E-Paper
Advertisement

పళనిస్వామికి బిగ్ షాక్.. ముగ్గురు అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు రాజీనామా.. ఎందుకంటే?

పళనిస్వామికి బిగ్ షాక్.. ముగ్గురు అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు రాజీనామా.. ఎందుకంటే?
Advertisement

AIADMK MLAs Resign: తమిళనాడు రాజకీయాల్లో మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. అంతర్గత సంక్షోభంతో అల్లాడుతున్న మాజీ సీఎం పళనిస్వామి నేతృత్వంలోని అన్నాడీఎంకే పార్టీకి తాజాగా ఇంకో ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ తరపున గెలిచిన ముగ్గురు ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేస్తూ.. సీఎం విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీలో చేరారు. ఈ మేరకు ఎమ్మెల్యేలు మరగతం కుమారవేల్, జయకుమార్, సత్యభామ తమ రాజీనామా పత్రాలను అసెంబ్లీ స్పీకర్ జేసీడీ ప్రభాకర్ కు సమర్పించారు.

తిరుగుబాటు బృందంలో..

ఇటీవల అన్నాడీఎంకే సీనియర్ నేత సి.వి షణ్ముగం నేతృత్వంలో 25 మంది ఎమ్మెల్యేలు.. టీవీకే ప్రభుత్వానికి మద్దతు ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా రాజీనామా చేసిన ముగ్గురు ఎమ్మెల్యేలు.. ఆ తిరుగుబాటు బృందంలోని వారు కావడం గమనార్హం. కుమార వేల్.. ‘మదురాంతకం నియోజకవర్గం’ నుంచి, సత్యభామ ‘ధారపురం’ నుంచి, జయకుమార్ ‘పెరుందరై’ నుంచి ఎమ్మెల్యేలుగా ఉన్నారు. ఇటీవల జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో వారు అన్నాడీఎంకే టికెట్లపై విజయం సాధించారు.

టీవీకే తరుపున బరిలో..

Advertisement

తమ పదవులకు రాజీనామాను సమర్పించిన అనంతరం వారు టీవీకే మంత్రి ఆదవ్ అర్జున్ ను ఆయన ఛాంబర్ లో కలిశారు. తమ మద్దతును టీవీకే పార్టీకి అధికారికంగా తెలియజేశారు. ఇకపై తమ రాజకీయ ప్రయాణం టీవీకే పార్టీతోనే అన్న సంకేతాలను ఈ ముగ్గురు నేతలు ఇచ్చారు. వీరి రాజీనామాను తమిళనాడు అసెంబ్లీ స్పీకర్ ఆమోదిస్తే.. త్వరలోనే వారి స్థానాల్లో ఉపఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే సీఎం విజయ్ తన రెండో ఎమ్మెల్యే స్థానమైన ‘తిరుచ్చి ఈస్ట్’ స్థానానికి రాజీనామా చేశారు. త్వరలోనే ఈ స్థానంలో ఉప ఎన్నిక జరగనుంది. తాజాగా ముగ్గురు అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు రాజీనామా చేసిన నేపథ్యంలో తిరుచ్చి ఈస్ట్ తో పాటు ఆ మూడు స్థానాలకు కూడా ఉపఎన్నికలు వచ్చే ఛాన్స్ ఉంది. అదే జరిగితే రాజీనామా చేసిన కుమారవేల్, జయకుమార్, సత్యభామ.. టీవీకే పార్టీ తరపున బరిలోకి దిగే సూచనలు కనిపిస్తున్నాయి.

Also Read: ఏసీ అవుట్‌డోర్ యూనిట్ పేలకుండా ఉండాలా? ఈ 6 జాగ్రత్తలు మీ కోసమే!

అన్నాడీఎంకేలో సంక్షోభం

Advertisement

ఇటీవల టీవీకే ప్రభుత్వ విశ్వాస పరీక్షలో అన్నాడీఎంకేకు చెందిన 25 మంది ఎమ్మెల్యేలు.. విజయ్ సర్కార్ కు మద్దతు ప్రకటించారు. అయితే వీరిలోని ఐదుగురు ఎమ్మెల్యేలు.. కొద్దిరోజుల క్రితం తిరిగి పళనిస్వామి శిబిరానికి తిరిగి వెళ్లిపోయారు. దీంతో విజయ్ కు లభించిన అన్నాడీఎంకే ఎమ్మెల్యేల మద్దతు 25 నుంచి 17కి తగ్గినట్లైంది. కాగా, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పళనిస్వామి నేతృత్వలోని అన్నా డీఎంకే పార్టీ 47 స్థానాలను గెలుచుకుంది. ప్రస్తుతం ఎవరు ఉంటారో, ఎవరు పార్టీని వీడతారో తెలియక సంక్షోభంలో ఆ పార్టీ కొట్టుమిట్టాడుతోంది. మరోవైపు సీఎం విజయ్ కి చెందిన టీవీకే పార్టీ ఎన్నికల్లో 108 స్థానాల్లో విజయం సాధించగా.. కాంగ్రెస్, ఐయూఎంఎల్, వీసీకే, వామపక్షాలు, అన్నాడీఎంకే (వేర్పాటు వర్గం) మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

Also Read: కొత్త కారుతో ORRపై స్టంట్లు.. 200 కి.మీ వేగంతో రయ్ రయ్.. కట్ చేస్తే జైలు పాలు!

Related News

స్పామ్, ఫ్రాడ్ కాల్స్‌ టెన్షన్‌కు ఇక చెక్.. కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం?

ప్రపంచాన్ని సైతం కదిలించిన చరిత్ర.. అక్టోబర్ 17 ప్రత్యేకత ఏమిటో మీకు తెలుసా..?

డేంజర్ బెల్స్.. ఏఐతో భారీగా పర్యావరణం విధ్వంసం.. ఎలానో తెలుసా..?

ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత.. అభిజిత్ దీప్కే ‘తిరంగా యాత్ర’ అడ్డుకున్న పోలీసులు.. ఇంటికెళ్లి నోటీసులు అందజేత!

అమ్మబాబోయ్.. 75 ఏళ్ల తాతతో 30 ఏళ్ల యువతి పెళ్లి.. నిశ్చితార్థం వీడియో వైరల్!

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. రైల్వేలో 1,688 ఖాళీలు, సాలరీ, దరఖాస్తు పూర్తి వివరాలివిగో

నా ఇంటి చుట్టూ నిఘా పెట్టారు.. ఏ క్షణమైనా అరెస్ట్ చేయవచ్చు, సీజేపీ ఫౌండర్ అభిజిత్ దీప్కే

ఉక్రెయిన్ యుద్ధభూమిలో ఎలాన్ మస్క్ బిగ్ ట్విస్ట్..?

Big Stories

Advertisement
×