E-Paper
Advertisement

భార‌త్ కు ఎదురుదెబ్బ‌…ఆసియా క్రీడల్లోనూ మెడ‌ల్స్ ఇవ్వ‌నున్న మొహ్సిన్ నఖ్వీ ?

భార‌త్ కు ఎదురుదెబ్బ‌…ఆసియా క్రీడల్లోనూ మెడ‌ల్స్ ఇవ్వ‌నున్న మొహ్సిన్ నఖ్వీ ?
Advertisement

Team India Expected To Accept Medals From Mohsin Naqvi:  టీమిండియాకు మొహ్సిన్ నఖ్వీ గండం తప్పేలా కనిపించడం లేదు. ఇక్కడికి వెళ్లినా… మొహ్సిన్ నఖ్వీనే య‌ముడిలా ప్రత్యక్షమవుతున్నాడు. ప్రస్తుతం జరుగుతున్న ఆసియా క్రీడాలలో భాగంగా కూడా టీమిండియాకు మొహ్సిన్ నఖ్వీ మెడల్స్ ఇచ్చే అవకాశాలు ఉన్నట్లు సోషల్ మీడియా అటు జాతీయ మీడియాలలో కథనాలు వెలువడుతున్నాయి. ఒలంపిక్ కౌన్సిల్ ఆఫ్ ఆసియా ఇండియాకు షాక్ ఇస్తూ నిర్ణయాన్ని తీసుకుంటే…. పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ చైర్మన్ గా ఉన్న మొహ్సిన్ నఖ్వీ ఇవ్వాల్సి ఉంటుందనే చ‌ర్చ మొద‌లైంది. ఆసియా క్రికెట్ కౌన్సిల్ చీఫ్ పదవిలో మొహ్సిన్ నఖ్వీ ఉన్న నేపథ్యంలో ఒలంపిక్ కౌన్సిల్ ఈ నిర్ణ‌యం తీసుకునే ఛాన్స్ ఉంద‌ని అంటున్నారు. నిజంగానే మొహ్సిన్ నఖ్వీకి బాధ్య‌త‌లు అప్పిగిస్తే, ఈ క్రీడాలలో భారత క్రికెటర్లు…మ‌రోసారి పాక్ వ్య‌క్తి చేతుల మీదుగా మెడల్స్ స్వీకరించాల్సిందేనని నివేదికలు కూడా చెబుతున్నాయి. దీంతో బీసీసీఐతో పాటు టీమ్ ఇండియా క్రికెటర్లు తలలు పట్టుకుంటున్నారు.

ఆసియా క్రీడాలలో కఠినమైన రూల్స్… BCCI పప్పులు ఉడకవు

ఆసియా కప్ లో ఉన్నట్లుగా ఆసియా క్రీడాలలో రూల్స్ ఉండవు. ఇక్కడ ఎవరి ఆధిపత్యం న‌డ‌వ‌దు. ఒలంపిక్ కౌన్సిల్ ఆఫ్ ఆసియా రాజ్యాంగంలోని ఆర్టికల్ 66 ప్రకారం విజేతలకు మెడల్స్ అందించే ప్రత్యేక హక్కు కేవలం…OCA ప్రెసిడెంట్ కు ఉంటుంది. లేదా ఆయన అధికారికంగా నియమించిన ప్రతినిధికి మాత్రమే ఆ ఛాన్స్ ఉండనుంది. అయితే ప్రాథమిక సమాచారం ప్రకారం ప్రత్యేక అధికారిగా మొహ్సిన్ నఖ్వీని నియామకం చేస్తారని చర్చ జరుగుతోంది.. ఆసియా క్రికెట్ కౌన్సిల్ పెద్దగా ఉన్న మొహ్సిన్ నఖ్వీకి… క్రికెటర్లకు ఇచ్చే మెడల్స్ బాధ్యతను అప్పగించబోతున్నారట.

Advertisement

Shahid Afridi Reaction On IND VS AFG: మాకు షేక్ హ్యాండ్ ఇవ్వ‌డం చేత‌కాదు, కానీ ఆఫ్ఘానిస్తాన్ కెప్టెన్ తో సంసార‌మే మొద‌లు పెట్టారు

అయితే ఈ ఆసియా క్రీడలలో మత, జాతి, రాజకీయ నిరసనలు, ప్రదర్శనలకు ఎలాంటి అనుమతి లేదు. అంద‌రూ స‌మాన‌మే. ఓవ‌ర్ చేస్తే, బ‌య‌ట‌కు గెంటేస్తారు. ప‌ర్మినెంట్ బ్యాన్ విధిస్తారు. అంటే ఈ లెక్క‌న‌ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య ఉన్న వార్ వాతావరణాన్ని ఇక్కడ ఎవరు చూపించకూడదు. ప్రతి ఒక్కరు ప్రోటోకాల్ పాల్గొనాల్సిందే. మొహ్సిన్ నఖ్వీ మెడల్స్ ఇస్తే.. అన్ని మూసుకొని తీసుకోవాల్సిందే. మొహ్సిన్ నఖ్వీ చేతుల మీదుగా తాము తీసుకోబోమని.. ఇండియాకు వెళ్లిపోవడం అస్సలు కుదరదు.

Advertisement

ఈ ఆసియా క్రీడాలలో ట్రోఫీ తీసుకోకుండా వెళితే కఠినమైన క్రమశిక్షణ చర్యలతో పాటు జరిమానాలు విధించే అవకాశాలు ఉంటాయని నివేదికలు చెబుతున్నాయి. ఇలాంటి నేపథ్యంలో టీమిండియా క్రికెటర్లు.. మెడల్స్ తీసుకుంటారా ? లేక బహిష్కరిస్తారా ? అనేది ఆసక్తిగా మారింది. ఈ విషయంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి పెద్దలు కూడా తలలు పట్టుకుంటున్నట్లు చెబుతున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.

inzamam-ul-haq Comments on Abhishek Sharma Century Celebration : అస‌లు అభిషేక్ శ‌ర్మకు సిగ్గుందా.. మైదానంలో హిందూ మ‌తాన్ని ప్ర‌చారం చేస్తారా ?

 

Related News

ఇండియాలో హిందూ రాజ్యం న‌డుస్తోంది…షాహిద్ అఫ్రిది సంచ‌ల‌నం !

విడాకులు ఇవ్వ‌డం, కొత్త అమ్మాయిల‌తో తిర‌గ‌డం త‌ప్ప పాండ్యాకు ఏదీ చేత‌కాదు

వివాదంలో శ్రేయస్ అయ్యర్.. అసభ్య సైగలు చేస్తూ దొరికిపోయిన కెప్టెన్

ష‌మీ, భువ‌నేశ్వ‌ర్ కుమార్ ప‌ని అయిపోయింది..ఇక రిటైర్మెంట్ ఇచ్చేయండి

CSKతో పాటు ధోని కెరీర్ మార్చేశాడు..కానీ చివరకు అప్పుల బాధతో ఆత్మహ*త్య చేసుకున్నాడు

ఫ్లాట్ పిచ్ పైనే అభిషేక్ శర్మ ప్రతాపం… ఇజ్జత్ తీసిన రవిశాస్త్రి

హార్దిక్ పాండ్యా 10 ఓవర్లు వేయలేడు…బాంబ్ పేల్చిన గంభీర్

Big Stories

Advertisement
×