియా ఆధిక్యం 322

Third day Team India lead by 322: రాజ్ కోట్ లో జరుగుతున్న మూడో టెస్టులో టీమ్ ఇండియా తొలి రోజు ఆట ముగిసే సమయానికి రెండు వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. యశస్వి జైశ్వాల్ సూపర్ సెంచరీ చేసి రిటైర్డ్ హార్ట్ గా వెనుతిరిగాడు. తర్వాత గిల్ (65 నాటౌట్ )తో టీమ్ ఇండియా పటిష్ట స్థితికి చేరుకుంది.


అయితే ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ ను 2 వికెట్ల నష్టానికి 207 పరుగులతో మూడో రోజు ఆటను మొదలు పెట్టి, సిరాజ్ ధాటికి 319 పరుగులకు ఆలౌట్ అయ్యింది.

మొత్తానికి తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో చూసుకుంటే 322 రన్స్ తో టీమ్ ఇండియా పటిష్టంగా ఉంది. అయితే నాలుగోరోజు ఆట ఎలా ఉంటుందనే దానిపై టీమ్ ఇండియా విజయం ఆధారపడి ఉంది. కనీసం 400 నుంచి 450 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లాండ్ ముందు ఉంచాలని క్రీడా పండితులు విశ్లేషిస్తున్నారు.


అంతకుముందు ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో ఓవర్‌నైట్ స్కోరు 207/2‌తో మూడో రోజు ఆట ప్రారంభించింది. మరో 112 పరుగులు మాత్రమే చేసి మిగిలిన 8 వికెట్లు కోల్పోయింది. మహ్మద్ సిరాజ్ నిప్పులు చెరిగే బంతులతో బెంబేలెత్తించాడు. దీంతో భారత్‌కు తొలి ఇన్నింగ్స్‌లో 126 పరుగుల ఆధిక్యం లభించింది.

Read More: నెట్టింట షేక్ పుట్టిస్తున్న సిరాజ్ బౌలింగ్..

కెప్టెన్ బెన్ స్టోక్స్ (41) మినహా ఎవరూ పెద్దగా స్కోరు చేయలేదు. రెండో రోజు సెంచరీ వీరుడు బెన్ డకెట్ 153 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఇంక అక్కడ నుంచి అందరూ క్యూ కట్టారు.

టీమ్ ఇండియాలో సిరాజ్ 4, జడేజా 2, కులదీప్ 2, బుమ్రా 1, అశ్విన్ 1 వికెట్టు పడగొట్టారు.

తర్వాత టీమ్ ఇండియా రెండో ఇన్నింగ్స్ ప్రారంభించింది.
ఓపెనర్ రోహిత్ శర్మ (19) త్వరగా అవుట్ అయ్యాడు. తర్వాత యశస్వి జైశ్వాల్ (104), గిల్ (65*)తో కలిసి ఇండియాని పటిష్ట స్థితికి చేర్చారు. తను కెరీర్ లో మూడో సెంచరీ చేశాడు. ఇంగ్లాండ్ సిరీస్ లో వరుసగా రెండో సెంచరీ చేశాడు. ఈ మూడు సెంచరీలను కూడా అత్యంత వేగంగా చేసిన క్రికెటర్ గా రికార్డ్ స్రష్టించాడు.

తను రిటైర్డ్ హర్ట్ అయ్యాక క్రీజులోకి వచ్చిన రజత్ పటిదార్ 10 బాల్స్ ఆడి డక్ అవుట్ అయ్యాడు. తర్వాత క్రీజులోకి కులదీప్ వచ్చి 3 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. ప్రస్తుతం గిల్, కులదీప్ ఉన్నారు.

మూడో రోజు ఆట ముగిసేసరికి టీమిండియా రెండో ఇన్నింగ్స్‌లో రెండు వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. ఇంగ్లండ్ కంటే 322 పరుగుల ఆధిక్యంలో నిలిచింది.

ఆస్ట్రేలియా బౌలర్లలో జో రూట్ , టామ్ హార్ట్ లీ చెరో వికెట్ తీసుకున్నారు.

Related News

NZ vs Zim: 359 పరుగుల తేడాతో న్యూజిలాండ్ విజయం

RCB: రూ.1650 కోట్లు, 80 వేల మందితో స్టేడియం.. ఎక్కడంటే

Rohit Sharma: రోహిత్ శర్మ పొట్టపై దారుణంగా ట్రోలింగ్… కోహ్లీ ఫ్యాన్స్ రెచ్చిపోయి మరీ

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Big Stories

×