Chennai: హీరోయిన్ త్రిషపై హాట్ కామెంట్స్ చేసిన డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్‌పై పోలీసులు కేసు నమోదు చేయడం, ఆ తర్వాత అరెస్టు చేయడం చకచకా జరిగింది. వివిధ వర్గాల నుంచి ఫిర్యాదులు వెళ్లువెత్తడంతో ఆయనపై ఆరు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. పరిస్థితి గమనించిన ఉదయనిధి, బెయిల్ కోసం మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. అసలు ఏం జరిగింది?
కర్ణాటక-తమిళనాడు మధ్య కావేరీ జలాల అంశం వేడెక్కింది. ఈ వ్యవహారం తమిళనాడు రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ క్రమంలో సోమవారం తంజావూరులో జరిగిన నిరసనలలో హీరోయిన్ త్రిషను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్. రైతుల ప్రయోజనాలను కాపాడటంలో టీవీకే ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు.
ఆయన ప్రసంగం సమయంలో కార్యకర్తలు త్రిష, త్రిష అంటూ నినాదాలు చేయడంతో పరోక్షంగా నటి గురించి ప్రస్తావించారు. ఆమె గురించి ద్వంద్వార్థం ధ్వనించేలా అనుచితంగా మాట్లాడారు. అయితే తాను చెప్పింది కావేరీ గురించేనని వివరణ ఇచ్చారు.ఉదయనిధి వ్యాఖ్యలపై విమర్శలు తీవ్రమయ్యాయి. ఇవి ముమ్మాటికీ అసహ్యమైన వ్యాఖ్యలని, ఎవరిపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఆమోదయోగ్యం కాదని టీవీకే నేతలు అన్నారు.
డీఎంకే దిగజారుతున్న రాజకీయ ప్రమాణాలకు ఈ మాటలు నిదర్శనమని మండిపడ్డారు. చివరకు బీజేపీ నేతలు ఈ వ్యాఖ్యలను ఖండించారు. ఈ వ్యవహారం కాస్త ముదిరిపాకాన పడింది. ఉదయనిధి తీరుపై టీవీకే పార్టీ జాతీయ మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. తంజావూరు టీవీకే సెంట్రల్ డిస్ట్రిక్ట్ ఉమెన్స్ వింగ్ ఆర్గనైజర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఉదయనిధి వ్యాఖ్యలతో తమిళనాడులో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ఉదయనిధి ఇంటి ముందు విజయ్ మద్దతుదారులు ఆందోళనకు చేపట్టారు.
ప్రతిపక్ష నాయకుడు ఉదయనిధి స్టాలిన్‌ను అరెస్ట్ చేయవచ్చనే ప్రచారం సాగుతోంది. తంజావూరు నుంచి వచ్చిన పోలీసుల బృంద, చెన్నైలో ఉదయనిధి స్టాలిన్ ను అదుపులోకి తీసుకున్నారు. పరిస్థితి గమనించిన ఉదయనిధి, బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. ఆయన పిటిషన్‌పై మంగళవారం మధ్యాహ్నం విచారణ జరగనుంది. న్యాయస్థానం తీర్పు ఏ విధంగా వస్తుందోనని కార్యకర్తలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ALSO READ: వాహనదారులకు బిగ్ అలర్ట్.. వాహనాల్లో వీ2వీ వ్యవస్థ, ఎన్ని ఉపయోగాలో తెలుసా?