E-Paper
Advertisement

కొత్త కారుతో ORRపై స్టంట్లు.. 200 కి.మీ వేగంతో రయ్ రయ్.. కట్ చేస్తే జైలు పాలు!

కొత్త కారుతో ORRపై స్టంట్లు.. 200 కి.మీ వేగంతో రయ్ రయ్.. కట్ చేస్తే జైలు పాలు!
Advertisement

ORR Speeding: హైదరాబాద్ లోని ఔటర్ రింగ్ రోడ్డు (ORR)పై అతి వేగంగా కారు నడిపి తోటి వాహనదారులను భయభ్రాంతులకు గురిచేసిన వ్యక్తిని నార్సింగి పోలీసులు అరెస్టు చేశారు. కారును సీజ్ చేసి నిందితుడ్ని కటకటాల్లోకి పంపారు. ఇటీవల కొత్త కారు కొన్న నిందితుడు.. దాని గరిష్ట వేగాన్ని టెస్ట్ చేయాలని భావించాడు. ఈ క్రమంలో ఓఆర్ఆర్ పై 200 కి.మీ పైగా వేగంతో కారు నడపడటమే కాకుండా దానిని రీల్ చేసి.. సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అది కాస్త పోలీసుల కంట పడటంతో నిందితుడు అడ్డంగా బుక్కయ్యాడు.

మణికొండ అల్కాపూర్ టౌన్ షిప్ కు చెందిన కొత్తపల్లి యశ్వంత్ రెడ్డి (32) ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు. ఇటీవల అతడు ఖరీదైన వోక్స్ వ్యాగన్ కారును కొనుగోలు చేశాడు. ఈ క్రమంలో ఈ నెల 10న కారును నార్సింగి నుంచి తెలంగాణ పోలీసు అకాడమీ వైపు 200 కి.మీ వేగంతో నడిపాడు. అంతటితో ఆగకుండా దానిని వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో అప్ లోడ్ చేశాడు.

Advertisement

Also Read: షాపింగ్ మీది.. బ్యాగుల బరువు మాది.. స్టార్టప్ కంపెనీ క్రేజీ ఐడియా!

Advertisement

అది కాస్త వైరల్ గా మారడంతో.. ఆ వీడియో ఓఆర్ఆర్ పెట్రోలింగ్ ఆఫీసర్ కారింగుల సాయిరాం కంటపడింది. దీంతో 19వ తేదీన నార్సింగ్ పోలీసు స్టేషన్ లో ఆయన ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో రంగంలోకి దిగిన పోలీసులు.. ఆదివారం కొత్తపల్లి యశ్వంత్ రెడ్డిని అరెస్టు చేశారు. కొత్తగా కొన్న వోక్స్ వ్యాగన్ కారును సైతం సీజ్ చేశారు. కొత్త కారు సామర్థ్యాన్ని చెక్ చేయడం కోసమే ఓఆర్ఆర్ పై వేగంగా నడిపినట్లు యశ్వంత్ రెడ్డి పోలీసుల ఎదుట అంగీకరించాడు.

Also Read: దేశంలో విచిత్రం.. ఆ రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. ఈ రాష్ట్రాల్లో సెగలు కక్కే ఎండలు!

Related News

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

ఆదిభట్ల గౌరా ఎయిరోస్పేస్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఎగిసిపడిన మంటలు, రంగంలోకి ఫైర్ ఫైటర్స్!

Big Stories

Advertisement
×