E-Paper
Advertisement

యంగ్ రైడర్స్ కోసం స్టడ్స్ క్రేజీ హెల్మెట్.. వావ్.. మరీ ఇంత తక్కువ ధరలోనా?

యంగ్ రైడర్స్ కోసం స్టడ్స్ క్రేజీ హెల్మెట్.. వావ్.. మరీ ఇంత తక్కువ ధరలోనా?
Advertisement

Studds Rider Youth Helmet: ప్రముఖ హెల్మెట్ తయారీ సంస్థ స్టడ్స్ భారత మార్కెట్లో కొత్త  రైడర్ యూత్ ఫుల్ ఫేస్ హెల్మెట్‌ ను విడుదల చేసింది. ముఖ్యంగా యువ రైడర్లు, టీనేజర్లు, అలాగే తల చిన్నగా ఉండే పెద్దలను దృష్టిలో పెట్టుకుని ఈ హెల్మెట్‌ ను రూపొందించింది. ప్రస్తుతం మార్కెట్లో ఎక్కువగా ఓపెన్ ఫేస్ యూత్ హెల్మెట్లు అందుబాటులో ఉండగా, స్టడ్స్ మాత్రం పూర్తి రక్షణ కల్పించే ఫుల్ ఫేస్ డిజైన్‌ తో ఈ కొత్త మోడల్‌ ను తీసుకువచ్చింది. ఈ హెల్మెట్ గడ్డం భాగాన్ని కూడా పూర్తిగా కవర్ చేసేలా రూపొందించారు. సాధారణ ఓపెన్ ఫేస్ హెల్మెట్లతో పోలిస్తే ప్రమాద సమయంలో మెరుగైన రక్షణ లభించే అవకాశం ఉంటుంది. రోజూ బైక్, స్కూటర్‌పై ప్రయాణించే యువతకు ఇది మంచి ఆప్షన్ గా కంపెనీ చెబుతోంది.

రెండు సైజుల్లో కొత్త హెల్మెట్లు

స్టడ్స్ రైడర్ యూత్ రెండు సైజుల్లో అందుబాటులోకి వచ్చింది. XXS, XS సైజ్‌లలో లభిస్తుంది. చిన్న సైజ్ తల ఉన్న పిల్లలు, టీనేజర్లతో పాటు కొంతమంది పెద్దలకు కూడా ఇది సౌకర్యంగా ఉంటుంది. సరైన ఫిట్ ఉండటం వల్ల ప్రయాణ సమయంలో హెల్మెట్  అద్దినట్లుగా ఉండటంతో పాటు భద్రత కూడా మెరుగుపడుతుంది.

భద్రత గురించి..

Advertisement

భద్రత విషయానికి వస్తే, ఈ హెల్మెట్‌లో ABS ఔటర్ షెల్ ఉపయోగించారు. ప్రమాద సమయంలో మంచి రక్షణ అందించేందుకు లోపల EPS లైనర్ కూడా అమర్చారు. అంతేకాదు, ఈ హెల్మెట్‌ కు ISI సర్టిఫికేషన్ ఉండటంతో భారత భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా తయారైన ఉత్పత్తిగా చెప్పవచ్చు. ఎక్కువసేపు హెల్మెట్ ధరించినా అసౌకర్యం కలగకుండా ఉండేందుకు వెంటిలేషన్ వ్యవస్థను కూడా అందించారు. పైభాగంలో ఎయిర్ వెంట్స్, వెనుకవైపు ఎగ్జాస్ట్ వెంట్స్ ఉండటంతో గాలి ఈజీగా ప్రసరిస్తుంది. తలలో వేడి, చెమట కొంతవరకు తగ్గే అవకాశం ఉంటుంది. లోపలి భాగంలో మైక్రోఫైబర్ ఫ్యాబ్రిక్ లైనింగ్ ఉండటంతో ధరించినప్పుడు మరింత సౌకర్యంగా అనిపిస్తుంది.

మొత్తం 12 రంగుల్లో అందుబాటులోకి..

రంగుల విషయంలో కూడా స్టడ్స్ మంచి ఆప్షన్స్ అందిస్తోంది. ఈ హెల్మెట్ మొత్తం 12 మోనోటోన్ కలర్స్లో  లభిస్తోంది. వైట్, బ్లాక్, చెర్రీ రెడ్, ఫ్లేమ్ బ్లూ, లావెండర్ పింక్, పాస్టెల్ గ్రీన్, పెట్రోల్ బ్లూ, డార్క్ పింక్, కెమిలియన్ పింక్, కెమిలియన్ బ్లూ, మ్యాట్ బ్లాక్, మిలిటరీ గ్రీన్ లాంటి రంగుల్లో కొనుగోలు చేయవచ్చు. భవిష్యత్తులో గ్రాఫిక్ డిజైన్లతో కూడిన కొత్త వేరియంట్లను కూడా కంపెనీ మార్కెట్లోకి తీసుకురానుంది.

తక్కువ ధరలో..

Advertisement

స్టడ్స్ రైడర్ యూత్ ఫుల్ ఫేస్ హెల్మెట్ ప్రారంభ ధర రూ.1,175గా నిర్ణయించారు. ఈ హెల్మెట్‌ ను దేశ వ్యాప్తంగా ఉన్న ఆథరైజ్డ్ స్టడ్స్ డీలర్‌ షిప్‌ లు, కంపెనీ ఎక్స్‌ క్లూజివ్ స్టోర్లు, అధికారిక ఆన్‌ లైన్ స్టోర్ ద్వారా కొనుగోలు చేసే అవకాశం ఉంది.

Read Also: ఈ హెల్మెట్లు పెట్టుకుంటే.. జుట్లు రాలే సమస్యలే ఉండవట, వెంటనే కొనేయండి!

Tags

Related News

KTM 390 అడ్వెంచర్ X ధర పెంపు, ఇప్పుడు కాస్ట్ ఎంత అంటే?

జస్ట్ రూ.99 వేలకే కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. రేంజ్ ఏంతో తెలిస్తే మతిపోవాల్సిందే!

టాటా నెక్సాన్ కామో ఎడిషన్ లాంచ్.. వారెవ్వా.. ఏం ఫీచర్లు గురూ!

టెస్లా, BYDలకు షాక్.. భారత ఈవీలకు ప్రపంచ గుర్తింపు!

తెలుగు రాష్ట్రాల్లో ఈవీ ఛార్జింగ్ స్టేషన్లతో డబ్బే డబ్బు.. ఇలా చేస్తే చాలు!

వాహనాలకు ఇన్సురెన్స్ అవసరమా? దాని వల్ల ఉపయోగాలేంటీ?

ఈవీ మార్కెట్ లో టీవీఎస్ దూకుడు.. జస్ట్ 7 నెలల్లో 3 లక్షలకుపైగా స్కూటర్ల సేల్!

కియా కార్లపై భారీ ఆఫర్లు.. ఆ మోడల్ పై ఏకంగా రూ.1.5 లక్షల తగ్గింపు!

Big Stories

Advertisement
×