E-Paper
Advertisement

ఆ సినిమాలో ఏజ్ గ్యాప్‌పై ట్రోల్స్.. అసలు రహస్యం బయటపెట్టి నెటిజన్ల నోళ్లు మూయించిన భాగ్యశ్రీ!

ఆ సినిమాలో ఏజ్ గ్యాప్‌పై ట్రోల్స్..  అసలు రహస్యం బయటపెట్టి నెటిజన్ల నోళ్లు మూయించిన భాగ్యశ్రీ!
Advertisement

Bhagyashree : ‘రాజా శివాజీ’…బాలీవుడ్ వెర్సటైల్ యాక్టర్ రితేష్ దేశ్‌ముఖ్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన చరిత్రాత్మక దృశ్యకావ్యం ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయి బాక్సాఫీస్ వద్ద ఏకంగా వంద కోట్లు కొల్లగొట్టిన సంగతి తెల్సిందే.ఇక ఈ సినిమాలో శివాజీ మహారాజ్ పాత్రలో రితేష్ నటన మెస్మరైజ్ చేయగా.అతన్ని వీరుడిగా, ధర్మరక్షకుడిగా తీర్చిదిద్దిన తల్లి రాజమాత జిజాబాయి పాత్రకు కూడా ప్రేక్షకుల నుండి థియేటర్లలో మంచి గుర్తింపే దక్కింది.ఇక సిల్వర్ స్క్రీన్ పై ఎంతో హుందాగా, పవర్‌ఫుల్‌గా కనిపించిన ఈ కీలక పాత్రలో బాలీవుడ్ సీనియర్ ఎగర్‌గ్రీన్ బ్యూటీ భాగ్యశ్రీ నటించింది.

రాజమాత జిజాబాయి పాత్ర కెరీర్‌ బెస్ట్ 

Advertisement

1989లో సల్మాన్ ఖాన్ సరసన ‘మైనే ప్యార్ కియా’ (Maine Pyar Kiya) చిత్రంతో ఇండస్ట్రీని ఒక ఊపు ఊపేసిన భాగ్యశ్రీ, ఈ మధ్య రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ‘రాధే శ్యామ్’ (Radhe Shyam) సినిమాలో తళుక్కుమంది కూడా. అయితే సెకండ్ ఇన్నింగ్స్ లో మాత్రం ‘రాజా శివాజీ’లో ఆమె పోషించిన రాజమాత జిజాబాయి పాత్రే ఆమె కెరీర్‌లో బెస్ట్ అని చెప్పవచ్చు.

అయితే సినిమాలో భాగ్యశ్రీ పోషించిన పాత్రకి ఎంత పేరొచ్చిందో , నెగెటివిటీ కూడా అదే స్థాయిలో వినిపిస్తుంది.ముఖ్యంగా నిజజీవితంలో రితేష్ దేశ్‌ముఖ్ వయసు కంటే కేవలం 10 సంవత్సరాలు మాత్రమే పెద్దదైన భాగ్యశ్రీ కి తల్లి పాత్ర ఎలా ఇచ్చారన్నది వాళ్ళ ఆర్గ్యుమెంట్.

Advertisement

10 ఏళ్ల ఏజ్ గ్యాప్ ఉన్న రితేష్‌కు తల్లిగా

మాములుగానే ఫిలిం ఇండస్ట్రీలో ఏజ్ బార్ అవుతున్నా లీడ్ రోల్స్ దక్కుతుంటాయి, కానీ హీరోయిన్లకు వయసు ఏమాత్రం పెరిగిందనిపించినా వెంటనే తల్లి రోల్స్ కి షిఫ్ట్ చేస్తుంటారనే నెగెటివ్ విమర్శలు ఎప్పటినుంచో ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే కేవలం 10 ఏళ్ల ఏజ్ గ్యాప్ ఉన్న రితేష్‌కు తల్లిగా నటించడానికి భాగ్యశ్రీ ఎలా ఒప్పుకున్నారనే కామెంట్స్ ఇపుడు సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి.దీంతో ఈ క్వశ్చన్స్ కి ఎండ్ కార్డ్ వేసి, విమర్శకుల నోళ్ళు మూయిస్తూ ఇలా క్లారిటీ ఇచ్చింది భాగ్యశ్రీ.

also read :ఎగ్జిబిటర్ల పరిస్థితి చూస్తే జాలేస్తోంది.. టాలీవుడ్ సంక్షోభంపై బాలయ్య షాకింగ్ కామెంట్స్!

మనం చిన్నప్పటి నుంచి వింటూ పెరిగిన మహనీయుల కథల్లో ఒక చారిత్రాత్మక పాత్ర పోషించే అవకాశం వస్తే దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోలేమని స్పష్టం చేసింది ఈ వెటరన్ బ్యూటీ. రాజమాత జిజాబాయి లాంటి పవర్‌ఫుల్ పాత్ర లభించినప్పుడు కేవలం స్క్రీన్ టైమ్ లేదా వయస్సు ఎంత ఏంటి అనే విషయాలని అస్సలు పట్టించుకోవద్దని తేల్చి చెప్పింది.నటిగా తనను తాను నిరూపించుకోవడానికి ఇలాంటి పాత్రలు ఒక వరం లాంటివని కుండ బద్దలు కొట్టేసింది.దీంతో పాటే ఈ సినిమాలో తన లుక్ వెనుక ఉన్న అసలు రహస్యాన్ని కూడా బయటపెట్టేసింది భాగ్యశ్రీ.

సంతోష్ శివన్ విజువల్ మ్యాజిక్ వల్లే సాధ్యం

ఇండియన్ సినిమాలోనే వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ సినిమాటోగ్రాఫర్ అయిన సంతోష్ శివన్ (Santosh Sivan) స్వయంగా తనను ఈ పాత్ర కోసం సంప్రదించారని తెలిపింది. స్క్రీన్‌పై రితేష్‌కు తల్లిగా పర్‌ఫెక్ట్‌గా సెట్ అవ్వడం కోసం ఎలాంటి గ్రాఫిక్స్ వాడకుండా, కేవలం ప్రత్యేకమైన కెమెరా లైటింగ్ టెక్నిక్స్ మరియు సహజసిద్ధమైన మేకప్ ద్వారా తనను కొంచెం వయసు పైబడినట్లుగా చూపించారని అసలు విషయం చెప్పుకొచ్చింది. సంతోష్ శివన్ విజువల్ మ్యాజిక్ వల్లే రాజమాత జిజాబాయి పాత్రకు అంతటి గాంభీర్యం వచ్చిందని భాగ్యశ్రీ ఆకాశానికి ఎత్తేసింది ఈ అలనాటి స్టార్ హీరోయిన్.

also read :వివేక్ ఆత్రేయ-బాలకృష్ణ ప్రాజెక్ట్ ఆగిపోవడానికి అసలు కారణం ఇదేనా?

ఇక సినిమా డైరెక్టర్ విషయానికి గతంలో రితేష్ ‘లయ్ భారీ’ (Lai Bhaari), ‘వేద్’ (Ved) వంటి బ్లాక్‌బస్టర్ మరాఠీ చిత్రాలతో సత్తా చాటినప్పటికీ, ‘రాజా శివాజీ’తో దర్శకుడిగా మరియు నటుడిగా తన కెరీర్‌లోనే మైల్‌స్టోన్ హిట్‌ను అందుకోవడం విశేషం.

Related News

వారికి అభినందనలు తెలిపిన ఏపీ డిప్యూటీ సీఎం!

వారణాసి షూటింగ్ పై క్రేజీ అప్డేట్.. జక్కన్న ఏం ప్లాన్ చేస్తున్నావయ్యా?

ఎమోషనల్ గా ‘చెన్నై లవ్ స్టోరీ’ ట్రైలర్.. కిరణ్ ఖాతాలో మరో హిట్?

ఫిగర్ బాలేదని టార్చర్.. 40 ఏళ్లొచ్చాకే ఆ నరకం నుండి బయటపడ్డానంటున్న తారక్ హీరోయిన్

యాంకర్ సుమ హీరోయిన్‌గా నటించిన ఏకైక సినిమా ఏంటో తెలుసా ?

‘టాక్సిక్’ ట్రైలర్ డేట్ ఫిక్స్..ఇదైనా ఖాయమా యష్?

72వ జాతీయ అవార్డుల్లో సత్తా చాటిన తెలుగు సినిమాలు.. ఉత్తమ చిత్రం ఏదంటే?

విక్రమ్ 1 సక్సెస్.. చిరు ఫిదా: ప్రైవేట్ రాకెట్ ప్రయోగంపై మెగాస్టార్ క్రేజీ రియాక్షన్!

Big Stories

Advertisement
×