E-Paper
Advertisement

ప్రేమలో మూడో వ్యక్తి జోక్యాన్ని సహించరు.. ఈ తేదీల్లో పుట్టినవారు చాలా పొసెసివ్

ప్రేమలో మూడో వ్యక్తి జోక్యాన్ని సహించరు.. ఈ తేదీల్లో పుట్టినవారు చాలా పొసెసివ్
Advertisement

Numerology Possessive| న్యూమరాలజీ ప్రకారం.. ప్రతి మూల అంకానికి (జన్మ సంఖ్య) ప్రత్యేకమైన స్వభావం ఉంటుంది. అదే విధంగా ప్రేమను వ్యక్తం చేసే తీరు కూడా ఒక్కోరికి ఒక్కోలా ఉంటుంది.మకొంతమంది తమ భాగస్వామికి పూర్తి స్వేచ్ఛ ఇస్తారు. మరికొందరు ప్రేమలో చాలా రిజర్వ్‌గా, రక్షణాత్మకంగా, పొసెసివ్‌గా మారతారు. అంటే ఇతరులు తమ లవ్ పార్ట్‌నర్‌తో చనువుగా ఉండడం సహించలేరు.

న్యూమరాలజీ ప్రకారం ముఖ్యంగా మూల అంకం 4, మూల అంకం 8 ఉన్నవారిలో ఈ లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయని చెబుతారు.

Advertisement

Also Read: సాలరీ అకౌంట్‌లో పగడానే ఖర్చుచేస్తున్నారా? సేవింగ్స్ పెంచుకోవడానికి టిప్స్ ఇవిగో

మూల అంకం 4 వారు ప్రేమలో చాలా సీరియస్‌

ఏ నెలలోనైనా 4, 13, 22 లేదా 31 తేదీల్లో జన్మించిన వారి మూల అంకం 4గా పరిగణిస్తారు. ఈ మూల అంకానికి రాహువు అధిపతిగా భావిస్తారు. మూల అంకం 4 వ్యక్తులు ప్రేమలో చాలా నిజాయితీగా ఉంటారు. వారు సంబంధాలను సరదాగా తీసుకోరు. ఒకసారి ప్రేమలో పడితే పూర్తిగా ఆ బంధానికి అంకితమవుతారు. అయితే భాగస్వామిని కోల్పోతామనే భయం వారిలో ఎక్కువగా ఉంటుంది. ఈ భయమే వారిని కొన్నిసార్లు ఎక్కువగా పొసెసివ్‌గా మారుస్తుంది.

మూడో వ్యక్తి జోక్యాన్ని ఇష్టపడరు

Advertisement

మూల అంకం 4 వ్యక్తులు నమ్మకం, భావోద్వేగ బంధానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. ఎవరైనా తమ భాగస్వామికి దగ్గరవుతున్నట్లు అనిపిస్తే అసౌకర్యంగా భావిస్తారు. చిన్న విషయాలకే అనుమానం రావచ్చు. తమ భాగస్వామి ప్రతి విషయాన్ని తమకు చెప్పాలని కోరుకుంటారు. నిజాయితీ, విశ్వాసం వారికి చాలా ముఖ్యమైనవి.

మూల అంకం 8.. రక్షణాత్మక స్వభావం కలవారు

ఏ నెలలోనైనా 8, 17 లేదా 26 తేదీల్లో జన్మించిన వారి మూలాంకం 8గా ఉంటుంది. ఈ మూలాంకానికి శని గ్రహం అధిపతి. మూల అంకం 8 వ్యక్తులు ప్రశాంతంగా, గంభీరంగా కనిపిస్తారు. వారు సులభంగా ప్రేమలో పడరు. కానీ ఒకసారి ప్రేమించిన తర్వాత జీవితాంతం ఆ బంధాన్ని నిలబెట్టాలని ప్రయత్నిస్తారు. తమ భాగస్వామికి ఎలాంటి కష్టం రాకూడదని ఎప్పుడూ ఆలోచిస్తారు.

వ్యక్తిగత జీవితంలో జోక్యం ఇష్టపడరు

మూల అంకం 8 వ్యక్తులు తమ ప్రేమ జీవితాన్ని చాలా వ్యక్తిగతంగా ఉంచాలని కోరుకుంటారు. బయటి వ్యక్తుల సలహాలు లేదా జోక్యం వారికి అస్సలు నచ్చదు. తమ భాగస్వామినే తమ ప్రపంచంగా భావిస్తారు. దానికి ప్రతిగా పూర్తి విశ్వాసం, విధేయత, శ్రద్ధను ఆశిస్తారు.

అతిగా పొసెసివ్‌ స్వభావం ఉంటే సమస్యలు

ప్రేమ, నమ్మకం, విధేయత సంబంధాన్ని బలంగా ఉంచుతాయి. అయితే అతిగా పొసెసివ్‌గా ఉండటం వల్ల సంబంధాల్లో ఒత్తిడి పెరగవచ్చు. భాగస్వామికి వ్యక్తిగత స్వేచ్ఛ లేనట్లు భావన కలగవచ్చు. ఎప్పుడూ అనుమానం పడటం లేదా తరచూ వివరాలు అడగడం అపార్థాలకు దారి తీస్తుంది. ఆరోగ్యకరమైన సంబంధానికి నమ్మకం, గౌరవం, స్వేచ్ఛ చాలా అవసరం.

Also Read: ఈ సందర్భాల్లో అబద్ధం చెప్పాలని పిల్లలకు చెప్పాలి.. తల్లిదండ్రులు నేర్పాల్సిన 5 ముఖ్యమైన విషయాలు

సమతుల్యతే మంచి బంధానికి రహస్యం

న్యూమరాలజీ ప్రకారం ప్రతి వ్యక్తిలో మంచి లక్షణాలతో పాటు కొన్ని బలహీనతలు కూడా ఉంటాయి. మూల అంకం 4, మూల అంకం 8 వ్యక్తులు పరస్పర నమ్మకం పెంచుకుంటే బలమైన బంధాన్ని నిర్మించగలరు. భయాన్ని తగ్గించి, ఒకరికొకరు వ్యక్తిగత స్వేచ్ఛ ఇవ్వడం వల్ల సంబంధం మరింత బలపడుతుంది.

గమనిక: ఈ సమాచారం న్యూమరాలజీ విశ్వాసాల ఆధారంగా రూపొందించబడింది. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. వ్యక్తిగత లేదా మానవ సంబంధాల విషయంలో నిర్ణయాల కోసం నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

Tags

Related News

స్వీట్ హౌస్ స్టైల్ బ్రెడ్ హల్వా..ఇంట్లోనే ఇలా టేస్టీగా రెడీ చేయండి

చీజ్ లవర్స్‌కు తప్పకుండా నచ్చే ‘ఎగ్‌ప్లాంట్ పార్మిజియానా’.. లొట్టలేసుకుంటూ తినడం ఖాయం!

బండ్ల మీద దొరికే పెసర పునుగుల సీక్రెట్ ఇదే..స్ట్రీట్ ఫుడ్ టేస్ట్ ఇక మీ ఇంట్లోనే!

సొరకాయ పచ్చి కారం కూర ఇలా చేస్తే..ఒక్క ముద్ద కూడా వదలరు!

ఐస్‌క్రీమ్‌ను ఇలా కూడా తయారుచేయొచ్చా? ఈ జపనీస్ రెసిపీ తెలిస్తే వెంటనే ట్రై చేస్తారు!

సింపుల్‌గా హైదరాబాదీ రాయల్ మటన్ మరగ్.. ఇంటికొచ్చిన అతిథులు ముగ్దులైపోవాల్సిందే!

డిప్రెషన్, స్ట్రెస్ లేకుండా ప్రశాంతమైన జీవితం కావాలా? ఈ 5 జపాన్ టెక్నిక్స్ మీ కోసమే

రోజూ తెల్లవారుజామున 3 గంటలకే మెలకువ వచ్చేస్తోందా? మీ శరీరం ఏం చెబుతోందంటే!

Big Stories

Advertisement
×